మిస్టర్ జీరో
అవతారం మనసులో భయం భయంగా వుంది.
అతను చాలా తొందరగా నడవాలని అనుకుంటున్నాడు. కాని సాధ్య పడటం లేదు. చీకటితో నిర్మానుష్యంగా వున్న వీధివెంట నడుస్తున్నాడతను. అతని మస్తిష్కం పరిపరివిధాల ఆలోచిస్తోంది. చెయ్యబోతున్న పని ప్రమాదకరమైంది కాకపోయినా జాగ్రత్తగా చెయ్యాల్సి వుంది. అది ఏ మాత్రం బెడిసికొట్టినా సంఘంలో తల వంచుకుని బ్రతకాలి. దానికి అతను సిద్ధంగా లేదు.
అతని ప్రక్కన భారంగా నడుస్తోంది ఒక యువతి. ఆమె కారణంగానే అవతారం వేగంగా నడవలేక పోతున్నాడు. నడుస్తూ ఆ యువతి ఆయాస పడుతోంది. అక్కడే ఎక్కడయినా కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని ఆమెకి వుంది. దానికి అవతారం ఒప్పుకోడని తెలుసు. అందుకే కష్టమయినా ఆయాస పడుతూ నడుస్తోంది అతనితో.
చీకటి దట్టంగా వుండటం వల్ల ఒకరి ముఖాలు ఒకరికి తెలియడం లేదు. భావాలు తెలియకపోయినా, వాళ్ళ మధ్య మాటలు లేకపోయినా ముందే ఆలోచించి రావడం వల్ల మౌనంగా గమ్యం వైపు నడుస్తున్నారు. ఆమె నడవలేక పోవడానికి ఒక కారణం వుంది. నిండు గర్భిణీ!
తనలో మరో జీవిని దాచుకుని, ఆ జీవి జన్మించే సమయం దగ్గిర పడటం వల్ల నడవలేకపోతోంది. కడుపులో వున్న బిడ్డ కదులుతోంది. దానివల్ల నొప్పులు ప్రారంభ మయ్యాయి. పురుడు వచ్చే సమయం ముందే తెలుసుకోవటం వల్ల సరియైన సమయంలో అక్కడికి చేరుకోగలిగారు.
వాళ్లిద్దరూ ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నారు. మరో వూరు నుండి వచ్చి అప్పుడే బస్ దిగారు. బస్టాండ్కి ఆస్పత్రి దగ్గిర కావటం వల్ల నడిచివస్తున్నారు. అప్పుడు రాత్రి రెండు గంటలయింది సమయం.
కాటుకలాంటి చీకటిలో తుది శ్వాస తీసుకుంటున్న మనిషిలా మిణుకు మిణుక్కుమంటూ వెలుగుతున్నాయి వీధిదీపాలు. జరుగబోతున్న దానిని నిస్సహాయంగా చూస్తున్నట్టు నిశ్చలంగా వున్నాయి స్థంభాలు...................
మిస్టర్ జీరో అవతారం మనసులో భయం భయంగా వుంది. అతను చాలా తొందరగా నడవాలని అనుకుంటున్నాడు. కాని సాధ్య పడటం లేదు. చీకటితో నిర్మానుష్యంగా వున్న వీధివెంట నడుస్తున్నాడతను. అతని మస్తిష్కం పరిపరివిధాల ఆలోచిస్తోంది. చెయ్యబోతున్న పని ప్రమాదకరమైంది కాకపోయినా జాగ్రత్తగా చెయ్యాల్సి వుంది. అది ఏ మాత్రం బెడిసికొట్టినా సంఘంలో తల వంచుకుని బ్రతకాలి. దానికి అతను సిద్ధంగా లేదు. అతని ప్రక్కన భారంగా నడుస్తోంది ఒక యువతి. ఆమె కారణంగానే అవతారం వేగంగా నడవలేక పోతున్నాడు. నడుస్తూ ఆ యువతి ఆయాస పడుతోంది. అక్కడే ఎక్కడయినా కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని ఆమెకి వుంది. దానికి అవతారం ఒప్పుకోడని తెలుసు. అందుకే కష్టమయినా ఆయాస పడుతూ నడుస్తోంది అతనితో. చీకటి దట్టంగా వుండటం వల్ల ఒకరి ముఖాలు ఒకరికి తెలియడం లేదు. భావాలు తెలియకపోయినా, వాళ్ళ మధ్య మాటలు లేకపోయినా ముందే ఆలోచించి రావడం వల్ల మౌనంగా గమ్యం వైపు నడుస్తున్నారు. ఆమె నడవలేక పోవడానికి ఒక కారణం వుంది. నిండు గర్భిణీ! తనలో మరో జీవిని దాచుకుని, ఆ జీవి జన్మించే సమయం దగ్గిర పడటం వల్ల నడవలేకపోతోంది. కడుపులో వున్న బిడ్డ కదులుతోంది. దానివల్ల నొప్పులు ప్రారంభ మయ్యాయి. పురుడు వచ్చే సమయం ముందే తెలుసుకోవటం వల్ల సరియైన సమయంలో అక్కడికి చేరుకోగలిగారు. వాళ్లిద్దరూ ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నారు. మరో వూరు నుండి వచ్చి అప్పుడే బస్ దిగారు. బస్టాండ్కి ఆస్పత్రి దగ్గిర కావటం వల్ల నడిచివస్తున్నారు. అప్పుడు రాత్రి రెండు గంటలయింది సమయం. కాటుకలాంటి చీకటిలో తుది శ్వాస తీసుకుంటున్న మనిషిలా మిణుకు మిణుక్కుమంటూ వెలుగుతున్నాయి వీధిదీపాలు. జరుగబోతున్న దానిని నిస్సహాయంగా చూస్తున్నట్టు నిశ్చలంగా వున్నాయి స్థంభాలు...................© 2017,www.logili.com All Rights Reserved.