అభినయ మంజరి - కృష్ణ కుమారి
మలయ సమీరుడు మనసై మలచిన
మధుమయ శిల్పం, రాగజగతికే రక్తిని పిలిచె రసమయ రూపం. శ్రీనాధ కవినాధ శృంగార కవితా ప్రబంధాల కావ్యనాయిక, అమర గానాల అపురూప అభినయ వేదిక, నవ్య కళారూపాల చిత్ర జగత్తున వెలిసిన నవరస నటమంజరి, అభినయఝురి కృష్ణ కుమారి.
అప్పుడే పుష్పించి వికశిస్తున్న తెలుగు సినీ పారిజాతవనంలో తళుక్కున మెరిసిందొక బంగార పాప అభినయ తరంగాల అమర నాట్యాల తెలియాడించిన భువనసుందరి,రసిక కళాహృదయాలను రసవంతం చేసిన రసమయ నాయికి. సినీ సామ్రాజ్య సింహాసనంలో యువరాణిగా తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శించిన రాజు కుమారి, మహిళాలోకపు మనస్సులలో సాత్వికాభినయ సౌశీల్యవతిగా, సతీమతల్లిగా ముద్రవేసుకున్న సతీ తులసి. ఆమె రెండు దశాబ్దాలపాటు వెండితెపై కథానాయకిగా, కావ్యనాయకిగా వెలుగొందిన అభినయ మంజరి కృష్ణ కుమారి.
అమర శిల్పులు మనసుపెట్టి మలచిన సువర్ణశిల్పంలా ఉండే సౌందర్యం, కళ్ళతోనే కోటి భావాలు పలికించగల నేర్పరితనం, చిరునవ్వుల వెన్నెలతో యువ హృదయాలలో మరుమల్లెలు పూయించే రూపసౌందర్యం. ఏ పాత్రనైనా సునాయాసంగా అభినయించగల చాతుర్యం కృష్ణకుమారి సొంతం. అందుకే ఆమె రెండు దశాబ్దాలు తిరుగులేని కథానాయికగా వెండితెర పై వెలుగొందారు. తెలుగు సినిమా స్వర్ణయుగం నుండి వర్ణయుగం వరకు ఆమె అభినయ సౌరభాలు సినీపారిజాత వనంలో పరిమళించాయి.....................
అభినయ మంజరి - కృష్ణ కుమారి మలయ సమీరుడు మనసై మలచిన మధుమయ శిల్పం, రాగజగతికే రక్తిని పిలిచె రసమయ రూపం. శ్రీనాధ కవినాధ శృంగార కవితా ప్రబంధాల కావ్యనాయిక, అమర గానాల అపురూప అభినయ వేదిక, నవ్య కళారూపాల చిత్ర జగత్తున వెలిసిన నవరస నటమంజరి, అభినయఝురి కృష్ణ కుమారి. అప్పుడే పుష్పించి వికశిస్తున్న తెలుగు సినీ పారిజాతవనంలో తళుక్కున మెరిసిందొక బంగార పాప అభినయ తరంగాల అమర నాట్యాల తెలియాడించిన భువనసుందరి,రసిక కళాహృదయాలను రసవంతం చేసిన రసమయ నాయికి. సినీ సామ్రాజ్య సింహాసనంలో యువరాణిగా తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శించిన రాజు కుమారి, మహిళాలోకపు మనస్సులలో సాత్వికాభినయ సౌశీల్యవతిగా, సతీమతల్లిగా ముద్రవేసుకున్న సతీ తులసి. ఆమె రెండు దశాబ్దాలపాటు వెండితెపై కథానాయకిగా, కావ్యనాయకిగా వెలుగొందిన అభినయ మంజరి కృష్ణ కుమారి. అమర శిల్పులు మనసుపెట్టి మలచిన సువర్ణశిల్పంలా ఉండే సౌందర్యం, కళ్ళతోనే కోటి భావాలు పలికించగల నేర్పరితనం, చిరునవ్వుల వెన్నెలతో యువ హృదయాలలో మరుమల్లెలు పూయించే రూపసౌందర్యం. ఏ పాత్రనైనా సునాయాసంగా అభినయించగల చాతుర్యం కృష్ణకుమారి సొంతం. అందుకే ఆమె రెండు దశాబ్దాలు తిరుగులేని కథానాయికగా వెండితెర పై వెలుగొందారు. తెలుగు సినిమా స్వర్ణయుగం నుండి వర్ణయుగం వరకు ఆమె అభినయ సౌరభాలు సినీపారిజాత వనంలో పరిమళించాయి.....................© 2017,www.logili.com All Rights Reserved.