పది జీవితాల పెట్టు
ఆత్మీయ కవిమిత్రుడు అఫ్సర్ ఒకరోజు నాకు కాల్ చేసి ఒక పని అప్పగించాడు. సారంగలో "ఈ వారం కథ' అని కొత్త శీర్షిక మొదలుపెడుతున్నాం. అందులో వేసే కథలకు సంక్షిప్త వ్యాఖ్యానం జోడిస్తాము. నీకొక కథ పంపుతాను. నీ స్పందన రాసి పంపు' అని ఆదేశించాడు. శిరోధార్యం అన్నాను. ఆ వెంటనే కథ మెయిల్ చేశాడు. సహజమైన కుతూహలంతో రచయిత పేరు కోసం వెతికాను. కనిపించలేదు. కథల పోటీల సమయంలో పాటించే ఆ నియమం నచ్చింది. నా ముందు కథ మాత్రమే ఉంది. శీర్షిక 'గొప్ప కథేం కాదు. బుద్ధిగా చదివాను. నచ్చింది బాగా. మళ్లీ మళ్లీ చదివి ఇష్టంగా పది వాక్యాల్లో నా స్పందన రాసి పంపాను. ఆ కథ 2020 జూన్ 1వ తేదీ సారంగ సంచికలో వచ్చింది. ఆ కథా రచయిత్రి లక్ష్మీ ప్రియాంక. అలా ముందు కథ, ఆ తదుపరి తన పేరు పరిచయం నాకు. ఆ వారం మెసెంజర్ ద్వారా ఆమె పలుకరించారు. 2021లో జరిగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఒకరికొకరం నేరుగా కలుసుకున్నాం. కొద్దిసేపు కబుర్లు అయ్యాక కొత్త కథలు ఏం రాశారని అడిగాను. రాస్తున్నాను గానీ ఎవరికి పంపడంలేదన్నారు. కనీసం నాకైనా పంపండి చదువుతానని అన్నాను. అలా నా మెయిల్కి పంపిన తన మరో కథ 'ఎంతెంత దూరం' చదివాను. ఎంచుకున్న అంశం, కథనం నడిపించిన విధం కొత్తతరం స్ఫూర్తికి తగ్గ మోతాదుతో ఉన్నాయి. భేష్ అనుకున్నాను.
మేము ఫేస్బుక్ ఫ్రెండ్సయ్యాక ఈ యంగ్ రైటర్లో ఇంట్రస్టింగ్ కోణాలు చాలా ఉన్నాయని, తన మానసిక అంతస్తు ఎత్తులోనే ఉందని గ్రహించాను. లక్ష్మీ ప్రియాంక ఆర్టిస్టు. లిరిసిస్టు. ట్రావెలిస్టు. ఫెమినిస్టు. హ్యూమనిస్టు. ఇంకా ఎన్నెన్నో. ఒకసారి తెలుగింటి ఆడపిల్లలా సంప్రదాయ దుస్తులతో మెరిసిపోతూ కనిపిస్తుంది. మరోసారి కంటికింపైన జీన్స్ ఎన్ఫీల్డ్ రైడ్ చేస్తూ ఏ హిల్ స్టేషనులోనో ఉన్న ఫొటో పోస్ట్ చేస్తుంది. తన జీవిత కాలంలో ఏ క్షణాన్ని కూడా వృధా కానివ్వకుండా ఒడిసిపట్టి ఆస్వాదిస్తుందా అనిపించిన సందర్భాలున్నాయి నాకు. అంతేకాదు ఈ సమాజాన్నీ,......................
పది జీవితాల పెట్టు ఆత్మీయ కవిమిత్రుడు అఫ్సర్ ఒకరోజు నాకు కాల్ చేసి ఒక పని అప్పగించాడు. సారంగలో "ఈ వారం కథ' అని కొత్త శీర్షిక మొదలుపెడుతున్నాం. అందులో వేసే కథలకు సంక్షిప్త వ్యాఖ్యానం జోడిస్తాము. నీకొక కథ పంపుతాను. నీ స్పందన రాసి పంపు' అని ఆదేశించాడు. శిరోధార్యం అన్నాను. ఆ వెంటనే కథ మెయిల్ చేశాడు. సహజమైన కుతూహలంతో రచయిత పేరు కోసం వెతికాను. కనిపించలేదు. కథల పోటీల సమయంలో పాటించే ఆ నియమం నచ్చింది. నా ముందు కథ మాత్రమే ఉంది. శీర్షిక 'గొప్ప కథేం కాదు. బుద్ధిగా చదివాను. నచ్చింది బాగా. మళ్లీ మళ్లీ చదివి ఇష్టంగా పది వాక్యాల్లో నా స్పందన రాసి పంపాను. ఆ కథ 2020 జూన్ 1వ తేదీ సారంగ సంచికలో వచ్చింది. ఆ కథా రచయిత్రి లక్ష్మీ ప్రియాంక. అలా ముందు కథ, ఆ తదుపరి తన పేరు పరిచయం నాకు. ఆ వారం మెసెంజర్ ద్వారా ఆమె పలుకరించారు. 2021లో జరిగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఒకరికొకరం నేరుగా కలుసుకున్నాం. కొద్దిసేపు కబుర్లు అయ్యాక కొత్త కథలు ఏం రాశారని అడిగాను. రాస్తున్నాను గానీ ఎవరికి పంపడంలేదన్నారు. కనీసం నాకైనా పంపండి చదువుతానని అన్నాను. అలా నా మెయిల్కి పంపిన తన మరో కథ 'ఎంతెంత దూరం' చదివాను. ఎంచుకున్న అంశం, కథనం నడిపించిన విధం కొత్తతరం స్ఫూర్తికి తగ్గ మోతాదుతో ఉన్నాయి. భేష్ అనుకున్నాను. మేము ఫేస్బుక్ ఫ్రెండ్సయ్యాక ఈ యంగ్ రైటర్లో ఇంట్రస్టింగ్ కోణాలు చాలా ఉన్నాయని, తన మానసిక అంతస్తు ఎత్తులోనే ఉందని గ్రహించాను. లక్ష్మీ ప్రియాంక ఆర్టిస్టు. లిరిసిస్టు. ట్రావెలిస్టు. ఫెమినిస్టు. హ్యూమనిస్టు. ఇంకా ఎన్నెన్నో. ఒకసారి తెలుగింటి ఆడపిల్లలా సంప్రదాయ దుస్తులతో మెరిసిపోతూ కనిపిస్తుంది. మరోసారి కంటికింపైన జీన్స్ ఎన్ఫీల్డ్ రైడ్ చేస్తూ ఏ హిల్ స్టేషనులోనో ఉన్న ఫొటో పోస్ట్ చేస్తుంది. తన జీవిత కాలంలో ఏ క్షణాన్ని కూడా వృధా కానివ్వకుండా ఒడిసిపట్టి ఆస్వాదిస్తుందా అనిపించిన సందర్భాలున్నాయి నాకు. అంతేకాదు ఈ సమాజాన్నీ,......................© 2017,www.logili.com All Rights Reserved.