'మాల్గుడి నవలలు' వినూత్న ప్రయోగం
ఒక రచయిత తన కథలకు నవలలకు నేపథ్యంగా ఒక నిర్దిష్టమైన ప్రాంతాన్ని కల్పన చేసి ఆ ప్రాంతంలో మసిలే పాత్రలను, జరిగే సంఘటనలను చిత్రించడం ఒక అరుదైన అంశం. కాలానికి సంబంధం లేకుండా, తరాల అంతరం రాకుండా కథను సార్వకాలికం చేయడమూ అరుదైన విషయమే.
పాత్రలు మనకు బాగా పరిచయం అయిన వ్యక్తుల్లా ఉంటూ మన మనసుల్లో స్థానం సంపాదించడం సాధారణ విషయమేమీ కాదు. వాక్యాలవెంట కుతూహలంగా పరుగెత్తేట్టు చేయటం దృశ్యాలను కళ్ళముందు పేర్చటం, సున్నితమైన హాస్యం, వ్యంగ్యం కలిపి చదువరుల పెదాల మీద నవ్వులు వెలిగించటం కూడా అరుదైన
.
రచయిత మన కళ్ళ ఎదుట నిలిచి రసవత్తరంగా కథను వినిపిస్తాడు. కనుక పైన చెప్పిన అంశాలు, విషయాలు సాధ్యపడ్డవి. ఆ రచయిత రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి (ఆర్.కె. నారాయణ్).
1930వ దశకంలో భారతీయ ఆంగ్ల సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన సమకాలిక నవలా రచయితలు ముల్క్ రాజ్ ఆనంద్, ఆర్.కె. నారాయణ్, రాజారావులు. వీరి రచనలు భారతీయ సంస్కృతిని, జీవన విధానాన్ని విలువలను ప్రపంచానికి పరిచయం చేశాయి.
1960లో మద్రాసులో జన్మించిన ఆర్.కె. నారాయణ్ మొట్టమొదటి నవల...........
'మాల్గుడి నవలలు' వినూత్న ప్రయోగం ఒక రచయిత తన కథలకు నవలలకు నేపథ్యంగా ఒక నిర్దిష్టమైన ప్రాంతాన్ని కల్పన చేసి ఆ ప్రాంతంలో మసిలే పాత్రలను, జరిగే సంఘటనలను చిత్రించడం ఒక అరుదైన అంశం. కాలానికి సంబంధం లేకుండా, తరాల అంతరం రాకుండా కథను సార్వకాలికం చేయడమూ అరుదైన విషయమే. పాత్రలు మనకు బాగా పరిచయం అయిన వ్యక్తుల్లా ఉంటూ మన మనసుల్లో స్థానం సంపాదించడం సాధారణ విషయమేమీ కాదు. వాక్యాలవెంట కుతూహలంగా పరుగెత్తేట్టు చేయటం దృశ్యాలను కళ్ళముందు పేర్చటం, సున్నితమైన హాస్యం, వ్యంగ్యం కలిపి చదువరుల పెదాల మీద నవ్వులు వెలిగించటం కూడా అరుదైన . రచయిత మన కళ్ళ ఎదుట నిలిచి రసవత్తరంగా కథను వినిపిస్తాడు. కనుక పైన చెప్పిన అంశాలు, విషయాలు సాధ్యపడ్డవి. ఆ రచయిత రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి (ఆర్.కె. నారాయణ్). 1930వ దశకంలో భారతీయ ఆంగ్ల సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన సమకాలిక నవలా రచయితలు ముల్క్ రాజ్ ఆనంద్, ఆర్.కె. నారాయణ్, రాజారావులు. వీరి రచనలు భారతీయ సంస్కృతిని, జీవన విధానాన్ని విలువలను ప్రపంచానికి పరిచయం చేశాయి. 1960లో మద్రాసులో జన్మించిన ఆర్.కె. నారాయణ్ మొట్టమొదటి నవల...........© 2017,www.logili.com All Rights Reserved.