విజయానికి పదకొండు మెట్లు
పీఠిక
'విజయానికి పదకొండు మెట్లు' అనే ఈ గ్రంథాన్ని ఒక మూడు సంవత్సరాలుగా వ్రాస్తున్నాను. ఇందుకోసం మానసిక శాస్త్రవేత్తలు వ్రాసిన అనేక గ్రంథాలను అధ్యయనం చేయటం జరిగింది. మనోవిజ్ఞాన శాస్త్రానికి, సామాజిక శాస్త్రానికి, శరీర నిర్మాణ శాస్త్రానికి ఉన్న అవినాభావ సంబంధం ఈ అధ్యయనం వలన నాకు తెలిసింది. ఇంకా తెలుసుకోవలసింది ఎంతో వుంది. అయితే ప్రపంచ విజేతలు, వ్యక్తిత్వ నిర్మాణ శిల్పం అనే సిరీస్ ఇప్పటికి ఎనిమిది వ్రాసాను. ఈ క్రమంలో ఈ అధ్యయనం సాగుతూ వుంటుంది. ఈ గ్రంథంలో ముఖ్యమైన అ నీలో ఎన్నో క్వాలిటీస్ వున్నట్టే ఎదుటివారిలో కూడా ప్రతిభలు, ప్రజ్ఞలు, ఇనిస్పిరేషన్స్, ప్రతిస్పందనలు వుంటాయని మనం గుర్తించినప్పుడే ఎవరైనా విజయ సోపానం ఎక్కగలుగుతారు అనేది దృక్పథం. సౌందర్యం అనేది ఎక్కడో లేదు అది నీ అంతర్గతంగా, మానసికంగా, సామాజికంగా, తాత్వికంగా ఆలోచించినప్పుడు నీలోనే దొరుకుతుందని ఈ గ్రంథం ప్రతిపాదిస్తుంది.
ఈ గ్రంథం చదువుతుంటే నేను 'నాలో కొన్ని ప్రతిభలు వున్నాయి, నన్ను నేను దర్శించగలిగితే, నాలో సృజనాత్మకత వుంది, సామాజిక శాస్త్ర అవగాహన వుంది, అధ్యయన శీలత వుంది'. మనం దేనికి కృంగిపోకూడదు, ఓడిపోవటం అనేది మానవుడికి లేదు. ఓడిపోతే కృంగిపోకూడదు. ఓటమికి లొంగిపోకూడదు. ఓడిపోతే వాడిపోకూడదు. వాడిమిని కోల్పోకూడదు. ఓడిపోయాక మనిషి ఎడారిలో ఒంటరివాణ్ణి అయిపోయానని కృశించిపోతూ వుండిపోకూడదు. ఎందుకూ కొరగాని వాణ్ణి అయిపోయానని నిస్తేజంగా వుండిపోకూడదు. ఓటమి గురించి చింత, చింతలను అధిగమించాలంటే మనషిని గెలవాలి అన్న చైతన్యం కావాలి,......................
విజయానికి పదకొండు మెట్లుపీఠిక 'విజయానికి పదకొండు మెట్లు' అనే ఈ గ్రంథాన్ని ఒక మూడు సంవత్సరాలుగా వ్రాస్తున్నాను. ఇందుకోసం మానసిక శాస్త్రవేత్తలు వ్రాసిన అనేక గ్రంథాలను అధ్యయనం చేయటం జరిగింది. మనోవిజ్ఞాన శాస్త్రానికి, సామాజిక శాస్త్రానికి, శరీర నిర్మాణ శాస్త్రానికి ఉన్న అవినాభావ సంబంధం ఈ అధ్యయనం వలన నాకు తెలిసింది. ఇంకా తెలుసుకోవలసింది ఎంతో వుంది. అయితే ప్రపంచ విజేతలు, వ్యక్తిత్వ నిర్మాణ శిల్పం అనే సిరీస్ ఇప్పటికి ఎనిమిది వ్రాసాను. ఈ క్రమంలో ఈ అధ్యయనం సాగుతూ వుంటుంది. ఈ గ్రంథంలో ముఖ్యమైన అ నీలో ఎన్నో క్వాలిటీస్ వున్నట్టే ఎదుటివారిలో కూడా ప్రతిభలు, ప్రజ్ఞలు, ఇనిస్పిరేషన్స్, ప్రతిస్పందనలు వుంటాయని మనం గుర్తించినప్పుడే ఎవరైనా విజయ సోపానం ఎక్కగలుగుతారు అనేది దృక్పథం. సౌందర్యం అనేది ఎక్కడో లేదు అది నీ అంతర్గతంగా, మానసికంగా, సామాజికంగా, తాత్వికంగా ఆలోచించినప్పుడు నీలోనే దొరుకుతుందని ఈ గ్రంథం ప్రతిపాదిస్తుంది. ఈ గ్రంథం చదువుతుంటే నేను 'నాలో కొన్ని ప్రతిభలు వున్నాయి, నన్ను నేను దర్శించగలిగితే, నాలో సృజనాత్మకత వుంది, సామాజిక శాస్త్ర అవగాహన వుంది, అధ్యయన శీలత వుంది'. మనం దేనికి కృంగిపోకూడదు, ఓడిపోవటం అనేది మానవుడికి లేదు. ఓడిపోతే కృంగిపోకూడదు. ఓటమికి లొంగిపోకూడదు. ఓడిపోతే వాడిపోకూడదు. వాడిమిని కోల్పోకూడదు. ఓడిపోయాక మనిషి ఎడారిలో ఒంటరివాణ్ణి అయిపోయానని కృశించిపోతూ వుండిపోకూడదు. ఎందుకూ కొరగాని వాణ్ణి అయిపోయానని నిస్తేజంగా వుండిపోకూడదు. ఓటమి గురించి చింత, చింతలను అధిగమించాలంటే మనషిని గెలవాలి అన్న చైతన్యం కావాలి,......................© 2017,www.logili.com All Rights Reserved.