Rudranagu By Lalladevi

By Lalladevi (Author)
Rs.175
Rs.175

Rudranagu By Lalladevi
INR
MANIMN7186
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

రుద్రనాగు

పాలు తాగిపడుకొన్న పాములా, నిండుగా, కన్నుల పండువుగా గుండెలు సందడించేలా వుంది నాగులకోన! దండతాడిత భుజంగంలా ఉదయభానుడు బుసలు కొడుతున్నట్టు తూరుపుకొండల్లోంచి పైపైకి దూసుకువస్తున్నాడు. పాము కుబుసంలా ప్రకృతి కన్నియ మసకకాంతులలోంచి మిలమిల మెరుస్తోంది. చరచరసాగే సర్పంలా మట్టిరోడ్డు దూరదూరానికి కదులుతున్నట్టుంది. పుట్టలోంచి పైకివచ్చిన పాముపడగలా ద్యోతక మవుతోంది ఆ గుడి వుపరితలం. గోపుర శిఖరాన రెక్కలార్చుతూన్న రెండుపిట్టలు - మిలమిలలాడే నాళం కళ్ళలా మెరుపులీను తున్నాయి. గుడి చుట్టూ ఏపుగా, దట్టంగా ఆవహించిన చెట్టు తెల్లగా విరగబూసిన చందం... పాముకాటుకు కక్కిన నురగ ఎల్లెడలా వ్యాపించినట్టుగా వుంది గోధుమ వర్ణంలో గుడిగోడ కోడెనాగు బడలికతో సేద తీరుతున్నట్లగా వుంది.... శ్వేతసర్పం పై నించి క్రిందికి జారుతున్నట్టుగా దూరాన కొండమీంచి కోనలోకి జాలువారుతోంది జలపాతం! కిందపడుతున్న జలపాతం చప్పుడు - ఆడమగ పాములు సరసమాడుతున్నప్పటి నవ్వడిని స్ఫురింప చేస్తున్నది. పసిరిక పాముల రాజ్యంలా పచ్చిక బయలు హొయలు వోలక బోస్తున్నది.

సమీప గ్రామం నాగులకోనలో కలకలం చెలరేగింది - నాగస్వర వాయిద్య ఘోష నిస్తబ్దతను బద్దలు చేస్తూ - వుత్తేజాన్ని కల్గిస్తోంది. ఇళ్ళలోంచి జనం పుట్టలోంచి జరజరమంటూ వస్తున్న పాముల్లా నాగస్వర వాయిద్యఘోష దిశగా రాసాగారు. చిన్న పాములు, పెద్దపాములు నల్లపాములు, ఎర్రపాములు రకరకాల సర్పాల్లా.... ఆడా మగా చిన్నా పెద్దా అంతా ఒక్కుమ్మడిగా ఆ దిక్కుకు కదిలారు.

పదిహేను, ఇరవై నిమషాల్లో ఊరు వూరంతా ఊరి బయటికి మొగలి పొదల దగ్గరకు కదిలివచ్చింది. మత్తుకు, విపత్తుకు కేంద్రమైన మొగలి పొదల్లోంచి గుప్పుగుప్పున సువాసనలు విడుదలవుతున్నాయి. జేరిన జనం శివమెత్తిన నాగుల్లా చిందులు వేస్తున్నారు. నాసికా పుటాల్ని విప్పి, బలంగా గాలిపీలుస్తూ గుండెల్ని నింపుకుంటున్నారు. నేల పరచిన కొండబండల గుండెలపై సందడి చేస్తున్నారు. అందలమెక్కినట్టు ఆనందిస్తు...........................

రుద్రనాగు పాలు తాగిపడుకొన్న పాములా, నిండుగా, కన్నుల పండువుగా గుండెలు సందడించేలా వుంది నాగులకోన! దండతాడిత భుజంగంలా ఉదయభానుడు బుసలు కొడుతున్నట్టు తూరుపుకొండల్లోంచి పైపైకి దూసుకువస్తున్నాడు. పాము కుబుసంలా ప్రకృతి కన్నియ మసకకాంతులలోంచి మిలమిల మెరుస్తోంది. చరచరసాగే సర్పంలా మట్టిరోడ్డు దూరదూరానికి కదులుతున్నట్టుంది. పుట్టలోంచి పైకివచ్చిన పాముపడగలా ద్యోతక మవుతోంది ఆ గుడి వుపరితలం. గోపుర శిఖరాన రెక్కలార్చుతూన్న రెండుపిట్టలు - మిలమిలలాడే నాళం కళ్ళలా మెరుపులీను తున్నాయి. గుడి చుట్టూ ఏపుగా, దట్టంగా ఆవహించిన చెట్టు తెల్లగా విరగబూసిన చందం... పాముకాటుకు కక్కిన నురగ ఎల్లెడలా వ్యాపించినట్టుగా వుంది గోధుమ వర్ణంలో గుడిగోడ కోడెనాగు బడలికతో సేద తీరుతున్నట్లగా వుంది.... శ్వేతసర్పం పై నించి క్రిందికి జారుతున్నట్టుగా దూరాన కొండమీంచి కోనలోకి జాలువారుతోంది జలపాతం! కిందపడుతున్న జలపాతం చప్పుడు - ఆడమగ పాములు సరసమాడుతున్నప్పటి నవ్వడిని స్ఫురింప చేస్తున్నది. పసిరిక పాముల రాజ్యంలా పచ్చిక బయలు హొయలు వోలక బోస్తున్నది. సమీప గ్రామం నాగులకోనలో కలకలం చెలరేగింది - నాగస్వర వాయిద్య ఘోష నిస్తబ్దతను బద్దలు చేస్తూ - వుత్తేజాన్ని కల్గిస్తోంది. ఇళ్ళలోంచి జనం పుట్టలోంచి జరజరమంటూ వస్తున్న పాముల్లా నాగస్వర వాయిద్యఘోష దిశగా రాసాగారు. చిన్న పాములు, పెద్దపాములు నల్లపాములు, ఎర్రపాములు రకరకాల సర్పాల్లా.... ఆడా మగా చిన్నా పెద్దా అంతా ఒక్కుమ్మడిగా ఆ దిక్కుకు కదిలారు. పదిహేను, ఇరవై నిమషాల్లో ఊరు వూరంతా ఊరి బయటికి మొగలి పొదల దగ్గరకు కదిలివచ్చింది. మత్తుకు, విపత్తుకు కేంద్రమైన మొగలి పొదల్లోంచి గుప్పుగుప్పున సువాసనలు విడుదలవుతున్నాయి. జేరిన జనం శివమెత్తిన నాగుల్లా చిందులు వేస్తున్నారు. నాసికా పుటాల్ని విప్పి, బలంగా గాలిపీలుస్తూ గుండెల్ని నింపుకుంటున్నారు. నేల పరచిన కొండబండల గుండెలపై సందడి చేస్తున్నారు. అందలమెక్కినట్టు ఆనందిస్తు...........................

Features

  • : Rudranagu By Lalladevi
  • : Lalladevi
  • : Classic Books
  • : MANIMN7186
  • : paparback
  • : Sep, 2026
  • : 183
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rudranagu By Lalladevi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam