తెలుగు భాషాభోజుడి వెలుగు కథ
- రేగుళ్ళ మల్లికార్జున రావు
----- యమ్ యస్ సి
----- ముఖ్య కార్యనిర్వహణాధికారి,
------- ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి
శ్రీకృష్ణదేవరాయల చరిత్రంతా ప్రజల్లో కథలు, గాథలుగానే వ్యాప్తిలో ఉంది. విజయనగర సామ్రాజ్యాన్ని ఆ కాలపు ప్రపంచ సంపన్న దేశంగా ఆయన తీర్చిదిద్ద గలిగాడన్నది అందరికీ తెలిసినదే! కానీ, అందుకు అనుసరించిన ఆర్థిక క్రమశిక్షణ, సాధించిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమాల మూలాల గురించి పరిశోధనలు ప్రముఖంగా ప్రజల్ని చేరాలంటూ, డా.జి.వి.పూర్ణచందు వెలువరించిన ఆలోచనాత్మక విజయం రాయలనాటి కథలూ గాథలు" ఈ ఆసక్తిదాయకమైన ఎన్నో విషయాలను మన ముందుంచుతోంది.
అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన రాష్ట్రానికి తగిన సమయంలో వెలువడిన తగిన గ్రంథం ఇది. పునర్ మూల్యాంకనం అనేది ఈ కాలపు నవీన విధానం. మన భాషాసంస్కృతుల చరిత్రకు సంబంధించి పునర్ మూల్యాంకనం జాతి ప్రగతికి కొత్త దారులు వేస్తుంది కూడా!
రచయిత డా. పూర్ణచందు తెలుగు భాషోద్యమ ప్రముఖుడు. ప్రసిద్ధ కార్యకర్త కూడా ! ప్రపంచ తెలుగు రచయితలు 6 మహాసభలకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. తెలుగు భాషా సంస్కృతుల మూలాల్ని తవ్వి తీసిన పరిశోధకుడాయన. తెలుగు వారి ఆహారచరిత్రవేత్త కూడా! వివిధ అంశాలపైన 150కి పైగా పుస్తకాలు వెలువరించారు................
తెలుగు భాషాభోజుడి వెలుగు కథ - రేగుళ్ళ మల్లికార్జున రావు ----- యమ్ యస్ సి ----- ముఖ్య కార్యనిర్వహణాధికారి, ------- ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి శ్రీకృష్ణదేవరాయల చరిత్రంతా ప్రజల్లో కథలు, గాథలుగానే వ్యాప్తిలో ఉంది. విజయనగర సామ్రాజ్యాన్ని ఆ కాలపు ప్రపంచ సంపన్న దేశంగా ఆయన తీర్చిదిద్ద గలిగాడన్నది అందరికీ తెలిసినదే! కానీ, అందుకు అనుసరించిన ఆర్థిక క్రమశిక్షణ, సాధించిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమాల మూలాల గురించి పరిశోధనలు ప్రముఖంగా ప్రజల్ని చేరాలంటూ, డా.జి.వి.పూర్ణచందు వెలువరించిన ఆలోచనాత్మక విజయం రాయలనాటి కథలూ గాథలు" ఈ ఆసక్తిదాయకమైన ఎన్నో విషయాలను మన ముందుంచుతోంది. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన రాష్ట్రానికి తగిన సమయంలో వెలువడిన తగిన గ్రంథం ఇది. పునర్ మూల్యాంకనం అనేది ఈ కాలపు నవీన విధానం. మన భాషాసంస్కృతుల చరిత్రకు సంబంధించి పునర్ మూల్యాంకనం జాతి ప్రగతికి కొత్త దారులు వేస్తుంది కూడా! రచయిత డా. పూర్ణచందు తెలుగు భాషోద్యమ ప్రముఖుడు. ప్రసిద్ధ కార్యకర్త కూడా ! ప్రపంచ తెలుగు రచయితలు 6 మహాసభలకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. తెలుగు భాషా సంస్కృతుల మూలాల్ని తవ్వి తీసిన పరిశోధకుడాయన. తెలుగు వారి ఆహారచరిత్రవేత్త కూడా! వివిధ అంశాలపైన 150కి పైగా పుస్తకాలు వెలువరించారు................© 2017,www.logili.com All Rights Reserved.