యవ్వన స్వప్నము
నీ నేత్రములనుండి నా నేత్రములకు
రూపు లేనట్టి చూపు దారముల
పయినుండి ముత్యాలు ప్రాకివచ్చి, యవి
నా కన్నుల పొరనల్లున్ గద, ప్రియ.
సురలోక ముందో లేదో
మరణించిన పిదప, తెలియ మనకుందరమా!
మరణింపక మున్నే, సురు
ని రకమ్ముగా జేయు నన్ను నీ ముద్దు సఖీ.
దండమును పట్టును కరాన ధరణివిభుడు
బాహువుల మాంత్రికుడు వేము బట్టు; పట్టు
వీరవర్యుండు ఖడ్గము, వీరికన్న
నీ నడుము బట్ట ధన్యుండ నేను సకియ.
పూర్వ జన్మ ఏ వాడిపోవ నున్న
వకు జలంబిడినవో మదీయబాహు
వులివి, ఈనాడు తత్ పుణ్యఫలము పండి కలికి.
నీ మధ్యము బిగింపగలిగి నవహ!.....................
© 2017,www.logili.com All Rights Reserved.