ఐతిహాసిక బృందగానం
నిన్న సాయంకాలం రాజిరెడ్డి ఫోను చేసి ఈ ఏడాది నోబెలు ప్రైజు ఒక రష్యను రచయితకి ఇచ్చారని చెప్తూ ఆమె గురించి మీరేమైనా రాయగలరా అనడిగాడు. ఆమె పేరు కూడా చెప్పాడు గాని, ఫోన్లో వినబడలేదు. నేనామె పేరెప్పుడూ వినలేదనీ, ఆమె రచనల గురించేమీ తెలియదనీ సదాశివరావుగారిని గానీ, ముకుందరామారావుగారిని గానీ అడగమని చెప్పాను.
సరిగ్గా ఈ అజ్ఞానం మీదనే స్వెత్లానా అలెర్జీవిచ్ గత పాతికేళ్ళకు పైగా పోరాటం చేస్తూ ఉన్నారని ఇప్పుడర్థమయింది నాకు.
ఆమె గురించి తెలుసుకుంటున్న కొద్దీ, ఇప్పటి కాలంలో రచయితలు తమ మానవత్వాన్ని ప్రకటించడానికీ, తోటి మనిషికి బాసటగా నిలబడటానికీ ఎటువంటి కొత్త దారులు అన్వేషిస్తున్నారో, ఎటువంటి నిర్విరామ ప్రయత్నాలు చేస్తున్నారో స్వెత్లానా ఒక గొప్ప ఉదాహరణ అనీ, ఆమె రచనలకు నోబెలు బహుమతి ప్రకటించడం, సాహిత్య ప్రక్రియలంటూ ప్రత్యేకంగా ఉంటాయనుకునే ఒక మనస్తత్వానికీ, అలవాటుకీ పెద్ద కుదుపు అని అర్థమయింది నాకు.
'గొప్ప చారిత్రిక సమాచారాన్ని ఆమె మనకొక కొత్త ప్రక్రియగా అందించారు' అని ప్రస్తుతించింది స్వీడిషు అకాడెమీ 2015 కు సాహిత్య పురస్కారాన్ని ఆమెకు ప్రకటిస్తూ............................
ఐతిహాసిక బృందగానం నిన్న సాయంకాలం రాజిరెడ్డి ఫోను చేసి ఈ ఏడాది నోబెలు ప్రైజు ఒక రష్యను రచయితకి ఇచ్చారని చెప్తూ ఆమె గురించి మీరేమైనా రాయగలరా అనడిగాడు. ఆమె పేరు కూడా చెప్పాడు గాని, ఫోన్లో వినబడలేదు. నేనామె పేరెప్పుడూ వినలేదనీ, ఆమె రచనల గురించేమీ తెలియదనీ సదాశివరావుగారిని గానీ, ముకుందరామారావుగారిని గానీ అడగమని చెప్పాను. సరిగ్గా ఈ అజ్ఞానం మీదనే స్వెత్లానా అలెర్జీవిచ్ గత పాతికేళ్ళకు పైగా పోరాటం చేస్తూ ఉన్నారని ఇప్పుడర్థమయింది నాకు. ఆమె గురించి తెలుసుకుంటున్న కొద్దీ, ఇప్పటి కాలంలో రచయితలు తమ మానవత్వాన్ని ప్రకటించడానికీ, తోటి మనిషికి బాసటగా నిలబడటానికీ ఎటువంటి కొత్త దారులు అన్వేషిస్తున్నారో, ఎటువంటి నిర్విరామ ప్రయత్నాలు చేస్తున్నారో స్వెత్లానా ఒక గొప్ప ఉదాహరణ అనీ, ఆమె రచనలకు నోబెలు బహుమతి ప్రకటించడం, సాహిత్య ప్రక్రియలంటూ ప్రత్యేకంగా ఉంటాయనుకునే ఒక మనస్తత్వానికీ, అలవాటుకీ పెద్ద కుదుపు అని అర్థమయింది నాకు. 'గొప్ప చారిత్రిక సమాచారాన్ని ఆమె మనకొక కొత్త ప్రక్రియగా అందించారు' అని ప్రస్తుతించింది స్వీడిషు అకాడెమీ 2015 కు సాహిత్య పురస్కారాన్ని ఆమెకు ప్రకటిస్తూ............................© 2017,www.logili.com All Rights Reserved.