కరుణా సముద్రుడు
కత్తులు కరాళ నాట్యం చేస్తూ నెత్తుటేరులు పారించే కాలంలో, మానవ జాతికి కరుణ గురించి బోధించి, కళ్ళు తెరిపించిన కరుణామయుడు బుద్ధుడు. యజ్ఞయాగాల పేరుతో వేలాది జీవుల ప్రాణాలు అగ్నికి ఆహుతి అయ్యే సమయంలో ధార్మిక మార్గాన్ని చూపించి, జీవుల బలుల్ని ఆపిన జీవ కారుణ్యమూర్తి బుద్ధుడు.
ఆయన సర్వస్వాన్నీ వదిలి, జ్ఞానార్జన కోసం, దుఃఖ నివారణ మార్గం కోసం అన్వేషిస్తూ వచ్చాడు. మొదటి రోజుల్లో మగధ రాజధాని రాజగృహ సమీపంలోని పాండవ పర్వతాలపై ఉండేవాడు. ఒకనాడు... ఆయన రాజగృహ సమీప మార్గంలో ఉన్నాడు. అదే సమయానికి ఆ దారివెంట ఒక గొర్రెలమంద రావడం చూశాడు. ఆ మంద చివర ఒక కుంటి గొర్రెపిల్ల ఉంది. అది నడవ లేకుంది. మందకు చాలా వెనుకబడిపోయింది. ఆర్తిగా అరుస్తూ వస్తోంది. దాని పిలుపు విని ఆ గొర్రె పిల్ల తల్లి తల్లడిల్లుతూ, మందలోంచి పరుగు పరుగున వెనక్కు వచ్చింది. ఆ పిల్ల చుట్టూ తిరుగుతోంది. మళ్ళీ మందలోకి పరుగు తీస్తోంది.
వెంటనే బుద్ధుడు వచ్చి, గొర్రె పిల్లను ఎత్తుకుని మంద వెంట నడిచాడు. తల్లి గొర్రె వచ్చి బుద్ధుని చుట్టూ తిరిగి ఆయన వెంట పడింది. బుద్ధుడు మందను తోలుకుపోతున్న కాపరులతో -
“ఈ మంద ఎక్కడికి?” అని అడిగాడు.............................
కరుణా సముద్రుడు కత్తులు కరాళ నాట్యం చేస్తూ నెత్తుటేరులు పారించే కాలంలో, మానవ జాతికి కరుణ గురించి బోధించి, కళ్ళు తెరిపించిన కరుణామయుడు బుద్ధుడు. యజ్ఞయాగాల పేరుతో వేలాది జీవుల ప్రాణాలు అగ్నికి ఆహుతి అయ్యే సమయంలో ధార్మిక మార్గాన్ని చూపించి, జీవుల బలుల్ని ఆపిన జీవ కారుణ్యమూర్తి బుద్ధుడు. ఆయన సర్వస్వాన్నీ వదిలి, జ్ఞానార్జన కోసం, దుఃఖ నివారణ మార్గం కోసం అన్వేషిస్తూ వచ్చాడు. మొదటి రోజుల్లో మగధ రాజధాని రాజగృహ సమీపంలోని పాండవ పర్వతాలపై ఉండేవాడు. ఒకనాడు... ఆయన రాజగృహ సమీప మార్గంలో ఉన్నాడు. అదే సమయానికి ఆ దారివెంట ఒక గొర్రెలమంద రావడం చూశాడు. ఆ మంద చివర ఒక కుంటి గొర్రెపిల్ల ఉంది. అది నడవ లేకుంది. మందకు చాలా వెనుకబడిపోయింది. ఆర్తిగా అరుస్తూ వస్తోంది. దాని పిలుపు విని ఆ గొర్రె పిల్ల తల్లి తల్లడిల్లుతూ, మందలోంచి పరుగు పరుగున వెనక్కు వచ్చింది. ఆ పిల్ల చుట్టూ తిరుగుతోంది. మళ్ళీ మందలోకి పరుగు తీస్తోంది. వెంటనే బుద్ధుడు వచ్చి, గొర్రె పిల్లను ఎత్తుకుని మంద వెంట నడిచాడు. తల్లి గొర్రె వచ్చి బుద్ధుని చుట్టూ తిరిగి ఆయన వెంట పడింది. బుద్ధుడు మందను తోలుకుపోతున్న కాపరులతో - “ఈ మంద ఎక్కడికి?” అని అడిగాడు.............................© 2017,www.logili.com All Rights Reserved.