December Poolu

By Sujatha Velpuri (Author), Balaram (Author)
Rs.175
Rs.175

December Poolu
INR
MANIMN2930
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                   ఈ సంకలనం గురించి... ఇదొక కొత్త సంకలనం. గొప్ప కథలు, ఉత్తమ కథలు, ఎంపికచేసిన కథలు వగైరా ముద్రలేం లేకుండా స్వచ్చంగా వచ్చిన సంకలనం. అలాగే వాదాలు, సిద్ధాంతాల చర్చలు, వాదనలు లేకుండా జీవితాన్ని జీవితంగా చూసి, ఆ ఆలోచనల నుంచి రచయిత్రులు సృష్టించిన కథలివి. ప్రేమ, విరహం, బలహీనత, మెలకువ, ఆశ, పశ్చాత్తాపం, కోపం, భయం, దిద్దు బాటు, కాస్త హాస్యం... వంటి సహజాతాలన్నీ వీటిలో సహజంగా తొంగి చూస్తాయి.

                    తెలుగులో కథాసాహిత్యం విస్తృతికి 'అనల్ప' చేస్తున్న ప్రయత్నాలకు కొనసాగింపుగా ఇలాంటి సంకలనం తీసుకొద్దామని తలచినంతనే మొదటి సంకలనం రచయిత్రులదై ఉండాలని నిర్ణయించి, కథలను ఆహ్వానించాం. నెలకిన్ని కథలు రాసితీరాలని నియమం పెట్టుకుని పరిగెత్తనివారిని ఎంచు కున్నాం. కథాంశాలు తీరికగా ఎంచుకునే వెసులుబాటు ఇచ్చాం. ఎన్నో పనుల్లో మునిగివున్నా 'అనల్ప'కోసం ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి కథలు అందించిన రచయిత్రులందరికీ పేరు పేరునా అనేక ధన్యవాదాలు.కథలను కథలుగా రాయగలిగి వుండి- అనేకానేక కారణాల రీత్యా రాయకుండా జీవితాన్ని నడిపించేస్తున్నవారు చాలాకాలానికి మళ్లీ కథలు రాశారు. రాయగలిగినవాళ్లు ఇక నుంచి తరచూ రాస్తూ ఉండటానికి ఈ సంకలనం తోడ్పడితే అదే చాలు. -

                     ఏ ఒక్కరి కథనూ ముందుగా ఇక్కడ చర్చించే ఉద్దేశం మాకు లేదు. కథల గురించి కథలే మాట్లాడాలి తప్ప ముందుమాటలు కాదు. పాఠకుల్ని ముందుగా ఏమాత్రం ప్రభావితం చేయరాదన్నది మా గట్టి నిర్ణయం. ఈ ఏడాది పూసిన 'డిసెంబర్ పూలు' ఇవి. మాల కట్టండి మరి. 

                                                                                                                          -సుజాత వేల్పూరి, బలరామ్ 

                                                                                                                                     సంపాదకులు

                   ఈ సంకలనం గురించి... ఇదొక కొత్త సంకలనం. గొప్ప కథలు, ఉత్తమ కథలు, ఎంపికచేసిన కథలు వగైరా ముద్రలేం లేకుండా స్వచ్చంగా వచ్చిన సంకలనం. అలాగే వాదాలు, సిద్ధాంతాల చర్చలు, వాదనలు లేకుండా జీవితాన్ని జీవితంగా చూసి, ఆ ఆలోచనల నుంచి రచయిత్రులు సృష్టించిన కథలివి. ప్రేమ, విరహం, బలహీనత, మెలకువ, ఆశ, పశ్చాత్తాపం, కోపం, భయం, దిద్దు బాటు, కాస్త హాస్యం... వంటి సహజాతాలన్నీ వీటిలో సహజంగా తొంగి చూస్తాయి.                     తెలుగులో కథాసాహిత్యం విస్తృతికి 'అనల్ప' చేస్తున్న ప్రయత్నాలకు కొనసాగింపుగా ఇలాంటి సంకలనం తీసుకొద్దామని తలచినంతనే మొదటి సంకలనం రచయిత్రులదై ఉండాలని నిర్ణయించి, కథలను ఆహ్వానించాం. నెలకిన్ని కథలు రాసితీరాలని నియమం పెట్టుకుని పరిగెత్తనివారిని ఎంచు కున్నాం. కథాంశాలు తీరికగా ఎంచుకునే వెసులుబాటు ఇచ్చాం. ఎన్నో పనుల్లో మునిగివున్నా 'అనల్ప'కోసం ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి కథలు అందించిన రచయిత్రులందరికీ పేరు పేరునా అనేక ధన్యవాదాలు.కథలను కథలుగా రాయగలిగి వుండి- అనేకానేక కారణాల రీత్యా రాయకుండా జీవితాన్ని నడిపించేస్తున్నవారు చాలాకాలానికి మళ్లీ కథలు రాశారు. రాయగలిగినవాళ్లు ఇక నుంచి తరచూ రాస్తూ ఉండటానికి ఈ సంకలనం తోడ్పడితే అదే చాలు. -                      ఏ ఒక్కరి కథనూ ముందుగా ఇక్కడ చర్చించే ఉద్దేశం మాకు లేదు. కథల గురించి కథలే మాట్లాడాలి తప్ప ముందుమాటలు కాదు. పాఠకుల్ని ముందుగా ఏమాత్రం ప్రభావితం చేయరాదన్నది మా గట్టి నిర్ణయం. ఈ ఏడాది పూసిన 'డిసెంబర్ పూలు' ఇవి. మాల కట్టండి మరి.                                                                                                                            -సుజాత వేల్పూరి, బలరామ్                                                                                                                                       సంపాదకులు

Features

  • : December Poolu
  • : Sujatha Velpuri
  • : Analpa book company
  • : MANIMN2930
  • : Paperback
  • : Sep-2021
  • : 162
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:December Poolu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam