Rs.216
Rs.216

Panchatantram
INR
AMARAVAT36
In Stock
216.0
Rs.216


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

విష్ణుశర్మ చెప్పిన పంచతంత్రం కధలు తరతరాలుగా వస్తున్నాయి . పురాణాలూ . ఇతిహాసాల తర్వాత ఇంత ప్రాచుర్యం పొందిన కధలు మరొకటి లేవు . గుణాడ్యుడు రాసిన బృహత్కధలోని కొన్ని కధలే విష్ణుశర్మ పంచతంత్రానికి ఆధారం . ఈ కధల్ని విష్ణుశర్మ అయిదో శతాబ్దంలో రచించాడు . ఇవి మిత్రలాభం . మిత్రభేదం . కాకోలుకీయం, లబ్ధప్రణాశం, అపరీక్షిత కారకం అని అయిదు భాగాలుగా ప్రసిద్ధి చెందాయి .

 

పంచతంత్రం కధల ఆధారంగా 14 వ శతాబ్దంలో నారాయణ పండితుడు 'హితోపదేశం'రాసాడు . ఈ హితోపదేశం లో మిత్రలాభం , మిత్రభేదం,సంధి , విగ్రహం అని నాలుగు భాగాలు ఉన్నాయి . హితోపదేశం లోని మిత్రలాభం, మిత్ర భేదాలను పరవస్తు చిన్నయ సూరి తెలుగులో అనువదిస్తే, సంధి విగ్రహాలను కందుకూరి వీరేశలింగం అనువదించారు . ఈ నాలుగింటిని కలిపి 'నీతి చంద్రిక ' అని వ్యవహరిస్తున్నారు. అయిదు భాగాలుగా ఉన్న పంచతంత్రం ,అన్న  నాలుగే భాగాలూ ఉన్న హితోపదేశం అన్నా  రెండు  ఒకటే ! అయినా ఈ రెంటిని కలిపి, సమగ్రంగా సరళ వ్యావహారికంలో పాటకుల కోరిక మేరకు అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) నవ్య వీక్లీలో వారం వారం రాసారు . ఆ కదలనే ఇప్పుడే పుస్తకంగా వెలువరిస్తున్నాం .

 

ఈ కధలు పిల్లలకు చాల ఆసక్తికరంగా ఉంటాయి . కధలలో పాత్రలు జంతువులు కావడం, జంతువులు మనుషుల్లా మాట్లాడుకోవడం, ప్రవర్తించడం పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి . పైగా ప్రతి కధకూ నీతి ఉన్న కారణంగా ఈ కధల్ని పిల్లలు తప్పని సరిగా చదివి తీరాలి . చదివితే మంచి-చెడులు ఇట్టే వారికీ తెలిసి వస్తాయి . పిల్లల కోసం, పెద్దల్లో ఉన్న పిల్లల కోసం సంపూర్ణంగా రూపొందించిన ఈ పంచతంత్రం నేటి తరానికి అపూర్వ కానుక .

 

 

 

రచయిత గురించి

అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) 13-04-1956 లో జన్మించారు . ప్రవృతి రీత్యా రచయిత, వృతి రీత్యా పత్రికా రచయిత అయిన వీరు సుమారుగా అయిదు వందల కధలూ,అయిదు నవలలూ, అనేక వ్యాసాలు రాసారు . సినిమా, టీవీ రచయితగా కూడా ప్రసిద్దులు . ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ప్రచురణ 'నవ్య వీక్లీ'కి సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు . పిల్లల కోసం వీరు రాసిన పాలపిట్ట (ప్రపంచ ప్రఖ్యాత జానపద కధల సంకలనం ), కధాసరిత్సాగరం , మహా భారతం పలువురి ప్రశంసలు అందుకున్నాయి . 

విష్ణుశర్మ చెప్పిన పంచతంత్రం కధలు తరతరాలుగా వస్తున్నాయి . పురాణాలూ . ఇతిహాసాల తర్వాత ఇంత ప్రాచుర్యం పొందిన కధలు మరొకటి లేవు . గుణాడ్యుడు రాసిన బృహత్కధలోని కొన్ని కధలే విష్ణుశర్మ పంచతంత్రానికి ఆధారం . ఈ కధల్ని విష్ణుశర్మ అయిదో శతాబ్దంలో రచించాడు . ఇవి మిత్రలాభం . మిత్రభేదం . కాకోలుకీయం, లబ్ధప్రణాశం, అపరీక్షిత కారకం అని అయిదు భాగాలుగా ప్రసిద్ధి చెందాయి .   పంచతంత్రం కధల ఆధారంగా 14 వ శతాబ్దంలో నారాయణ పండితుడు 'హితోపదేశం'రాసాడు . ఈ హితోపదేశం లో మిత్రలాభం , మిత్రభేదం,సంధి , విగ్రహం అని నాలుగు భాగాలు ఉన్నాయి . హితోపదేశం లోని మిత్రలాభం, మిత్ర భేదాలను పరవస్తు చిన్నయ సూరి తెలుగులో అనువదిస్తే, సంధి విగ్రహాలను కందుకూరి వీరేశలింగం అనువదించారు . ఈ నాలుగింటిని కలిపి 'నీతి చంద్రిక ' అని వ్యవహరిస్తున్నారు. అయిదు భాగాలుగా ఉన్న పంచతంత్రం ,అన్న  నాలుగే భాగాలూ ఉన్న హితోపదేశం అన్నా  రెండు  ఒకటే ! అయినా ఈ రెంటిని కలిపి, సమగ్రంగా సరళ వ్యావహారికంలో పాటకుల కోరిక మేరకు అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) నవ్య వీక్లీలో వారం వారం రాసారు . ఆ కదలనే ఇప్పుడే పుస్తకంగా వెలువరిస్తున్నాం .   ఈ కధలు పిల్లలకు చాల ఆసక్తికరంగా ఉంటాయి . కధలలో పాత్రలు జంతువులు కావడం, జంతువులు మనుషుల్లా మాట్లాడుకోవడం, ప్రవర్తించడం పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి . పైగా ప్రతి కధకూ నీతి ఉన్న కారణంగా ఈ కధల్ని పిల్లలు తప్పని సరిగా చదివి తీరాలి . చదివితే మంచి-చెడులు ఇట్టే వారికీ తెలిసి వస్తాయి . పిల్లల కోసం, పెద్దల్లో ఉన్న పిల్లల కోసం సంపూర్ణంగా రూపొందించిన ఈ పంచతంత్రం నేటి తరానికి అపూర్వ కానుక .       రచయిత గురించి అయలసోమయాజుల నీలకంటేశ్వర జగన్నాధ శర్మ (అనీలజ) 13-04-1956 లో జన్మించారు . ప్రవృతి రీత్యా రచయిత, వృతి రీత్యా పత్రికా రచయిత అయిన వీరు సుమారుగా అయిదు వందల కధలూ,అయిదు నవలలూ, అనేక వ్యాసాలు రాసారు . సినిమా, టీవీ రచయితగా కూడా ప్రసిద్దులు . ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ప్రచురణ 'నవ్య వీక్లీ'కి సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు . పిల్లల కోసం వీరు రాసిన పాలపిట్ట (ప్రపంచ ప్రఖ్యాత జానపద కధల సంకలనం ), కధాసరిత్సాగరం , మహా భారతం పలువురి ప్రశంసలు అందుకున్నాయి . 

Features

  • : Panchatantram
  • : Ayalasomayajula Neelakanteswara Jagannadha Sarma
  • : Amaravati
  • : AMARAVAT36
  • : Paperback
  • : 196
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Panchatantram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam