Okka Toota Chalu

By Manjari (Author)
Rs.350
Rs.350

Okka Toota Chalu
INR
MANIMN3918
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఒక్క తూటా సరిపోతుందా!

ఒక్క తూటా చాలు రచయిత మంజరితో నాకు పాతికేళ్ల పరిచయం. ఒకసారి విజయనగరంలో ఓ సాహితీ సమావేశానికి వెళ్ళినప్పుడు కలిసాడు. నేను విశాఖలో నివసిస్తుంటే, మంజరి కూడా అక్కడే ఉద్యోగం చేసేవాడు కాబట్టి మా పరిచయం వృద్ధి చెందింది. సాహిత్యమంటే ఒళ్ళు మరిచిపోయే మంజరి, సాహిత్య సృష్టికి స్వస్తి చెప్పిన నాకు దిక్సూచిలా తారసపడ్డాడు. ఇద్దరం కొన్ని సంవత్సరాల పాటు పార్కుల్లోను, రోడ్డు పక్క మంజరి రూంలోను కూర్చుని సాహితీ చర్చలు జరిపేవాళ్ళం. కాలం కదలిక మాకు తెలిసేది కాదు. నేను హైదరాబాద్ వెళ్ళిపోయాక పనిమీద విశాఖ వస్తే మంజరి రూంలోనే ఉండేవాడిని. చుట్టూ పుస్తకాలు పడి ఉంటే మధ్యలో ఓ కుర్చీలో కూర్చుని ఉండేవాడు.

రాయడం తక్కువ. చదవడం ఎక్కువ. చిరాగ్గా ఉన్న గది నేను సర్దుతుంటే నవ్వుతూ చూసేవాడు. అప్పుడే మంజరి బుర్రలో ఊపిరి పోసుకుంది" ఒక్క తూటా చాలు! "కథ. ఇన్వెస్టిగేషన్ నవలలు రాయడంలో మంజరి సిద్ధహస్తుడు. అతను కథ చెప్పే తీరుకూడా భిన్నంగా ఉంటుంది. నవలరాయడానికి అతను వాడే టెక్నిక్ నూతనమైంది. అన్ని నదులు చివరగా సముద్రంలో కలిసినట్టు, ఎక్కడెక్కడో ప్రారంభమైన సన్నివేశాలు అంతిమంగా కథలో కలవడం ఎంతో శ్రమిస్తే తప్ప అలవడే విద్య కాదు.

నేను, మంజరి కథలు రాసే కాలంలో విరివిగా తెలుగులో కథలు వెలువడుతూ ఉండేవి. పేరు మోసిన రచయితలు కూడా ఆంగ్లంలో వెలువడ్డ కథల్లోని వస్తువులను ఆసక్తికరంగా అటుఇటు మార్చి వార, మాస పత్రికల్లో రాసేవారు. ఇంచుమించు నా కథలు కూడా ఇంగ్లిష్ వాసన కొట్టేవి. ఆంగ్లంలో కథలు చదవడంకాని అర్థం చేసుకోవడం కాని చేతకాని మంజరి రచనలు నాకు అద్భుతంగా తోచేవి. పథకం, హిట్ లిస్ట్, ఐ లవ్ మై ఇండియా. అవును... అతనే! వంటి నవలలు అంత ఆసక్తి కరంగా ఎలా రాయగలిగే వాడో నాకు అర్ధమయ్యేది కాదు. సన్నివేశకల్పన, తార్కికత, విషయసేకరణవంటివి నన్ను............

ఒక్క తూటా సరిపోతుందా! ఒక్క తూటా చాలు రచయిత మంజరితో నాకు పాతికేళ్ల పరిచయం. ఒకసారి విజయనగరంలో ఓ సాహితీ సమావేశానికి వెళ్ళినప్పుడు కలిసాడు. నేను విశాఖలో నివసిస్తుంటే, మంజరి కూడా అక్కడే ఉద్యోగం చేసేవాడు కాబట్టి మా పరిచయం వృద్ధి చెందింది. సాహిత్యమంటే ఒళ్ళు మరిచిపోయే మంజరి, సాహిత్య సృష్టికి స్వస్తి చెప్పిన నాకు దిక్సూచిలా తారసపడ్డాడు. ఇద్దరం కొన్ని సంవత్సరాల పాటు పార్కుల్లోను, రోడ్డు పక్క మంజరి రూంలోను కూర్చుని సాహితీ చర్చలు జరిపేవాళ్ళం. కాలం కదలిక మాకు తెలిసేది కాదు. నేను హైదరాబాద్ వెళ్ళిపోయాక పనిమీద విశాఖ వస్తే మంజరి రూంలోనే ఉండేవాడిని. చుట్టూ పుస్తకాలు పడి ఉంటే మధ్యలో ఓ కుర్చీలో కూర్చుని ఉండేవాడు. రాయడం తక్కువ. చదవడం ఎక్కువ. చిరాగ్గా ఉన్న గది నేను సర్దుతుంటే నవ్వుతూ చూసేవాడు. అప్పుడే మంజరి బుర్రలో ఊపిరి పోసుకుంది" ఒక్క తూటా చాలు! "కథ. ఇన్వెస్టిగేషన్ నవలలు రాయడంలో మంజరి సిద్ధహస్తుడు. అతను కథ చెప్పే తీరుకూడా భిన్నంగా ఉంటుంది. నవలరాయడానికి అతను వాడే టెక్నిక్ నూతనమైంది. అన్ని నదులు చివరగా సముద్రంలో కలిసినట్టు, ఎక్కడెక్కడో ప్రారంభమైన సన్నివేశాలు అంతిమంగా కథలో కలవడం ఎంతో శ్రమిస్తే తప్ప అలవడే విద్య కాదు. నేను, మంజరి కథలు రాసే కాలంలో విరివిగా తెలుగులో కథలు వెలువడుతూ ఉండేవి. పేరు మోసిన రచయితలు కూడా ఆంగ్లంలో వెలువడ్డ కథల్లోని వస్తువులను ఆసక్తికరంగా అటుఇటు మార్చి వార, మాస పత్రికల్లో రాసేవారు. ఇంచుమించు నా కథలు కూడా ఇంగ్లిష్ వాసన కొట్టేవి. ఆంగ్లంలో కథలు చదవడంకాని అర్థం చేసుకోవడం కాని చేతకాని మంజరి రచనలు నాకు అద్భుతంగా తోచేవి. పథకం, హిట్ లిస్ట్, ఐ లవ్ మై ఇండియా. అవును... అతనే! వంటి నవలలు అంత ఆసక్తి కరంగా ఎలా రాయగలిగే వాడో నాకు అర్ధమయ్యేది కాదు. సన్నివేశకల్పన, తార్కికత, విషయసేకరణవంటివి నన్ను............

Features

  • : Okka Toota Chalu
  • : Manjari
  • : Classic Books
  • : MANIMN3918
  • : Paperback
  • : Nov, 2022
  • : 146
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Okka Toota Chalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam