దేవుడా... రక్షించు!
ఆ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలుంటుంది వయసు. సన్నగా, మెరుపుతీగలా ఉంది. కౌంటర్లో తన పని ముగించుకుని వెనక్కి తిరిగిందామె. అడుగులు వేస్తుంటే ఆమె నడుము లయబద్దంగా కదులుతోంది.
ప్రక్క కౌంటర్లో కూర్చున్న ఓ యువకుడు వెళుతున్న ఆమె వైపు తదేకంగా చూస్తుండిపోయాడు. చక్కటి శరీర నిర్మాణం కావడంచేత కదులుతుంటే కండరాలు చీర నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాకెట్ చీరకి మధ్యనున్న భాగం మృదువైన చర్మంతో మెరుస్తోంది.
ఆమె ఎంట్రన్స్ దాటి బయటకు వెళ్ళేవరకూ చూసి దృష్టి మరల్చుకుని నిట్టూర్చాడతను. అతనికి భార్య గుర్తొచ్చింది. ఆమె ఊరు వెళ్ళిన తరువాత మనసు కంట్రోలు తప్పుతోంది. నిజం చెప్పాలంటే శరీరం అర్జంటుగా సెక్స్ కావాలంటోంది. మనసుని పనిమీద లగ్నం చెయ్యాలనే ఆలోచనతో కాగితాలు ముందుకు లాక్కున్నాడు.
"మిస్టర్ అవినాష్! మీకు ఫోన్..." చెప్పాడు కొలీగ్ ఒకతను.
అ అని పిలవబడ్డ ఆ యువకుడు చప్పున సీటునుంచి లేచివెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు.
"నేను..." అటునుంచి వినిపించిందో స్త్రీ గొంతు.
భార్య గొంతు విని అవినాష్ మొహం విచ్చుకుంది. "ఎప్పుడొస్తున్నావ్?" అడిగాడు ఆత్రుతగా.
"రేపు ఉదయం ఆపరేషన్ చేస్తున్నారు. కుట్లు విప్పడానికి పది రోజులు పడుతుంది. అంతవరకూ నేను ఉండాలి..."
అతని మొహం చిన్నబోయింది. వివాహం చేసుకుని సంవత్సరం కాలేదు. భార్య లేకపోవడంతో పిచ్చెత్తినట్టుంది. పది రోజుల ఎడబాటంటే మాటలు కాదు. అనుభవిస్తే తప్ప అర్ధంకాదు.
"రాధి... ఇప్పుడెలా?" అడిగాడు నిస్సహాయంగా.
"శలవుపెట్టి మీరు రండి..."
అతనికి బాస్ మొహం గుర్తొచ్చింది. హనీమూన్ కోసం పది రోజులు శలవుపెట్టి, దానిని పొడిగించి ఆఫీస్ కొచ్చినప్పుడు బాస్ చూసిన చూపు అతనికి ఇంకా గుర్తుంది.
"వీలుకాదులే..." చెప్పాడు నీరసంగా. "గులాబీ మొక్కకి నీళ్ళు పోస్తున్నారా?"........................
దేవుడా... రక్షించు! ఆ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలుంటుంది వయసు. సన్నగా, మెరుపుతీగలా ఉంది. కౌంటర్లో తన పని ముగించుకుని వెనక్కి తిరిగిందామె. అడుగులు వేస్తుంటే ఆమె నడుము లయబద్దంగా కదులుతోంది. ప్రక్క కౌంటర్లో కూర్చున్న ఓ యువకుడు వెళుతున్న ఆమె వైపు తదేకంగా చూస్తుండిపోయాడు. చక్కటి శరీర నిర్మాణం కావడంచేత కదులుతుంటే కండరాలు చీర నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాకెట్ చీరకి మధ్యనున్న భాగం మృదువైన చర్మంతో మెరుస్తోంది. ఆమె ఎంట్రన్స్ దాటి బయటకు వెళ్ళేవరకూ చూసి దృష్టి మరల్చుకుని నిట్టూర్చాడతను. అతనికి భార్య గుర్తొచ్చింది. ఆమె ఊరు వెళ్ళిన తరువాత మనసు కంట్రోలు తప్పుతోంది. నిజం చెప్పాలంటే శరీరం అర్జంటుగా సెక్స్ కావాలంటోంది. మనసుని పనిమీద లగ్నం చెయ్యాలనే ఆలోచనతో కాగితాలు ముందుకు లాక్కున్నాడు. "మిస్టర్ అవినాష్! మీకు ఫోన్..." చెప్పాడు కొలీగ్ ఒకతను. అ అని పిలవబడ్డ ఆ యువకుడు చప్పున సీటునుంచి లేచివెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు. "నేను..." అటునుంచి వినిపించిందో స్త్రీ గొంతు. భార్య గొంతు విని అవినాష్ మొహం విచ్చుకుంది. "ఎప్పుడొస్తున్నావ్?" అడిగాడు ఆత్రుతగా. "రేపు ఉదయం ఆపరేషన్ చేస్తున్నారు. కుట్లు విప్పడానికి పది రోజులు పడుతుంది. అంతవరకూ నేను ఉండాలి..." అతని మొహం చిన్నబోయింది. వివాహం చేసుకుని సంవత్సరం కాలేదు. భార్య లేకపోవడంతో పిచ్చెత్తినట్టుంది. పది రోజుల ఎడబాటంటే మాటలు కాదు. అనుభవిస్తే తప్ప అర్ధంకాదు. "రాధి... ఇప్పుడెలా?" అడిగాడు నిస్సహాయంగా. "శలవుపెట్టి మీరు రండి..." అతనికి బాస్ మొహం గుర్తొచ్చింది. హనీమూన్ కోసం పది రోజులు శలవుపెట్టి, దానిని పొడిగించి ఆఫీస్ కొచ్చినప్పుడు బాస్ చూసిన చూపు అతనికి ఇంకా గుర్తుంది. "వీలుకాదులే..." చెప్పాడు నీరసంగా. "గులాబీ మొక్కకి నీళ్ళు పోస్తున్నారా?"........................© 2017,www.logili.com All Rights Reserved.