అన్నయ్య కనపడటం లేదని తెలిసి సిటీకి వచ్చాను.
రైల్వేస్టేషన్ లోంచి బైటకు రాగానే నా ముందు - ఆకాశం లోకి లేచిన హోర్డింగ్లు, రోడ్ల మీదకి తన్నుకొచ్చిన వ్యాపారాలు, పుట్ట చెదిరి పొంగే చీమల్లాగ మనుషులు... మధ్యాహ్నమంతా కాలి కాలి ఉందేమో నగరం ఇప్పుడు ఉడుకుడుకు సాయంత్రం లోకి దిగింది. మనుషులు ఒక బరువైన రోజుని మోసిన అలసటతో అసహనంగా ఉన్నారు.
రోడ్డు అవతల నేల మీద ఒక వికలాంగుడైన బిచ్చగాడు, ఒంటి మీద చెడ్డీ తప్ప ఏమీ లేకుండా, ఉన్న వైకల్యాన్ని మరింత అతి చేసి, కాలుతున్న రోడ్డుకి చెంప ఆనించి, చిల్లర కోసం చేయి ఒక్కటి మాత్రం పైకి చాపి, "అమ్మా అయ్యా" అని అడుక్కుంటున్నాడు. వాడి యాతనలో మోసం, మోసంలో యాతన....
బస్సు ఒక వేడి ఇనుము డబ్బా లాగ వచ్చి ఆగింది. కడ్డీకి ఆనుకుని నిలబడే చోటు మాత్రమే నాకు దొరికింది. నా చుట్టూ వేలాడే చేతులు, బస్సుతోపాటు ఊగే శరీరాలు. అన్నయ్య ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా బస్ ఎక్కానని చెప్పాను. ఎక్కడ దిగాలో చెప్పాడు. ఎంతసేపు పడుతుందని అడిగాను. ట్రాఫిక్ టైమ్ కదా ఒక గంట పైనే పట్టొచ్చు అన్నాడు. రోడ్డు మీద బైకులూ కార్ల మధ్య బస్సు చిక్కుకుపోయి, ఆగాగి కదులుతా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు కూడా జనం తోసుకుంటూ ఎక్కేస్తున్నారు. మనుషుల చెమట వాసన ఒక వస్తువు లాగ నా ముక్కు కన్నాల్లోకి దూరుతుంది. ఒక్కసారి కిటికీ లోంచి తల బైట పెట్టి గాలి పీల్చుకోవాలని ఉంది.......................
అన్నయ్య కనపడటం లేదని తెలిసి సిటీకి వచ్చాను. రైల్వేస్టేషన్ లోంచి బైటకు రాగానే నా ముందు - ఆకాశం లోకి లేచిన హోర్డింగ్లు, రోడ్ల మీదకి తన్నుకొచ్చిన వ్యాపారాలు, పుట్ట చెదిరి పొంగే చీమల్లాగ మనుషులు... మధ్యాహ్నమంతా కాలి కాలి ఉందేమో నగరం ఇప్పుడు ఉడుకుడుకు సాయంత్రం లోకి దిగింది. మనుషులు ఒక బరువైన రోజుని మోసిన అలసటతో అసహనంగా ఉన్నారు. రోడ్డు అవతల నేల మీద ఒక వికలాంగుడైన బిచ్చగాడు, ఒంటి మీద చెడ్డీ తప్ప ఏమీ లేకుండా, ఉన్న వైకల్యాన్ని మరింత అతి చేసి, కాలుతున్న రోడ్డుకి చెంప ఆనించి, చిల్లర కోసం చేయి ఒక్కటి మాత్రం పైకి చాపి, "అమ్మా అయ్యా" అని అడుక్కుంటున్నాడు. వాడి యాతనలో మోసం, మోసంలో యాతన.... బస్సు ఒక వేడి ఇనుము డబ్బా లాగ వచ్చి ఆగింది. కడ్డీకి ఆనుకుని నిలబడే చోటు మాత్రమే నాకు దొరికింది. నా చుట్టూ వేలాడే చేతులు, బస్సుతోపాటు ఊగే శరీరాలు. అన్నయ్య ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా బస్ ఎక్కానని చెప్పాను. ఎక్కడ దిగాలో చెప్పాడు. ఎంతసేపు పడుతుందని అడిగాను. ట్రాఫిక్ టైమ్ కదా ఒక గంట పైనే పట్టొచ్చు అన్నాడు. రోడ్డు మీద బైకులూ కార్ల మధ్య బస్సు చిక్కుకుపోయి, ఆగాగి కదులుతా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు కూడా జనం తోసుకుంటూ ఎక్కేస్తున్నారు. మనుషుల చెమట వాసన ఒక వస్తువు లాగ నా ముక్కు కన్నాల్లోకి దూరుతుంది. ఒక్కసారి కిటికీ లోంచి తల బైట పెట్టి గాలి పీల్చుకోవాలని ఉంది.......................© 2017,www.logili.com All Rights Reserved.