లకుమాదేవి
శ్రీపర్వతం పాదాలచెంత పచ్చిక మేసిన ఆలమందలు రవధూళి లేపుకుంటూ తిరుగు ప్రయాణమైనాయి.
పూచిన తంగేడు వనంలా ఉంది పశ్చిమాకాశం. పుచ్చపూవులాంటి సూర్యుడు విచ్చిన మందారంలా మారిపోయాడు.
మహదేవి చర్ల (మాచర్ల) లోని చెన్నకేశవుని ఆలయప్రాకారం ప్రక్కనేవున్న ప్రధాన వీధిలోకి వచ్చాయి ఆలమందలు. ఆ వెనుకనే ఓ చిట్టి రేగిబెత్తాన్ని చేతిలో వుంచుకుని, తల వొంచుకుని అడుగులు లెక్కిస్తూ నడుస్తోంది ఆమె.
శరీరమంతా దుమ్ము కొట్టుకుని ఉంది. అగ్గి వల్ల ముఖమంతా వాడిపోయింది. అలసట మూర్తీభవించినట్లుగా ఉంది. ఆమె వయసు పదకొండు సంవత్సరాలుంటుందేమో!
"కపిలా! నీవు ముందుకు నడువు. ఇలా వెళ్తే ఆశ్రమం చేరేవేళకు అర్ధరాత్రి అవుతుందేమో" అని హెచ్చరించిందామె. ఆ మాటల్ని అర్ధం చేసుకున్నట్లుగా కపిల అనే పేరు కలిగిన లేగదూడ చురుగ్గా అడుగులు వేస్తూ ఆలమందకు అగ్రగామి అయింది. నడక వేగం హెచ్చు అయింది.
చెన్న కేశవస్వామి ఆలయ ముఖద్వారం వచ్చాక లోనికివెళ్ళి చేతులు ముకుళించి, తల వంచి నమస్కరించిందామె. "స్వామీ! కమలయోగిని అత్తయ్య ఆరోగ్యం మెరుగయ్యేలా ఆశీర్వదించు" అని ప్రార్ధించింది.
చెన్నుడు ఎప్పటిలా చిరునవ్వులు చిందులాడే ముఖముద్రతో చూస్తున్నాడే తప్ప ఉలకలేదు. పలకలేదు. ఓ నిట్టూర్పు విడిచి తిరిగివచ్చిందా అమ్మాయి.
కపిల అగ్రగామి అయి నడిపిస్తూ వుంటే అప్పటికే ఆలమంద చాలా దూరం పోయింది. అది అలవాటయిన దారి. ఊరుదాటి చంద్రవంక ఒడ్డుచేరాక కడుపునిండా నీరుత్రాగి ఆశ్రమంలో ప్రవేశించినాయి.
కమలయోగిని అత్తయ్య దర్భాసనం పరుచుకుని దానిమీద వెల్లికిలా పడుకుని వుంది. అలా పడుకున్నదంటే అన్నపానాలు లేకుండా వారం రోజులయినా అలాగే ఉండగలదు.
ఆమె అలా దర్భశయ్యమీద పడుకున్నప్పుడు "ఆరోగ్యం లోపించింది కాబోలు" అని అమాయకంగా అనుకోవటం లకుమకు అలవాటు. వెంటనే చెన్నుడి ఆలయానికి పరుగుతీసి స్వామిని ప్రార్ధించటం ఆనవాయితీ...............................
లకుమాదేవి శ్రీపర్వతం పాదాలచెంత పచ్చిక మేసిన ఆలమందలు రవధూళి లేపుకుంటూ తిరుగు ప్రయాణమైనాయి. పూచిన తంగేడు వనంలా ఉంది పశ్చిమాకాశం. పుచ్చపూవులాంటి సూర్యుడు విచ్చిన మందారంలా మారిపోయాడు. మహదేవి చర్ల (మాచర్ల) లోని చెన్నకేశవుని ఆలయప్రాకారం ప్రక్కనేవున్న ప్రధాన వీధిలోకి వచ్చాయి ఆలమందలు. ఆ వెనుకనే ఓ చిట్టి రేగిబెత్తాన్ని చేతిలో వుంచుకుని, తల వొంచుకుని అడుగులు లెక్కిస్తూ నడుస్తోంది ఆమె. శరీరమంతా దుమ్ము కొట్టుకుని ఉంది. అగ్గి వల్ల ముఖమంతా వాడిపోయింది. అలసట మూర్తీభవించినట్లుగా ఉంది. ఆమె వయసు పదకొండు సంవత్సరాలుంటుందేమో! "కపిలా! నీవు ముందుకు నడువు. ఇలా వెళ్తే ఆశ్రమం చేరేవేళకు అర్ధరాత్రి అవుతుందేమో" అని హెచ్చరించిందామె. ఆ మాటల్ని అర్ధం చేసుకున్నట్లుగా కపిల అనే పేరు కలిగిన లేగదూడ చురుగ్గా అడుగులు వేస్తూ ఆలమందకు అగ్రగామి అయింది. నడక వేగం హెచ్చు అయింది. చెన్న కేశవస్వామి ఆలయ ముఖద్వారం వచ్చాక లోనికివెళ్ళి చేతులు ముకుళించి, తల వంచి నమస్కరించిందామె. "స్వామీ! కమలయోగిని అత్తయ్య ఆరోగ్యం మెరుగయ్యేలా ఆశీర్వదించు" అని ప్రార్ధించింది. చెన్నుడు ఎప్పటిలా చిరునవ్వులు చిందులాడే ముఖముద్రతో చూస్తున్నాడే తప్ప ఉలకలేదు. పలకలేదు. ఓ నిట్టూర్పు విడిచి తిరిగివచ్చిందా అమ్మాయి. కపిల అగ్రగామి అయి నడిపిస్తూ వుంటే అప్పటికే ఆలమంద చాలా దూరం పోయింది. అది అలవాటయిన దారి. ఊరుదాటి చంద్రవంక ఒడ్డుచేరాక కడుపునిండా నీరుత్రాగి ఆశ్రమంలో ప్రవేశించినాయి. కమలయోగిని అత్తయ్య దర్భాసనం పరుచుకుని దానిమీద వెల్లికిలా పడుకుని వుంది. అలా పడుకున్నదంటే అన్నపానాలు లేకుండా వారం రోజులయినా అలాగే ఉండగలదు. ఆమె అలా దర్భశయ్యమీద పడుకున్నప్పుడు "ఆరోగ్యం లోపించింది కాబోలు" అని అమాయకంగా అనుకోవటం లకుమకు అలవాటు. వెంటనే చెన్నుడి ఆలయానికి పరుగుతీసి స్వామిని ప్రార్ధించటం ఆనవాయితీ...............................© 2017,www.logili.com All Rights Reserved.