ఉత్తమ రష్యన్ కథలు
పొదుబోడానికి
మక్సీంగోర్కీ
అను: రాచమల్లు రామచంద్రారెడ్డి
దట్టమైన బూడిదరంగు పొగ మేఘాలు వెలిగ్రక్కే బ్రహ్మాండమైన సర్పంలాంటి పాసెంజర్ రైలు అపారమైన మైదానంలో, పసుపురంగు సముద్రంలాంటి గోధుమ ఈ పైరులో అదృశ్యమౌతున్నది. పొగ వేడిగాలిలో కరిగిపోయినట్లే, ఆ అపారమైన ఖాళీ మైదానం యొక్క నిర్లిప్త మౌనాన్ని కొద్దిక్షణాలపాటు భగ్నం చేసిన ఆగ్రహపూరిత మహాధ్వని 185 సమూహం కూడా కరిగిపోయింది. ఆ అపారమైన మైదానం మధ్య ఒక చిన్న రైల్వే స్టేషను వుంది. దాని ఒంటరితనం మహా విషాదకరమైన అనుభూతులు కలిగిస్తుంది.
కటువుగా వున్నా, కనీసం సజీవంగా వున్న రైలు శబ్దం మాయమైపోయిన తర్వాత అదే విసుగు కలిగించే నిశ్శబ్దం స్టేషన్ను మళ్ళీ ఆవరించింది.
మైదానం స్వర్ణచ్ఛాయలో వుంది, ఆకాశం ఇంద్రనీలపు రంగులో వుంది. రెండూ 22. హద్దులు లేనివి. అంత అపారమైన విస్తృతిలో చిన్న యిటుక రంగు స్టేషన్ భవనాలు యెలా వున్నాయంటే, ఊహాశక్తి లేని కళాకారుడు శ్రమపడి వేసిన విషాద చిత్రంమీద 23. పొరపాటుగా కుంచె తగిలి దాని అందాన్ని చెడగొట్టుతున్న మరకలలాగున్నాయి.
ప్రతి దినమూ మధ్యాహ్నం పండ్రెండు గంటలకూ, సాయంత్రం నాలుగు గంటలకూ మైదానంలోనుండి రైళ్ళు వచ్చి స్టేషను వద్ద సరిగా రెండు నిముషాలు ఆగుతాయి. ఆ నాలుగు నిముషాలూ స్టేషన్కు ప్రధానమైన ఆటవిడుపు, నిజానికి ఒకే ఒక ఆటవిడుపు. యెందుకంటే అవి మాత్రమే అక్కడ పనిచేసేవాళ్ళకు కొత్త అనుభవాలు తీసుకువచ్చేవి.
ప్రతి రైలులోనూ రకరకాల దుస్తులలో రకరకాల మనుషులు వుండేవాళ్ళు. వాళ్ళు క్షణకాలం మాత్రం ప్రత్యక్షమౌతారు; రైలు పెట్టెల కిటికీలవద్ద అలసిన, చిరాకుపడిన, అస్తవ్యస్తపు ముఖాల క్షణభంగుర చిత్రం- ఆ తర్వాత ఒక గంట, ఒక ఈల, యింతలో దబదబ శబ్దంతో ఆ ముఖాలు యెగిరిపోతాయి. మైదానంలోకి, దూరంలోకి, జీవితం తొణికసలాడుతూ పొంగులు వారుతూ వుండే నగరాలలోకి..............................
ఉత్తమ రష్యన్ కథలు పొదుబోడానికి మక్సీంగోర్కీ అను: రాచమల్లు రామచంద్రారెడ్డి దట్టమైన బూడిదరంగు పొగ మేఘాలు వెలిగ్రక్కే బ్రహ్మాండమైన సర్పంలాంటి పాసెంజర్ రైలు అపారమైన మైదానంలో, పసుపురంగు సముద్రంలాంటి గోధుమ ఈ పైరులో అదృశ్యమౌతున్నది. పొగ వేడిగాలిలో కరిగిపోయినట్లే, ఆ అపారమైన ఖాళీ మైదానం యొక్క నిర్లిప్త మౌనాన్ని కొద్దిక్షణాలపాటు భగ్నం చేసిన ఆగ్రహపూరిత మహాధ్వని 185 సమూహం కూడా కరిగిపోయింది. ఆ అపారమైన మైదానం మధ్య ఒక చిన్న రైల్వే స్టేషను వుంది. దాని ఒంటరితనం మహా విషాదకరమైన అనుభూతులు కలిగిస్తుంది. కటువుగా వున్నా, కనీసం సజీవంగా వున్న రైలు శబ్దం మాయమైపోయిన తర్వాత అదే విసుగు కలిగించే నిశ్శబ్దం స్టేషన్ను మళ్ళీ ఆవరించింది. మైదానం స్వర్ణచ్ఛాయలో వుంది, ఆకాశం ఇంద్రనీలపు రంగులో వుంది. రెండూ 22. హద్దులు లేనివి. అంత అపారమైన విస్తృతిలో చిన్న యిటుక రంగు స్టేషన్ భవనాలు యెలా వున్నాయంటే, ఊహాశక్తి లేని కళాకారుడు శ్రమపడి వేసిన విషాద చిత్రంమీద 23. పొరపాటుగా కుంచె తగిలి దాని అందాన్ని చెడగొట్టుతున్న మరకలలాగున్నాయి. ప్రతి దినమూ మధ్యాహ్నం పండ్రెండు గంటలకూ, సాయంత్రం నాలుగు గంటలకూ మైదానంలోనుండి రైళ్ళు వచ్చి స్టేషను వద్ద సరిగా రెండు నిముషాలు ఆగుతాయి. ఆ నాలుగు నిముషాలూ స్టేషన్కు ప్రధానమైన ఆటవిడుపు, నిజానికి ఒకే ఒక ఆటవిడుపు. యెందుకంటే అవి మాత్రమే అక్కడ పనిచేసేవాళ్ళకు కొత్త అనుభవాలు తీసుకువచ్చేవి. ప్రతి రైలులోనూ రకరకాల దుస్తులలో రకరకాల మనుషులు వుండేవాళ్ళు. వాళ్ళు క్షణకాలం మాత్రం ప్రత్యక్షమౌతారు; రైలు పెట్టెల కిటికీలవద్ద అలసిన, చిరాకుపడిన, అస్తవ్యస్తపు ముఖాల క్షణభంగుర చిత్రం- ఆ తర్వాత ఒక గంట, ఒక ఈల, యింతలో దబదబ శబ్దంతో ఆ ముఖాలు యెగిరిపోతాయి. మైదానంలోకి, దూరంలోకి, జీవితం తొణికసలాడుతూ పొంగులు వారుతూ వుండే నగరాలలోకి..............................© 2017,www.logili.com All Rights Reserved.