అన్వేషణ
అది సిటీకి నలభై కిలోమీటర్ల దూరంలోని సముద్రతీర గ్రామం. ఆ గ్రామంలో మత్స్యకారులు అధికం. విశాఖ స్టీలుప్లాంటుకి స్థలాలు ఇచ్చిన కుటుంబాల్లో కొంతమంది సంపాదించుకున్నా అధిక శాతం చేపలవేట - వృత్తిగా జీవిస్తారు. సిటీ నుంచి ఓ సబర్బన్ బస్సు ఆ గ్రామానికి వస్తుంది. అక్కడ విరివిగా లభించే సముద్ర ఉత్పత్తులు ఆ బస్సు ద్వారానే సిటీలోని మార్కెట్లోకి చేరతాయి. బస్సు వెళ్ళని చోట్లకి ఆటోలు ఉండనే ఉన్నాయి.
ఒక ప్రైవేటు హాస్పిటల్ ఆ గ్రామంలో వుంది. రెండు పడకలు మాత్రమే గల ఆ హాస్పిటల్లో ఒక బెడ్ మీద డెబ్బయి ఏళ్ళ వృద్ధురాలు మరణానికి అత్యంత సమీపంగా వున్నట్టు ఎగశ్వాస తీస్తోంది. కొద్దిమంది బంధువులు బెడ్ పక్కన వున్నారు.
ఇంటికి తీసుకుపొమ్మని అంతకు ముందే డాక్టర్ చెప్పి వెళ్ళాడు. మరణం అనివార్యమైనప్పుడు అక్కడ నుంచి కదపడం దేనికని బంధువులు అనుకుంటే. పేషెంట్ బతకదని నిర్ధారణ అయ్యాక అక్కడ ఉంచడం దేనికని డాక్టర్ అనుకున్నాడు.
అలాంటి స్థితిలో ముసలమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. బంధువులు అతృతగా కాస్త ముందుకి జరిగారు. ముసలమ్మ అందర్నీ పరకాయించి చూసి ఒకతని మీద దృష్టి నిలిపి దగ్గరకు రమ్మన్నట్టు తలూపింది. ఆ యువకుడు వచ్చాక బలహీనమైన స్వరంతో చెప్పింది.
"భరణిబాబుని పిలుచుకు రారా...”
ఆ యువకుడు అయోమయంగా చూసాడు................
అన్వేషణ అది సిటీకి నలభై కిలోమీటర్ల దూరంలోని సముద్రతీర గ్రామం. ఆ గ్రామంలో మత్స్యకారులు అధికం. విశాఖ స్టీలుప్లాంటుకి స్థలాలు ఇచ్చిన కుటుంబాల్లో కొంతమంది సంపాదించుకున్నా అధిక శాతం చేపలవేట - వృత్తిగా జీవిస్తారు. సిటీ నుంచి ఓ సబర్బన్ బస్సు ఆ గ్రామానికి వస్తుంది. అక్కడ విరివిగా లభించే సముద్ర ఉత్పత్తులు ఆ బస్సు ద్వారానే సిటీలోని మార్కెట్లోకి చేరతాయి. బస్సు వెళ్ళని చోట్లకి ఆటోలు ఉండనే ఉన్నాయి. ఒక ప్రైవేటు హాస్పిటల్ ఆ గ్రామంలో వుంది. రెండు పడకలు మాత్రమే గల ఆ హాస్పిటల్లో ఒక బెడ్ మీద డెబ్బయి ఏళ్ళ వృద్ధురాలు మరణానికి అత్యంత సమీపంగా వున్నట్టు ఎగశ్వాస తీస్తోంది. కొద్దిమంది బంధువులు బెడ్ పక్కన వున్నారు. ఇంటికి తీసుకుపొమ్మని అంతకు ముందే డాక్టర్ చెప్పి వెళ్ళాడు. మరణం అనివార్యమైనప్పుడు అక్కడ నుంచి కదపడం దేనికని బంధువులు అనుకుంటే. పేషెంట్ బతకదని నిర్ధారణ అయ్యాక అక్కడ ఉంచడం దేనికని డాక్టర్ అనుకున్నాడు. అలాంటి స్థితిలో ముసలమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. బంధువులు అతృతగా కాస్త ముందుకి జరిగారు. ముసలమ్మ అందర్నీ పరకాయించి చూసి ఒకతని మీద దృష్టి నిలిపి దగ్గరకు రమ్మన్నట్టు తలూపింది. ఆ యువకుడు వచ్చాక బలహీనమైన స్వరంతో చెప్పింది. "భరణిబాబుని పిలుచుకు రారా...” ఆ యువకుడు అయోమయంగా చూసాడు................© 2017,www.logili.com All Rights Reserved.