ఉద్యమ 'సారాంశం''
రక్తమొక గమ్మత్తయిన యథార్థం
దీని రచనలో "సంఘర్షణ" ముఖ్య పదార్థం
ఒక్క చుక్క అమృతం కలిపితే చిరాకు
ఒక్క చుక్క సారాపడితే పరాకు
రక్తం రసాయనిక విశ్లేషణ రిజల్టు దీర్ఘకాలిక యుద్ధం! దీర్ఘకాలిక శాంతి!
పట్టెడు అన్నం పట్టుకోగలం రక్తం పావురాలను ఎగరేస్తుంది
గుక్కెడు గంజిని పొందలేని రక్తం ఫిరంగులను పేల్చేస్తుంది
రక్తం పసితనం పాలు
రక్తం యవ్వనం పోరు
రక్తం లక్ష్యం శ్రమజీవుల కధికారం.
దీని నిర్మాణంలో విప్లవం పెద్ద యథార్థం.
ఒక్క చుక్క రక్తం చిందినప్పుడు కాలాంతమై
చుక్క చుక్క రక్తం కలిసినప్పుడు యుగారంభమవుతుంది.
రక్త రూపాన్ని ఎరిగిన పాలకులు
సారాని రక్తంలో పోశారు రక్త సారాన్ని గ్రహించిన పాలకులు
సారాను రక్తం స్థానంలో నిలిపారు.........................
ఉద్యమ 'సారాంశం'' రక్తమొక గమ్మత్తయిన యథార్థం దీని రచనలో "సంఘర్షణ" ముఖ్య పదార్థం ఒక్క చుక్క అమృతం కలిపితే చిరాకు ఒక్క చుక్క సారాపడితే పరాకు రక్తం రసాయనిక విశ్లేషణ రిజల్టు దీర్ఘకాలిక యుద్ధం! దీర్ఘకాలిక శాంతి! పట్టెడు అన్నం పట్టుకోగలం రక్తం పావురాలను ఎగరేస్తుంది గుక్కెడు గంజిని పొందలేని రక్తం ఫిరంగులను పేల్చేస్తుంది రక్తం పసితనం పాలు రక్తం యవ్వనం పోరు రక్తం లక్ష్యం శ్రమజీవుల కధికారం. దీని నిర్మాణంలో విప్లవం పెద్ద యథార్థం. ఒక్క చుక్క రక్తం చిందినప్పుడు కాలాంతమై చుక్క చుక్క రక్తం కలిసినప్పుడు యుగారంభమవుతుంది. రక్త రూపాన్ని ఎరిగిన పాలకులు సారాని రక్తంలో పోశారు రక్త సారాన్ని గ్రహించిన పాలకులు సారాను రక్తం స్థానంలో నిలిపారు.........................© 2017,www.logili.com All Rights Reserved.