ప్రాచీనకాలంలో కథ
ప్రాచీనకాలంలో కథ ఎప్పుడు పుట్టి ఉంటుంది?
కఠినమైన ప్రశ్న.
మనం హోమోసెపియన్సుగా పిలుచుకునే ప్రస్తుత మానవజాతి రెండులక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికాలో తలెత్తింది. 1,70,000 సంవత్సరాల కిందట మనుషులు దుస్తులు ధరించడం మొదలుపెట్టారు. 82 వేల సంవత్సరాల కిందట సముద్రపు గవ్వలతో ఆభరణాలు ధరించినట్టు ఆధారాలు దొరుకుతున్నాయి.
77 వేల సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికా గుహల్లో గీసిన చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. 40 వేల సంవత్సరాల కిందట స్పెయినులోని ఆల్టోమీరా గుహల్లో చిత్రించిన ఆదిమగుహాచిత్రాల్లో జంతువులతో పాటు, మనిషి బొమ్మలు కూడా దర్శనమిస్తున్నాయి.
భారతదేశంలో మధ్యప్రదేశ్లో వింధ్య పర్వతశ్రేణిలోని భీమ్బట్క గుహలు పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు ఎనిమిదివందల శిలాశ్రయాలతో 500 పైగా చిత్రలేఖనాల తో అతి పెద్ద ప్రాచీనమానవ నివాససముదాయంగా నిలబడుతున్నాయి. 40 వేల సంవత్సరాల నుంచి మానవుడి ఆలోచనలో ప్రపంచాన్ని గుర్తించి, తిరిగి దాన్ని తనకోసం తాను చిత్రించుకునే క్రమంలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నదని మనం అంగీకరిస్తే, క్రీ.పూ. 3,300 నాటికి సుమేరియన్లు రాయటం మొదలుపెట్టినదాకా దాదాపు 30-40 సహస్రాబ్దాల పాటు మానవుడు ఎటువంటి కథలు చెప్పుకునిఉంటాడు?
కొత్తరాతియుగానికీ, కాంస్యయుగానికీ మధ్యకాలంలో మనిషి రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి మానవచరిత్రలో చారిత్రకయుగం మొదలయ్యిందని మనం చెప్పుకుంటున్నాం. అంతకుపూర్వం ఉన్నదంతా చరిత్ర పూర్వ.............................
ప్రాచీనకాలంలో కథ ప్రాచీనకాలంలో కథ ఎప్పుడు పుట్టి ఉంటుంది? కఠినమైన ప్రశ్న. మనం హోమోసెపియన్సుగా పిలుచుకునే ప్రస్తుత మానవజాతి రెండులక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికాలో తలెత్తింది. 1,70,000 సంవత్సరాల కిందట మనుషులు దుస్తులు ధరించడం మొదలుపెట్టారు. 82 వేల సంవత్సరాల కిందట సముద్రపు గవ్వలతో ఆభరణాలు ధరించినట్టు ఆధారాలు దొరుకుతున్నాయి. 77 వేల సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికా గుహల్లో గీసిన చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. 40 వేల సంవత్సరాల కిందట స్పెయినులోని ఆల్టోమీరా గుహల్లో చిత్రించిన ఆదిమగుహాచిత్రాల్లో జంతువులతో పాటు, మనిషి బొమ్మలు కూడా దర్శనమిస్తున్నాయి. భారతదేశంలో మధ్యప్రదేశ్లో వింధ్య పర్వతశ్రేణిలోని భీమ్బట్క గుహలు పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు ఎనిమిదివందల శిలాశ్రయాలతో 500 పైగా చిత్రలేఖనాల తో అతి పెద్ద ప్రాచీనమానవ నివాససముదాయంగా నిలబడుతున్నాయి. 40 వేల సంవత్సరాల నుంచి మానవుడి ఆలోచనలో ప్రపంచాన్ని గుర్తించి, తిరిగి దాన్ని తనకోసం తాను చిత్రించుకునే క్రమంలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నదని మనం అంగీకరిస్తే, క్రీ.పూ. 3,300 నాటికి సుమేరియన్లు రాయటం మొదలుపెట్టినదాకా దాదాపు 30-40 సహస్రాబ్దాల పాటు మానవుడు ఎటువంటి కథలు చెప్పుకునిఉంటాడు? కొత్తరాతియుగానికీ, కాంస్యయుగానికీ మధ్యకాలంలో మనిషి రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి మానవచరిత్రలో చారిత్రకయుగం మొదలయ్యిందని మనం చెప్పుకుంటున్నాం. అంతకుపూర్వం ఉన్నదంతా చరిత్ర పూర్వ.............................© 2017,www.logili.com All Rights Reserved.