1946-51 మధ్యకాలంలో సాగిన తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం భారతదేశ విప్లవోద్యమాల చరిత్రలోనే గాక ప్రపంచ విప్లవాల చరిత్ర పుటల్లో కూడా ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకొన్నది. తెలంగాణలోని లక్షలాది ప్రజలు తమ అశేష త్యాగాలతో, ముఖ్యంగా నాలుగువేల మంది అమర వీరులు దోపిడి, పీడనలేని ఒక మహోన్నత నూతన సమాజం కోసం తమ రక్తంతో లిఖించిన అరుణారుణ చరిత్ర అది.
ఆ మహోజ్వలమైన చరిత్రకు, విప్లవాలఖిల్లా నల్లగొండ జిల్లా లోని సూర్యాపేట ప్రాంతంలో తొలి బీజాలు పడ్డాయి. భారత కమ్యూనిస్టు విప్లవోద్యమం నుండి ఉ ద్భవించిన అత్యుత్తమ విప్లవ కమ్యూనిస్టు నాయకుడు కా॥ దేవులపల్లి వెంకటేశ్వరరావు స్వంత గ్రామం అదే తాలూకాలోని బండమీద చందుపట్ల. అయితే, ఆయన పుట్టింది మాత్రం వరంగల్ జిల్లాలోని మానుకోట పట్టణానికి సమీపానవున్న వారి అమ్మమ్మ గారి గ్రామమయిన ఇనుగుర్తిలో. ఆయన 1917వ సంవత్సరం జూన్ 1వ తేదీన జన్మించాడు. తండ్రి దేవులపల్లి వరదరావు గారు. తల్లి దేవులపల్లి గోపమ్మ. కా॥డి. వి తండ్రి ఒక దేశముఖ్. డి.వి గారి చిన్నతనంలోనే ఆయన చనిపోయాడు.
నిజాం రాజు పరిపాలనలో, ఆనాటి సంస్థానంలోని పేదలకేకాదు, రైతాంగ కుటుంబాల్లోని పిల్లలకు కూడా విద్య అంతగా అందుబాటులో లేదు. పెద్ద గ్రామాలలో మాత్రమే పాఠశాలలుండేవి. అదీ చాలాచోట్ల 5వ తరగతి వరకు మాత్రమే! రైతుల పిల్లలు పాఠశాలకు వెళ్లినాకూడా, తమ గ్రామంలోని పాఠశాలలో ఉన్నంతవరకే తమ చదువును కొనసాగించి అంతటితోనే మానివేసేవారు. నల్లగొండ జిల్లా మొత్తంలో కూడా ఒక్క కాలేజి కూడా లేదంటే, ఆనాటి విద్యారంగం పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేదో అర్థమవుతుంది.
బాల్యం విద్య
డి.వి తన ప్రాథమిక విద్యను పక్క గ్రామాలైన నామవరం, తిరుమలగిరి గ్రామాల్లో పూర్తిచేశారు. 6, 7 తరగతులను సూర్యాపేట పట్టణంలోని పాఠశాలలో కొనసాగించారు. ఆ చిన్న వయస్సులోనే సాహిత్యం, సంగీతం పట్ల ఆయన అపారమైన................
భారత విప్లవ పంథా నిర్మాత బాల్యం-విద్య-వివాహం 1946-51 మధ్యకాలంలో సాగిన తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం భారతదేశ విప్లవోద్యమాల చరిత్రలోనే గాక ప్రపంచ విప్లవాల చరిత్ర పుటల్లో కూడా ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకొన్నది. తెలంగాణలోని లక్షలాది ప్రజలు తమ అశేష త్యాగాలతో, ముఖ్యంగా నాలుగువేల మంది అమర వీరులు దోపిడి, పీడనలేని ఒక మహోన్నత నూతన సమాజం కోసం తమ రక్తంతో లిఖించిన అరుణారుణ చరిత్ర అది. ఆ మహోజ్వలమైన చరిత్రకు, విప్లవాలఖిల్లా నల్లగొండ జిల్లా లోని సూర్యాపేట ప్రాంతంలో తొలి బీజాలు పడ్డాయి. భారత కమ్యూనిస్టు విప్లవోద్యమం నుండి ఉ ద్భవించిన అత్యుత్తమ విప్లవ కమ్యూనిస్టు నాయకుడు కా॥ దేవులపల్లి వెంకటేశ్వరరావు స్వంత గ్రామం అదే తాలూకాలోని బండమీద చందుపట్ల. అయితే, ఆయన పుట్టింది మాత్రం వరంగల్ జిల్లాలోని మానుకోట పట్టణానికి సమీపానవున్న వారి అమ్మమ్మ గారి గ్రామమయిన ఇనుగుర్తిలో. ఆయన 1917వ సంవత్సరం జూన్ 1వ తేదీన జన్మించాడు. తండ్రి దేవులపల్లి వరదరావు గారు. తల్లి దేవులపల్లి గోపమ్మ. కా॥డి. వి తండ్రి ఒక దేశముఖ్. డి.వి గారి చిన్నతనంలోనే ఆయన చనిపోయాడు. నిజాం రాజు పరిపాలనలో, ఆనాటి సంస్థానంలోని పేదలకేకాదు, రైతాంగ కుటుంబాల్లోని పిల్లలకు కూడా విద్య అంతగా అందుబాటులో లేదు. పెద్ద గ్రామాలలో మాత్రమే పాఠశాలలుండేవి. అదీ చాలాచోట్ల 5వ తరగతి వరకు మాత్రమే! రైతుల పిల్లలు పాఠశాలకు వెళ్లినాకూడా, తమ గ్రామంలోని పాఠశాలలో ఉన్నంతవరకే తమ చదువును కొనసాగించి అంతటితోనే మానివేసేవారు. నల్లగొండ జిల్లా మొత్తంలో కూడా ఒక్క కాలేజి కూడా లేదంటే, ఆనాటి విద్యారంగం పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేదో అర్థమవుతుంది. బాల్యం విద్య డి.వి తన ప్రాథమిక విద్యను పక్క గ్రామాలైన నామవరం, తిరుమలగిరి గ్రామాల్లో పూర్తిచేశారు. 6, 7 తరగతులను సూర్యాపేట పట్టణంలోని పాఠశాలలో కొనసాగించారు. ఆ చిన్న వయస్సులోనే సాహిత్యం, సంగీతం పట్ల ఆయన అపారమైన................© 2017,www.logili.com All Rights Reserved.