Panchama Vedam Dharma Sutralu

By Sridhar Potaraju (Author)
Rs.90
Rs.90

Panchama Vedam Dharma Sutralu
INR
MANIMN7181
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మానవ జీవితాన్ని వ్యక్తిగతంగా, సామాజికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన మార్గంలో నడిపించేదే ధర్మము. కనుకనే మన మహర్షులు పురుషార్థ చతుష్టయంలో ధర్మానికి మొట్టమొదటి స్థానాన్ని కల్పించారు. అర్థకామాలు ధర్మాన్ని . అనుసరించినప్పుడే మోక్షం అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు మహాభారతంలోని కొన్ని సందర్భాలను అనుసరించి ధర్మం యొక్క స్వరూపాన్ని పరిశీలిద్దాం. కపట ద్యూతంలో పాండవుల పరాజయం

ధృతరాష్ట్రుడు జూదమాడడానికి హస్తినకు రమ్మని పాండవులను ఆహ్వానించాడు. పాండవులు ధృతరాష్ట్రుని ఆహ్వానాన్ని అంగీకరించి హస్తినా పురానికి వచ్చారు. దుర్యోధనుడు తన పక్షాన జూదమాడమని మేనమామయైన శకునిని నియోగించాడు. శకుని మాయాద్యూతంతో ధర్మరాజుని ఓడించి, మరింత పందెం వేయమని ప్రేరేపించాడు. ఆ ద్యూతక్రీడలో పాండవులు తమ రాజ్యంతో సహా సర్వస్వాన్ని కోల్పోతారు. ధర్మరాజు ద్యూతాన్ని కొనసాగిస్తూ తన సోదరులను, తనను కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. చివరకు శకుని ప్రేరణతో తన భార్య యైన ద్రౌపదిని కూడా పణంగాపెట్టి ఓడిపోయాడు.

దుర్యోధనుని దురాలోచన: దుర్యోధనుడు తన సేవకుని పిలిచి ద్రౌపదిని సభకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ సేవకుడు ద్రౌపది భవనానికి వెళ్లి, ధర్మరాజు ద్యూతంలో ఆమెను పణంగాపెట్టి ఓడిపోయిన విషయాన్ని చెబుతాడు. ఆమెను సభా భవనానికి తీసుకొని రమ్మని దుర్యోధనుడు ఆజ్ఞాపించిన విషయాన్ని కూడా తెలియజేసాడు. అది విని ద్రౌపది, ధర్మరాజు మొదట తాను స్వాతంత్ర్యం కోల్పోయాడా, లేక ఆమెను ముందుగా కోల్పోయాడా అని తెలుసుకొని రమ్మంటుంది. సేవకుడు రాజసభకు వెళ్లి ఈ విషయాన్ని దుర్యోధనునికి విన్నవిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఆమెను సభలోనికి బలవంతంగానైనా తీసుకొని రమ్మని తన.....................

మానవ జీవితాన్ని వ్యక్తిగతంగా, సామాజికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన మార్గంలో నడిపించేదే ధర్మము. కనుకనే మన మహర్షులు పురుషార్థ చతుష్టయంలో ధర్మానికి మొట్టమొదటి స్థానాన్ని కల్పించారు. అర్థకామాలు ధర్మాన్ని . అనుసరించినప్పుడే మోక్షం అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు మహాభారతంలోని కొన్ని సందర్భాలను అనుసరించి ధర్మం యొక్క స్వరూపాన్ని పరిశీలిద్దాం. కపట ద్యూతంలో పాండవుల పరాజయం ధృతరాష్ట్రుడు జూదమాడడానికి హస్తినకు రమ్మని పాండవులను ఆహ్వానించాడు. పాండవులు ధృతరాష్ట్రుని ఆహ్వానాన్ని అంగీకరించి హస్తినా పురానికి వచ్చారు. దుర్యోధనుడు తన పక్షాన జూదమాడమని మేనమామయైన శకునిని నియోగించాడు. శకుని మాయాద్యూతంతో ధర్మరాజుని ఓడించి, మరింత పందెం వేయమని ప్రేరేపించాడు. ఆ ద్యూతక్రీడలో పాండవులు తమ రాజ్యంతో సహా సర్వస్వాన్ని కోల్పోతారు. ధర్మరాజు ద్యూతాన్ని కొనసాగిస్తూ తన సోదరులను, తనను కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. చివరకు శకుని ప్రేరణతో తన భార్య యైన ద్రౌపదిని కూడా పణంగాపెట్టి ఓడిపోయాడు. దుర్యోధనుని దురాలోచన: దుర్యోధనుడు తన సేవకుని పిలిచి ద్రౌపదిని సభకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ సేవకుడు ద్రౌపది భవనానికి వెళ్లి, ధర్మరాజు ద్యూతంలో ఆమెను పణంగాపెట్టి ఓడిపోయిన విషయాన్ని చెబుతాడు. ఆమెను సభా భవనానికి తీసుకొని రమ్మని దుర్యోధనుడు ఆజ్ఞాపించిన విషయాన్ని కూడా తెలియజేసాడు. అది విని ద్రౌపది, ధర్మరాజు మొదట తాను స్వాతంత్ర్యం కోల్పోయాడా, లేక ఆమెను ముందుగా కోల్పోయాడా అని తెలుసుకొని రమ్మంటుంది. సేవకుడు రాజసభకు వెళ్లి ఈ విషయాన్ని దుర్యోధనునికి విన్నవిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఆమెను సభలోనికి బలవంతంగానైనా తీసుకొని రమ్మని తన.....................

Features

  • : Panchama Vedam Dharma Sutralu
  • : Sridhar Potaraju
  • : Emasco Books pvt.L.td.
  • : MANIMN7181
  • : paparback
  • : Aug, 2026
  • : 60
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Panchama Vedam Dharma Sutralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam