నాగభైరవి
పాలబువ్వతో నిండిన వెండికంచంలా వెలిగి పోతున్నాడు చందమామ. పుచ్చ పువ్వుల రేకులు పరచినట్లుగా అయింది వియత్తలం.
అది పూర్ణిమనాటి రాత్రి! సమయం పన్నెండు గంటలవుతూంది. కొండచరియల మీద తాకిన వెన్నెల కిరణాలు జిలుగు చారాల్లా క్రిందికి జారుతున్నాయి. మత్తెక్కిన క్రొత్తజంట గోరువంకలు కొమ్మల మాటునించి కువ్వున కూశాయి.
సర్పాలు కన్పిస్తే గోరువంకలు కూస్తాయి. తమ నేస్తాలను పిలుస్తాయి. అర్ధరాత్రి అలసి సొలసిన గోరువంకల జంటలన్నీ జోగుతున్నాయి.
క్రొత్త జంట కూతల్ని అవేవీ విన్పించుకోలేదు. నేస్తాలెవరూ రాకపోవటంతో క్రొత్త జంట కువ్వున కూయటం మానేశాయి. రెక్కలు అప్పళించి మరొక మారు ముక్కులు రాచుకున్నాయి. పచ్చని ఆకుల మాటు వచ్చి పచ్చి కోరికతో ఒక్కటిగా అయిపోయి ఒదిగి ఉన్నాయి.
కొండ చరియకు ప్రక్కనే ఉన్న బిలం వంక అవి చూడటం మానేశాయి. సరిగా సమయం పన్నెండు అవగానే కొండబిలం వాకిలి దగ్గర వరకూ తల చేర్చుకుని ఉన్న ఒక ప్రాణిలో కదలికలు ప్రారంభమయినాయి.
అది బిలంలో దాచిన దీర్ఘతరమయిన శరీరాన్ని వెలుపలకు తీయటం ప్రారంభిం చింది. పండి ముదిరిపోయిన తాడిపండు వర్ణంతో శరీరం మెరమెరలాడుతోంది. ఆరంగుళాలకు ఒకటి చొప్పున దాని శరీరంమీద బంగారు వర్ణం వలయా లున్నాయి. నలుపు ముదిరిన ఎరుపు కలిసి మెరమెరలాడే శరీరం మీద బంగారు రంగు రింగులు అమిత భయం కొలుపుతున్నాయి. బిలం నించి క్రమంగా శరీరాన్ని బయటకు లాగుతూ ఉంటే మొత్తం పదహారు రింగులు వచ్చాయి.......................
నాగభైరవి పాలబువ్వతో నిండిన వెండికంచంలా వెలిగి పోతున్నాడు చందమామ. పుచ్చ పువ్వుల రేకులు పరచినట్లుగా అయింది వియత్తలం. అది పూర్ణిమనాటి రాత్రి! సమయం పన్నెండు గంటలవుతూంది. కొండచరియల మీద తాకిన వెన్నెల కిరణాలు జిలుగు చారాల్లా క్రిందికి జారుతున్నాయి. మత్తెక్కిన క్రొత్తజంట గోరువంకలు కొమ్మల మాటునించి కువ్వున కూశాయి. సర్పాలు కన్పిస్తే గోరువంకలు కూస్తాయి. తమ నేస్తాలను పిలుస్తాయి. అర్ధరాత్రి అలసి సొలసిన గోరువంకల జంటలన్నీ జోగుతున్నాయి. క్రొత్త జంట కూతల్ని అవేవీ విన్పించుకోలేదు. నేస్తాలెవరూ రాకపోవటంతో క్రొత్త జంట కువ్వున కూయటం మానేశాయి. రెక్కలు అప్పళించి మరొక మారు ముక్కులు రాచుకున్నాయి. పచ్చని ఆకుల మాటు వచ్చి పచ్చి కోరికతో ఒక్కటిగా అయిపోయి ఒదిగి ఉన్నాయి. కొండ చరియకు ప్రక్కనే ఉన్న బిలం వంక అవి చూడటం మానేశాయి. సరిగా సమయం పన్నెండు అవగానే కొండబిలం వాకిలి దగ్గర వరకూ తల చేర్చుకుని ఉన్న ఒక ప్రాణిలో కదలికలు ప్రారంభమయినాయి. అది బిలంలో దాచిన దీర్ఘతరమయిన శరీరాన్ని వెలుపలకు తీయటం ప్రారంభిం చింది. పండి ముదిరిపోయిన తాడిపండు వర్ణంతో శరీరం మెరమెరలాడుతోంది. ఆరంగుళాలకు ఒకటి చొప్పున దాని శరీరంమీద బంగారు వర్ణం వలయా లున్నాయి. నలుపు ముదిరిన ఎరుపు కలిసి మెరమెరలాడే శరీరం మీద బంగారు రంగు రింగులు అమిత భయం కొలుపుతున్నాయి. బిలం నించి క్రమంగా శరీరాన్ని బయటకు లాగుతూ ఉంటే మొత్తం పదహారు రింగులు వచ్చాయి.......................© 2017,www.logili.com All Rights Reserved.