తొలితరం చారిత్రక చిత్రాలు
తెలుగు సినిమా 1932లో మాటలు నేర్చి, చలన చిత్రంగా ప్రజలముందుకొచ్చింది. సినిమాలో హెచ్.ఎమ్.రెడ్డి గారి భక్త ప్రహ్లాదతో, తొలితరంలో ఎక్కువగా పౌరిణిక చిత్రాలు,జానపద చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. గూడవల్లి రామబ్రహ్మం గారి “మాలపిల్ల”విజయం తరువాత సాంఘిక చిత్రాల నిర్మాణం ఊపందు కున్నాయి. వీటంన్నీటీ మధ్యలో చారిత్రక చిత్రాలు అక్కడక్కడ తళుక్కుమన్నా యి. 1933 లో ఈస్టిండిమా కంపెనీ, రామదాసు చిత్రం నిర్మించారు. అదే సంవత్సరం కృష్ణాఫిలిమ్స్ వారు సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో మరో రామ
దాసు నిర్మించారు. అలాగే 1936 లో కబీర్, 1938 లో తుకారాం చిత్రాలు నిర్మించారు. ఇవన్నీ భక్తి రసా త్మక చరిత్రలు,1937లో స్టార్ కంబైన్స్ పతాకం పై సారంగధర చిత్రాన్ని నిర్మించారు. 1940లో హెచ్. వి.బాబు దర్శకత్వంలో "భోజ కాళిదాసు”తెరకెక్కింది. అలాగే 1941లో హెచ్.ఎమ్.రెడ్డి గారి దర్శకత్వం లో “తెనాలి రామకృష్ణ” చిత్రం రూపొందించారు. ఇవన్నీ తొలితరం చారిత్రక చిత్రాలు, కానీ ఇప్పుడు వీటి ఆనవాళ్ళు ఎక్కడా లేవు కేవలం పొస్టర్లు తప్ప ప్రింట్లు అందుబాటులో లేవు. 1943లో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ “వాహిని పిక్చర్స్” పతాకంపై బి.యన్.రెడ్డి నిర్మాతగా ఆయన శిష్యులు కె.వి.రెడ్డి గారు తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం భక్త పోతన, అటు పై 1947లో అదే వాహిని పతాకం పై కె.వి.రెడ్డి గారు రూపొందించిన చిత్రం "యోగి వేమన ”ఈ రెండు చిత్రాలలో నాగయ్య గారు నాయకుడిగా నటించారు. అదే చిత్తూరు నాగయ్య గారు తమ సొంత నిర్మాణ సంస్థ రేణుకా ఫిలింస్ పతాకం పై స్వీయ దర్శకత్వంలో రూపొందించిన త్యాగయ్య" చిత్రం ఘనవిజయం సాధించింది. అదృష్టవశాత్తూ భక్త పోతన, యోగి వేమన త్యాగయ్య చిత్రాల ప్రింట్లు మంచి క్వాలీటితో మనకు అందుబాటులో వున్నాయి. ఇప్పుడు ఈ తొలి తరపు చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.......................
తొలితరం చారిత్రక చిత్రాలు తెలుగు సినిమా 1932లో మాటలు నేర్చి, చలన చిత్రంగా ప్రజలముందుకొచ్చింది. సినిమాలో హెచ్.ఎమ్.రెడ్డి గారి భక్త ప్రహ్లాదతో, తొలితరంలో ఎక్కువగా పౌరిణిక చిత్రాలు,జానపద చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. గూడవల్లి రామబ్రహ్మం గారి “మాలపిల్ల”విజయం తరువాత సాంఘిక చిత్రాల నిర్మాణం ఊపందు కున్నాయి. వీటంన్నీటీ మధ్యలో చారిత్రక చిత్రాలు అక్కడక్కడ తళుక్కుమన్నా యి. 1933 లో ఈస్టిండిమా కంపెనీ, రామదాసు చిత్రం నిర్మించారు. అదే సంవత్సరం కృష్ణాఫిలిమ్స్ వారు సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో మరో రామ దాసు నిర్మించారు. అలాగే 1936 లో కబీర్, 1938 లో తుకారాం చిత్రాలు నిర్మించారు. ఇవన్నీ భక్తి రసా త్మక చరిత్రలు,1937లో స్టార్ కంబైన్స్ పతాకం పై సారంగధర చిత్రాన్ని నిర్మించారు. 1940లో హెచ్. వి.బాబు దర్శకత్వంలో "భోజ కాళిదాసు”తెరకెక్కింది. అలాగే 1941లో హెచ్.ఎమ్.రెడ్డి గారి దర్శకత్వం లో “తెనాలి రామకృష్ణ” చిత్రం రూపొందించారు. ఇవన్నీ తొలితరం చారిత్రక చిత్రాలు, కానీ ఇప్పుడు వీటి ఆనవాళ్ళు ఎక్కడా లేవు కేవలం పొస్టర్లు తప్ప ప్రింట్లు అందుబాటులో లేవు. 1943లో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ “వాహిని పిక్చర్స్” పతాకంపై బి.యన్.రెడ్డి నిర్మాతగా ఆయన శిష్యులు కె.వి.రెడ్డి గారు తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం భక్త పోతన, అటు పై 1947లో అదే వాహిని పతాకం పై కె.వి.రెడ్డి గారు రూపొందించిన చిత్రం "యోగి వేమన ”ఈ రెండు చిత్రాలలో నాగయ్య గారు నాయకుడిగా నటించారు. అదే చిత్తూరు నాగయ్య గారు తమ సొంత నిర్మాణ సంస్థ రేణుకా ఫిలింస్ పతాకం పై స్వీయ దర్శకత్వంలో రూపొందించిన త్యాగయ్య" చిత్రం ఘనవిజయం సాధించింది. అదృష్టవశాత్తూ భక్త పోతన, యోగి వేమన త్యాగయ్య చిత్రాల ప్రింట్లు మంచి క్వాలీటితో మనకు అందుబాటులో వున్నాయి. ఇప్పుడు ఈ తొలి తరపు చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.......................© 2017,www.logili.com All Rights Reserved.