నేను 1966 లో వచ్చిన డబ్బింగ్ చిత్రం సర్వర్ సుందరం, తెలుగులో వచ్చిన శ్రీకృష్ణ పాండవీయం, పరమానందయ్య శిష్యుల కధ చిత్రాలు చూసి, కధానాయిక కె.ఆర్ విజయను ఎంతగానో అభిమానించాను ఆవిడ నవ్వే ఒక ప్రత్యేక ఆకర్షణ ఏకవీర చిత్రం టైటిల్ రోల్ పోషించిన కె.ఆర్. విజయగారి పేరు ముందుగా నవ్వుల వెన్నెల రాణి అని అభివర్ణించారు డా.సి. నారాయణరెడ్డి, ఆవిడను ఎంతగానో అభిమానించిన నేను ఎప్పటికైనా వారిని చూడాలని, వీలైతే ఆవిడతో ఒక సినిమా తీయాలని బలంగా కోరుకున్నాను. అది జరిగిన 25 ఏళ్ళకు నా కల నెరవేరింది. నేను కథ, మాటలు వ్రాసి నిర్మాణంలో పాలు పంచుకున్న శుక్రవారం మహాలక్ష్మి చిత్రంలో ఆమె టైటిల్ రోల్ పోషించారు. ఆవిధంగా నా కల సఫలీకృతం అయ్యింది. ఆ చిత్రం 1992 లో విడుదలైంది.
నా మిత్రుడు చిరంజీవి వైట్ల కిషోర్ కుమార్ త్రిముఖుడు రాజకీయ పరిజ్ఞానం కలిగినవాడు, సినీ పరిజ్ఞానం కలిగినవాడు, వృత్తి రీత్యా వ్యవసాయధారుడు, అటువంటి వ్యక్తికి సినిమాలపై మక్కువ, అభిరుచి, అభినివేశం కలగడం నాకు ఆశ్చర్యం కలిగించింది. తన సినీ పరిజ్ఞానాన్ని పురస్కరించుకుని గతంలో అభినందన మందార మాల, నీరాజనం జయనీరాజనం అనే రెండు సినీ గ్రంధాలు వెలువరించారు.......................
కళారత్న విజయం అభినయ సౌందర్య నిలయ కె.ఆర్. విజయ జీవిత చిత్ర ముందుమాట శతధా ప్రశంసనీయం. నేను 1966 లో వచ్చిన డబ్బింగ్ చిత్రం సర్వర్ సుందరం, తెలుగులో వచ్చిన శ్రీకృష్ణ పాండవీయం, పరమానందయ్య శిష్యుల కధ చిత్రాలు చూసి, కధానాయిక కె.ఆర్ విజయను ఎంతగానో అభిమానించాను ఆవిడ నవ్వే ఒక ప్రత్యేక ఆకర్షణ ఏకవీర చిత్రం టైటిల్ రోల్ పోషించిన కె.ఆర్. విజయగారి పేరు ముందుగా నవ్వుల వెన్నెల రాణి అని అభివర్ణించారు డా.సి. నారాయణరెడ్డి, ఆవిడను ఎంతగానో అభిమానించిన నేను ఎప్పటికైనా వారిని చూడాలని, వీలైతే ఆవిడతో ఒక సినిమా తీయాలని బలంగా కోరుకున్నాను. అది జరిగిన 25 ఏళ్ళకు నా కల నెరవేరింది. నేను కథ, మాటలు వ్రాసి నిర్మాణంలో పాలు పంచుకున్న శుక్రవారం మహాలక్ష్మి చిత్రంలో ఆమె టైటిల్ రోల్ పోషించారు. ఆవిధంగా నా కల సఫలీకృతం అయ్యింది. ఆ చిత్రం 1992 లో విడుదలైంది. నా మిత్రుడు చిరంజీవి వైట్ల కిషోర్ కుమార్ త్రిముఖుడు రాజకీయ పరిజ్ఞానం కలిగినవాడు, సినీ పరిజ్ఞానం కలిగినవాడు, వృత్తి రీత్యా వ్యవసాయధారుడు, అటువంటి వ్యక్తికి సినిమాలపై మక్కువ, అభిరుచి, అభినివేశం కలగడం నాకు ఆశ్చర్యం కలిగించింది. తన సినీ పరిజ్ఞానాన్ని పురస్కరించుకుని గతంలో అభినందన మందార మాల, నీరాజనం జయనీరాజనం అనే రెండు సినీ గ్రంధాలు వెలువరించారు.......................© 2017,www.logili.com All Rights Reserved.