సికింద్రాబాద్ స్టేషన్. ప్లాట్ఫాం మీద ట్రైన్ ఆగీ ఆగక ముందే హడావిడిగా దిగడానికి తోసుకుంటున్నారు జనాలు. తమ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళూ, ఎక్కడానికి వచ్చిన వాళ్ళతో ప్లాట్ఫామ్ కిటకిటలాడుతోంది. వాళ్ళందరి మధ్యలో అతని కోసం ఎదురు చూస్తోందామె. ఇంతకు ముందులా గంట ముందే అతనొచ్చి కూర్చోడని ఆమెకి తెలుసు. అయినా బేగేజ్ సర్దుకుంటూ అతనికోసం కిటికీలోంచి చూస్తోంది.
సరిగ్గా ఆమె డోర్ దగ్గరకి వచ్చేటప్పటికి రెండేసి మెట్లు ఒకసారిగా దిగుతూ వస్తున్న అతన్ని చూసింది. ఎంత మందిలో ఉన్నా అలవాటైన అతని రూపం పోల్చుకోవడం కష్టం కాదు. అసలు వందమంది గుంపులో అతన్ని పోల్చుకోవడం ఇంకా తేలిక. మనిషి ఒకవైపు వంగి, భుజాలని క్రాస్ గా పెట్టి ప్రత్యేకంగా నడుస్తాడు అతను. మనుషుల్ని చులాగ్గా తప్పించుకోవడానికి అదొక టెక్నిక్. మనుషుల్ని తప్పించుకోవడం....
దగ్గరకి వచ్చి ఆమె చేతిలో లగేజ్ తీసుకుంటూ క్షణం పాటు ఆమె కళ్లలోకి చూశాడు. ఏదో చెప్పబోయాడు కళ్ళతోనే. అంతలోనే మాస్క్ తీసి పలకరింపుగా నవ్వాడతను. ఆ నవ్వున్నంత క్షణం కూడా వాళ్ళ కళ్ళు కలవలేదు.
“త్వరగా వెళ్లాం ఫ్లయిట్ టైం సరిపోదు. కనీసం వెబ్ చెకిన్ అయినా అయ్యుండాల్సింది" అంటూనే వేగంగా బయటకి నడిచాడతను.
బయట ఒకటే వర్షం. ట్రాఫిక్ దాటుకుని ఎయిర్పోర్ట్క సమయానికి వెళ్ళగలమా అని కంగారు మొదలయ్యిందామెకి. శంషాబాద్ ఫ్లైఓవర్కి వెళ్ళే....................
రెక్కచాటు ఆకాశం ON THE THRESHOLD సికింద్రాబాద్ స్టేషన్. ప్లాట్ఫాం మీద ట్రైన్ ఆగీ ఆగక ముందే హడావిడిగా దిగడానికి తోసుకుంటున్నారు జనాలు. తమ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళూ, ఎక్కడానికి వచ్చిన వాళ్ళతో ప్లాట్ఫామ్ కిటకిటలాడుతోంది. వాళ్ళందరి మధ్యలో అతని కోసం ఎదురు చూస్తోందామె. ఇంతకు ముందులా గంట ముందే అతనొచ్చి కూర్చోడని ఆమెకి తెలుసు. అయినా బేగేజ్ సర్దుకుంటూ అతనికోసం కిటికీలోంచి చూస్తోంది. సరిగ్గా ఆమె డోర్ దగ్గరకి వచ్చేటప్పటికి రెండేసి మెట్లు ఒకసారిగా దిగుతూ వస్తున్న అతన్ని చూసింది. ఎంత మందిలో ఉన్నా అలవాటైన అతని రూపం పోల్చుకోవడం కష్టం కాదు. అసలు వందమంది గుంపులో అతన్ని పోల్చుకోవడం ఇంకా తేలిక. మనిషి ఒకవైపు వంగి, భుజాలని క్రాస్ గా పెట్టి ప్రత్యేకంగా నడుస్తాడు అతను. మనుషుల్ని చులాగ్గా తప్పించుకోవడానికి అదొక టెక్నిక్. మనుషుల్ని తప్పించుకోవడం.... దగ్గరకి వచ్చి ఆమె చేతిలో లగేజ్ తీసుకుంటూ క్షణం పాటు ఆమె కళ్లలోకి చూశాడు. ఏదో చెప్పబోయాడు కళ్ళతోనే. అంతలోనే మాస్క్ తీసి పలకరింపుగా నవ్వాడతను. ఆ నవ్వున్నంత క్షణం కూడా వాళ్ళ కళ్ళు కలవలేదు. “త్వరగా వెళ్లాం ఫ్లయిట్ టైం సరిపోదు. కనీసం వెబ్ చెకిన్ అయినా అయ్యుండాల్సింది" అంటూనే వేగంగా బయటకి నడిచాడతను. బయట ఒకటే వర్షం. ట్రాఫిక్ దాటుకుని ఎయిర్పోర్ట్క సమయానికి వెళ్ళగలమా అని కంగారు మొదలయ్యిందామెకి. శంషాబాద్ ఫ్లైఓవర్కి వెళ్ళే....................© 2017,www.logili.com All Rights Reserved.