గ్రీష్మ గోదావరి
నాన్న కొట్టినప్పుడు
ఒక మూల ముడుచుకొని పడుకున్న అమ్మలా వుంటుంది.
ఎండాకాలపు గోదావరి
నీటికొవ్వు కరిగిపోతూ
పలచబడుతున్న జలచర్మంతో
ఎనీమియా పేషెంటులా
ఎంతో జాలి గొలుపుతూంది.
వానాకాలం రౌడీరాణిలా నఖరాలు చేసి
ఇప్పుడు అతి వినయంతో తలొంచుకునిపోతుంది.
గ్రీష్మ గోదావరి పాలిపోయిన దిగులు కళ్ళతో -
నీటి మంచం మీద నిస్త్రాణగా పడివుంది.
నడినెత్తిన సూర్యుడు నిప్పుబాణాల్ని సంధిస్తూ
అస్తమయం వరకు
అదే పనిగా వెంటాడుతుంటాడు.
గోదావరి మెడ వొంపు మీద చెయ్యి పెడితే చాలు.........................
గ్రీష్మ గోదావరి నాన్న కొట్టినప్పుడు ఒక మూల ముడుచుకొని పడుకున్న అమ్మలా వుంటుంది. ఎండాకాలపు గోదావరి నీటికొవ్వు కరిగిపోతూ పలచబడుతున్న జలచర్మంతోఎనీమియా పేషెంటులా ఎంతో జాలి గొలుపుతూంది. వానాకాలం రౌడీరాణిలా నఖరాలు చేసి ఇప్పుడు అతి వినయంతో తలొంచుకునిపోతుంది. గ్రీష్మ గోదావరి పాలిపోయిన దిగులు కళ్ళతో - నీటి మంచం మీద నిస్త్రాణగా పడివుంది. నడినెత్తిన సూర్యుడు నిప్పుబాణాల్ని సంధిస్తూ అస్తమయం వరకు అదే పనిగా వెంటాడుతుంటాడు. గోదావరి మెడ వొంపు మీద చెయ్యి పెడితే చాలు.........................© 2017,www.logili.com All Rights Reserved.