దూరం
ఏదో పోగొట్టుకున్నదానిలా దిగులుగా కూర్చున్న లత వైపు అనుమానంగా చూస్తూ అడిగింది సంధ్య. "ఏమైంది లతా! అలా ఉన్నావేం?"
లత మాట్లాడలేదు. తలవంచుకుని టేబుల్ అంచులు చూస్తూ కూర్చుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జలజలా రాలి టేబుల్ తడిపాయి. సంధ్య హృదయం ద్రవించింది. పాపం అన్నీ కష్టాలే లతకి. భర్త తాగుబోతు ఏ పని చేయడు .. ఇద్దరాడపిల్లలు. ఒకమ్మాయి ఈ మధ్యే అతి కష్టం మీద డిగ్రీ అయిందనిపించి క్లాస్మేట్ ఎవరినో ప్రేమించి, లేచిపోయింది. రెండో అమ్మాయి డిగ్రీకి వచ్చింది. ఇద్దరూ కూడా తండ్రి పాలన లేకనో, కాలేజి వాతావరణమో, కాల ప్రభావమో మొత్తానికి ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా తయారు అయారు. షోకులు, తిరుగుళ్ళు, తల్లి కష్టం గమనించని అంధుల్లా ప్రవర్తిస్తారు. ఇంట్లో కూడా ఒక్క పనిలో సాయం చేయరు. పాపం లతే మొత్తం ఇంటి బరువు బాధ్యతలు మోస్తూ నలభై ఏళ్ళకే అరవై ఏళ్ల వయసు వచ్చేసినట్టు ఉంటుంది.
సంధ్య ఆమె భుజం మీద చెయ్యేసి అనునయంగా అడిగింది “ఏమైంది? నాకు చెప్పకూడదా!"
లత ఒక్కసారిగా బరస్ట్ అయింది. ఏడుస్తూ చెప్పింది పెద్ద కూతురు ప్రేమించి ఎవరితో లేచిపోయిందో ఆమె తిరిగి వచ్చిందిట. అది విన్న సంధ్య తేలిగ్గా నిట్టూర్చింది. "ఇది ఊహించిందేగా లతా! పోనీలే ఇప్పటికైనా తప్పు తెలుసుకుంది" అంది సంధ్య.
“తప్పు తెలుసుకుని కాదు సంధ్యా! నా నెత్తిన నిప్పులు పోయడానికి వచ్చింది” అంది వెక్కుతూ లత.
"కొంచెం అర్థం అయేలా చెప్తావా!" విసుగు అణచుకుంటూ అంది.
"నీకు కాకపోతే ఎవరికి చెబుతాను...” కళ్ళు తుడుచుకుని చెప్పసాగింది. ఆమె చెప్పిన సారాంశం ఏమిటంటే కూతురు ప్రేమించి, వెళ్ళిపోయిన తరువాత...................
దూరం ఏదో పోగొట్టుకున్నదానిలా దిగులుగా కూర్చున్న లత వైపు అనుమానంగా చూస్తూ అడిగింది సంధ్య. "ఏమైంది లతా! అలా ఉన్నావేం?" లత మాట్లాడలేదు. తలవంచుకుని టేబుల్ అంచులు చూస్తూ కూర్చుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జలజలా రాలి టేబుల్ తడిపాయి. సంధ్య హృదయం ద్రవించింది. పాపం అన్నీ కష్టాలే లతకి. భర్త తాగుబోతు ఏ పని చేయడు .. ఇద్దరాడపిల్లలు. ఒకమ్మాయి ఈ మధ్యే అతి కష్టం మీద డిగ్రీ అయిందనిపించి క్లాస్మేట్ ఎవరినో ప్రేమించి, లేచిపోయింది. రెండో అమ్మాయి డిగ్రీకి వచ్చింది. ఇద్దరూ కూడా తండ్రి పాలన లేకనో, కాలేజి వాతావరణమో, కాల ప్రభావమో మొత్తానికి ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా తయారు అయారు. షోకులు, తిరుగుళ్ళు, తల్లి కష్టం గమనించని అంధుల్లా ప్రవర్తిస్తారు. ఇంట్లో కూడా ఒక్క పనిలో సాయం చేయరు. పాపం లతే మొత్తం ఇంటి బరువు బాధ్యతలు మోస్తూ నలభై ఏళ్ళకే అరవై ఏళ్ల వయసు వచ్చేసినట్టు ఉంటుంది. సంధ్య ఆమె భుజం మీద చెయ్యేసి అనునయంగా అడిగింది “ఏమైంది? నాకు చెప్పకూడదా!" లత ఒక్కసారిగా బరస్ట్ అయింది. ఏడుస్తూ చెప్పింది పెద్ద కూతురు ప్రేమించి ఎవరితో లేచిపోయిందో ఆమె తిరిగి వచ్చిందిట. అది విన్న సంధ్య తేలిగ్గా నిట్టూర్చింది. "ఇది ఊహించిందేగా లతా! పోనీలే ఇప్పటికైనా తప్పు తెలుసుకుంది" అంది సంధ్య. “తప్పు తెలుసుకుని కాదు సంధ్యా! నా నెత్తిన నిప్పులు పోయడానికి వచ్చింది” అంది వెక్కుతూ లత. "కొంచెం అర్థం అయేలా చెప్తావా!" విసుగు అణచుకుంటూ అంది. "నీకు కాకపోతే ఎవరికి చెబుతాను...” కళ్ళు తుడుచుకుని చెప్పసాగింది. ఆమె చెప్పిన సారాంశం ఏమిటంటే కూతురు ప్రేమించి, వెళ్ళిపోయిన తరువాత...................© 2017,www.logili.com All Rights Reserved.