అలెగ్జాండర్, సీజర్ లకన్నా గొప్ప వీరుడు చెంఘిజ్ ఖాన్, నన్ను ఎంతగానో సమ్మోహపరిచాడు. - జవహర్ లాల్ నెహ్రూ.
మంగోలియా పచ్చికబయళ్ళ మీద మంచుగాలులు వీస్తున్నాయి.
భగత్తూరు తండానాయకుడు యాసుకై నుదురుమీద అరచేయి అడ్డు పెట్టుకుని పర్వత కనుమలవైపు చూచాడు ! కొండ శిఖరం మీదినించి రక్తారుణ కాంతులు కన్పించు తున్నాయి. తూర్పు ఆకాశం కడుపులోకి ఈమొనల్లాగ గ్రుచ్చుకున్న కొండ శిఖరాల మీదినించి రక్తం చిమ్ముతున్నట్లు అనిపిస్తోంది. ఆకాశాన్ని పాలించే సూర్యుడు మంగోలియన్ల మీద పగపట్టాడు వర్షపు చినుకు ఇసుక నేలని తడిపి ఎన్నాళ్ళయ్యింది!
పగటి సమయం అంతా మండించే ఎండలు! వడగాలులు !!
రాత్రిపూట ఎముకలు కొరికే మంచుగాలులు ! !
ఎప్పుడూ పచ్చగా దుబ్బులుకట్టి కన్పించే పచ్చికబయళ్ళు ఎండి బీటలు వారుతున్నాయి. తండాలో మనుషులు తిండిలేక మలమల మాడుతున్నారు. నెగళ్ళచుట్టూ తోలు అట్టలు పరుచుకుని పడుకున్నవారికి ఆకలి నిద్ర పట్టకుండా చేసింది. సోమరులుగా పడివున్నారు. ఉదయసంధ్యకు వారు విసుగుతో స్వాగతం చెప్పారు.
ఒంటెలు, గుర్రాలు చెట్లక్రింద గుంపులుకట్టి నిలిచాయి. పరుగెట్టే పనిలేకుండా ఈ 'సోమరితనం ఇంకెన్నాళ్ళు అని అడుగుతున్నట్లు ప్రశ్నార్ధకంగా తోకలు ఆడిస్తున్నాయి. వాటి శరీరాలమీది చర్మం పదే పదే జలదరిస్తోంది. వాటి నోళ్ళు మూతపడి ఉన్నాయి. చొంగమాత్రం నురగలు కడుతోంది. ! !
చర్మం ఎముకలకు అంటుకుపోయింది.
ఒక చోటున గుంపుగా చేరి మౌనభాషలో ప్రసంగించుకుంటున్నాయి. శత్రువులు దాడిలో పరిస్థితిని సమీక్షించుకుంటున్న సైనికుల్లాగ సమావేశమయినాయి. శూన్యంగా దిక్కులవంక చూస్తూ భవిష్యత్తుమీద ఆశలు పెంచుకుంటున్నాయి ! ఆకాశంలో చుక్కలు కూడా లేవు. నీలాలనింగి అతి నిర్మలం!!
రాత్రి అంతా ఆకలితో గడిచిపోయింది.............................
అలెగ్జాండర్, సీజర్ లకన్నా గొప్ప వీరుడు చెంఘిజ్ ఖాన్, నన్ను ఎంతగానో సమ్మోహపరిచాడు. - జవహర్ లాల్ నెహ్రూ. మంగోలియా పచ్చికబయళ్ళ మీద మంచుగాలులు వీస్తున్నాయి. భగత్తూరు తండానాయకుడు యాసుకై నుదురుమీద అరచేయి అడ్డు పెట్టుకుని పర్వత కనుమలవైపు చూచాడు ! కొండ శిఖరం మీదినించి రక్తారుణ కాంతులు కన్పించు తున్నాయి. తూర్పు ఆకాశం కడుపులోకి ఈమొనల్లాగ గ్రుచ్చుకున్న కొండ శిఖరాల మీదినించి రక్తం చిమ్ముతున్నట్లు అనిపిస్తోంది. ఆకాశాన్ని పాలించే సూర్యుడు మంగోలియన్ల మీద పగపట్టాడు వర్షపు చినుకు ఇసుక నేలని తడిపి ఎన్నాళ్ళయ్యింది! పగటి సమయం అంతా మండించే ఎండలు! వడగాలులు !! రాత్రిపూట ఎముకలు కొరికే మంచుగాలులు ! ! ఎప్పుడూ పచ్చగా దుబ్బులుకట్టి కన్పించే పచ్చికబయళ్ళు ఎండి బీటలు వారుతున్నాయి. తండాలో మనుషులు తిండిలేక మలమల మాడుతున్నారు. నెగళ్ళచుట్టూ తోలు అట్టలు పరుచుకుని పడుకున్నవారికి ఆకలి నిద్ర పట్టకుండా చేసింది. సోమరులుగా పడివున్నారు. ఉదయసంధ్యకు వారు విసుగుతో స్వాగతం చెప్పారు. ఒంటెలు, గుర్రాలు చెట్లక్రింద గుంపులుకట్టి నిలిచాయి. పరుగెట్టే పనిలేకుండా ఈ 'సోమరితనం ఇంకెన్నాళ్ళు అని అడుగుతున్నట్లు ప్రశ్నార్ధకంగా తోకలు ఆడిస్తున్నాయి. వాటి శరీరాలమీది చర్మం పదే పదే జలదరిస్తోంది. వాటి నోళ్ళు మూతపడి ఉన్నాయి. చొంగమాత్రం నురగలు కడుతోంది. ! ! చర్మం ఎముకలకు అంటుకుపోయింది. ఒక చోటున గుంపుగా చేరి మౌనభాషలో ప్రసంగించుకుంటున్నాయి. శత్రువులు దాడిలో పరిస్థితిని సమీక్షించుకుంటున్న సైనికుల్లాగ సమావేశమయినాయి. శూన్యంగా దిక్కులవంక చూస్తూ భవిష్యత్తుమీద ఆశలు పెంచుకుంటున్నాయి ! ఆకాశంలో చుక్కలు కూడా లేవు. నీలాలనింగి అతి నిర్మలం!! రాత్రి అంతా ఆకలితో గడిచిపోయింది.............................© 2017,www.logili.com All Rights Reserved.