మృత్యు కెరటం
చల్లటి గాలితెర విసురుగా వీచింది.
సాయంకాలం ఐదు గంటలు అయింది సమయం. ఉదయం నుండి తన ప్రతాపం చూపిన సూర్యుడు అస్తమించటానికి ఆయత్తమవుతున్నాడు. వాతావరణంలో మార్పువచ్చి చల్లబడింది.
నెమ్మదిగా కళ్ళు తెరిచాడు చంద్రం. అప్పటివరకూ ఫుట్పాత్ మీద పడుకునివున్నాడు. అతనికి పది సంవత్సరాల వయస్సు వుంటుంది. నిక్కరు, షర్టు అతని దుస్తులు. జుట్టు చెదరి దుమ్ముకొట్టుకుపోయింది. మురికిపట్టి శరీరం అసహ్యంగా కనిపిస్తోంది.
ఊహ తెలిసిన దగ్గిర నుండి వెంటవున్న తల్లి యిప్పుడు లేదు. నాలుగు రోజుల నుండి తిండి లేదు.
తల్లి శవాన్ని మున్సిపాల్టీవాళ్ళు, గుడిసెలోని సామాను చుట్టుప్రక్కలవాళ్ళు తీసుకుపోయారు. ఇప్పుడు ప్రపంచంలో అతనికి ఎవరూ లేరు. పది రోజుల క్రితం సాఫీగా సాగిపోతున్న జీవితం ఒక్కసారి తారుమారయింది. ప్రస్తుతం అతను ఒక నిర్భాగ్యుడు.
ఆకలితో కడుపు కాలిపోతోంది. ఆకలి వేసినప్పుడు అమ్మను అడిగి తినటం మాత్రమే తెలుసు. ఇప్పుడు తన ఆకలి తనే తీర్చుకోవాలనే విషయం ఆ కుర్రాడికి స్పష్టంగానే బోధపడింది.
నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ముందు కడుపులోకి ఏదో ఆహారం కావాలనేది నిజం. గత ఆరు గంటల నుండి పడివున్న ప్రదేశాన్ని వదిలిపెట్టి నడవసాగేడు. దారిలో ఒకచోట కుళాయి కనిపించింది. కడుపునిండా నీళ్ళు త్రాగాడు.....................
మృత్యు కెరటం చల్లటి గాలితెర విసురుగా వీచింది. సాయంకాలం ఐదు గంటలు అయింది సమయం. ఉదయం నుండి తన ప్రతాపం చూపిన సూర్యుడు అస్తమించటానికి ఆయత్తమవుతున్నాడు. వాతావరణంలో మార్పువచ్చి చల్లబడింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు చంద్రం. అప్పటివరకూ ఫుట్పాత్ మీద పడుకునివున్నాడు. అతనికి పది సంవత్సరాల వయస్సు వుంటుంది. నిక్కరు, షర్టు అతని దుస్తులు. జుట్టు చెదరి దుమ్ముకొట్టుకుపోయింది. మురికిపట్టి శరీరం అసహ్యంగా కనిపిస్తోంది. ఊహ తెలిసిన దగ్గిర నుండి వెంటవున్న తల్లి యిప్పుడు లేదు. నాలుగు రోజుల నుండి తిండి లేదు. తల్లి శవాన్ని మున్సిపాల్టీవాళ్ళు, గుడిసెలోని సామాను చుట్టుప్రక్కలవాళ్ళు తీసుకుపోయారు. ఇప్పుడు ప్రపంచంలో అతనికి ఎవరూ లేరు. పది రోజుల క్రితం సాఫీగా సాగిపోతున్న జీవితం ఒక్కసారి తారుమారయింది. ప్రస్తుతం అతను ఒక నిర్భాగ్యుడు. ఆకలితో కడుపు కాలిపోతోంది. ఆకలి వేసినప్పుడు అమ్మను అడిగి తినటం మాత్రమే తెలుసు. ఇప్పుడు తన ఆకలి తనే తీర్చుకోవాలనే విషయం ఆ కుర్రాడికి స్పష్టంగానే బోధపడింది. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ముందు కడుపులోకి ఏదో ఆహారం కావాలనేది నిజం. గత ఆరు గంటల నుండి పడివున్న ప్రదేశాన్ని వదిలిపెట్టి నడవసాగేడు. దారిలో ఒకచోట కుళాయి కనిపించింది. కడుపునిండా నీళ్ళు త్రాగాడు.....................© 2017,www.logili.com All Rights Reserved.