సౌందర్యలహరి
పదిహేనేళ్ళ కిందటి మాట. అప్పట్లో డా. రఘురామరాజు వడ్డెర చండీదాసు Desire and Liberation మీద పుస్తకం రాస్తున్నారు. ఆ సందర్భంగా desire అనే భావనని అర్ధం చేసుకోవడం కోసం ఆయన ఛాందోగ్య ఉపనిషత్తునీ, ప్లేటో' సింపోజియాన్నీ అధ్యయనం చేస్తో ఉన్నారు. మేము కలుసుకున్నప్పుడల్లా ఆ రెండుగ్రంథాల గురించీ ఎప్పటికప్పుడు కొత్తగా లోతైన ఆలోచనలు పంచుకుంటూ ఉండేవారు. నేను కూడా అప్పటికి ఆ రెండుగ్రంథాలూ చదివి ఉన్నాను కాబట్టి నాకు స్ఫురించిన భావాలు నేను కూడా చెప్తుండేవాణ్ణి. ఆ రెండింటినీ తెలుగు చెయ్యమనీ, ఆ రెండింటితోపాటు చండీదాస్ రచన కూడా తెలుగు చెయ్యగలిగితే, మూడింటినీ కలిపి ఒక పుస్తకంగా తెద్దామనీ అనేవారు.
'సింపోజియం' ప్లేటో రచనలన్నిటిలోనూ అత్యుత్తమరచన. కావ్యత్వాన్ని అందుకున్న రచన. విద్యావంతుడైన ప్రతి ఒక్కడూ చదివితీరవలసిన రచన.
క్రీ.పూ.416 లో ఏథెన్సులో ఆగధాను అనే ఒక యువకుడికి నాటకరచనలో బహుమతి వచ్చిన సందర్భంగా మిత్రులంతా అతణ్ణి అభినందించడానికి కలుసుకుంటారు. ఆ సమావేశానికి సోక్రటీసు కూడా వస్తాడు. ఆ సందర్భంగా ఏదైనా విషయం మీద అందరూ మాట్లాడితే బాగుంటుందని ఎవరో ప్రతిపాదిస్తారు. అప్పుడంతా ప్రేమ గురించి ప్రసంగిస్తారు. ఒకరి వెనక ఒకరు అయిదుగురు వక్తలు ప్రేమ గురించి అద్భుతంగా ప్రసంగించాక సోక్రటీసు వంతు వస్తుంది. ఆయన ఎప్పటిలానే తనకి ప్రేమ గురించి ఏమీ తెలియదని మొదలుపెడతాడుగానీ, తన భాగ్యవశత్తూ డయోటిమ అనే ఒక స్త్రీ ద్వారా ప్రేమజ్ఞానం లభించిందని చెప్తాడు. ఆమె చెప్పినమాటలు వాళ్ళకి చెప్తున్నట్టుగా సోక్రటీసు, సోక్రటీసు ద్వారా ప్లేటో, ప్రేమ గురించి ఒక అజరామర ప్రసంగం చేస్తారు.........................
సౌందర్యలహరి పదిహేనేళ్ళ కిందటి మాట. అప్పట్లో డా. రఘురామరాజు వడ్డెర చండీదాసు Desire and Liberation మీద పుస్తకం రాస్తున్నారు. ఆ సందర్భంగా desire అనే భావనని అర్ధం చేసుకోవడం కోసం ఆయన ఛాందోగ్య ఉపనిషత్తునీ, ప్లేటో' సింపోజియాన్నీ అధ్యయనం చేస్తో ఉన్నారు. మేము కలుసుకున్నప్పుడల్లా ఆ రెండుగ్రంథాల గురించీ ఎప్పటికప్పుడు కొత్తగా లోతైన ఆలోచనలు పంచుకుంటూ ఉండేవారు. నేను కూడా అప్పటికి ఆ రెండుగ్రంథాలూ చదివి ఉన్నాను కాబట్టి నాకు స్ఫురించిన భావాలు నేను కూడా చెప్తుండేవాణ్ణి. ఆ రెండింటినీ తెలుగు చెయ్యమనీ, ఆ రెండింటితోపాటు చండీదాస్ రచన కూడా తెలుగు చెయ్యగలిగితే, మూడింటినీ కలిపి ఒక పుస్తకంగా తెద్దామనీ అనేవారు. 'సింపోజియం' ప్లేటో రచనలన్నిటిలోనూ అత్యుత్తమరచన. కావ్యత్వాన్ని అందుకున్న రచన. విద్యావంతుడైన ప్రతి ఒక్కడూ చదివితీరవలసిన రచన. క్రీ.పూ.416 లో ఏథెన్సులో ఆగధాను అనే ఒక యువకుడికి నాటకరచనలో బహుమతి వచ్చిన సందర్భంగా మిత్రులంతా అతణ్ణి అభినందించడానికి కలుసుకుంటారు. ఆ సమావేశానికి సోక్రటీసు కూడా వస్తాడు. ఆ సందర్భంగా ఏదైనా విషయం మీద అందరూ మాట్లాడితే బాగుంటుందని ఎవరో ప్రతిపాదిస్తారు. అప్పుడంతా ప్రేమ గురించి ప్రసంగిస్తారు. ఒకరి వెనక ఒకరు అయిదుగురు వక్తలు ప్రేమ గురించి అద్భుతంగా ప్రసంగించాక సోక్రటీసు వంతు వస్తుంది. ఆయన ఎప్పటిలానే తనకి ప్రేమ గురించి ఏమీ తెలియదని మొదలుపెడతాడుగానీ, తన భాగ్యవశత్తూ డయోటిమ అనే ఒక స్త్రీ ద్వారా ప్రేమజ్ఞానం లభించిందని చెప్తాడు. ఆమె చెప్పినమాటలు వాళ్ళకి చెప్తున్నట్టుగా సోక్రటీసు, సోక్రటీసు ద్వారా ప్లేటో, ప్రేమ గురించి ఒక అజరామర ప్రసంగం చేస్తారు.........................© 2017,www.logili.com All Rights Reserved.