Videshiyatrikulu Andinchina Mana Charitra

By T Venkatrao (Author)
Rs.130
Rs.130

Videshiyatrikulu Andinchina Mana Charitra
INR
NAVACHE003
Out Of Stock
130.0
Rs.130
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంనుండి క్రీస్తుశకం 18వ శతాబ్దం వరకూ ఆ 2200 సంవత్సరాల కాలంలో మన భారత ఉపఖండాన్ని దర్శించిన 35 మంది ప్రముఖుల గురించీ, వారు వివరించిన ఆనాటి మన పరిస్థితులను గురించీ ఇందులో తెలియజేయడం జరిగింది. ఆ యాత్రీకులు గ్రీస్, చైనా, పర్షియా, అరబ్, రష్యా, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ మొదలైన దేశాలవారు. అందులో సాహసయాత్రీకులూ, యుద్ధవీరులు, రాయబారులూ, వర్తకులూ, తాత్వికులూ, మతబోధకులూ, చరిత్రకారులూ, అన్వేషకులూ ఉన్నారు. ఆనాడు వారు ఇక్కడ చూసిన వింతలూ విడ్డూరాలు ఎన్నో ఉన్నాయి.

                  వారు మెచ్చుకున్నవీ, నొచ్చుకున్నవీ, పొగిడినవీ, నిర్ఘాంతపోయినవీ, నిట్టూర్చినవీ ఎన్నో అంశాలున్నాయి. ఈనాటి భారతీయులకు తెలియని విశేషాలూ ఉన్నాయి. ఈ పుస్తకం నిన్నటి భారతావనిని తెలుసుకోవాలనే పాఠకులకూ, చరిత్ర విద్యార్థులకూ, చరిత్ర మాష్టారులకూ చాలా వివరాలను అందిస్తుంది.

                 భారతదేశపు అలనాటి రంగుల కలనేత చిత్రాన్ని, రాజకీయ విధానాలను, సామాజిక కట్టుబాట్లను, తత్వాన్వేషణ చమక్కులను, సంస్కృతిలోని వెలుగు నీడలను తెలుసుకోవాలనుకునేవారు ఈ అక్షర భారతాన్ని విదేశీ యాత్రీకులు ఆనాడు చూసిన ఈ దేశపు నిమ్నోన్నతాలను ఈ పుస్తకంలో దర్శించగలరు. ఇలాంటి పుస్తకం, అంతమంది యాత్రీకుల కథనాలు అందించిన గ్రంథం తెలుగులో ఇంతవరకూ లేదు. తొలిసారి ప్రయత్నించిన రచయితను అభినందిద్దాం.

                             - ప్రచురణకర్తలు

             క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంనుండి క్రీస్తుశకం 18వ శతాబ్దం వరకూ ఆ 2200 సంవత్సరాల కాలంలో మన భారత ఉపఖండాన్ని దర్శించిన 35 మంది ప్రముఖుల గురించీ, వారు వివరించిన ఆనాటి మన పరిస్థితులను గురించీ ఇందులో తెలియజేయడం జరిగింది. ఆ యాత్రీకులు గ్రీస్, చైనా, పర్షియా, అరబ్, రష్యా, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ మొదలైన దేశాలవారు. అందులో సాహసయాత్రీకులూ, యుద్ధవీరులు, రాయబారులూ, వర్తకులూ, తాత్వికులూ, మతబోధకులూ, చరిత్రకారులూ, అన్వేషకులూ ఉన్నారు. ఆనాడు వారు ఇక్కడ చూసిన వింతలూ విడ్డూరాలు ఎన్నో ఉన్నాయి.                   వారు మెచ్చుకున్నవీ, నొచ్చుకున్నవీ, పొగిడినవీ, నిర్ఘాంతపోయినవీ, నిట్టూర్చినవీ ఎన్నో అంశాలున్నాయి. ఈనాటి భారతీయులకు తెలియని విశేషాలూ ఉన్నాయి. ఈ పుస్తకం నిన్నటి భారతావనిని తెలుసుకోవాలనే పాఠకులకూ, చరిత్ర విద్యార్థులకూ, చరిత్ర మాష్టారులకూ చాలా వివరాలను అందిస్తుంది.                  భారతదేశపు అలనాటి రంగుల కలనేత చిత్రాన్ని, రాజకీయ విధానాలను, సామాజిక కట్టుబాట్లను, తత్వాన్వేషణ చమక్కులను, సంస్కృతిలోని వెలుగు నీడలను తెలుసుకోవాలనుకునేవారు ఈ అక్షర భారతాన్ని విదేశీ యాత్రీకులు ఆనాడు చూసిన ఈ దేశపు నిమ్నోన్నతాలను ఈ పుస్తకంలో దర్శించగలరు. ఇలాంటి పుస్తకం, అంతమంది యాత్రీకుల కథనాలు అందించిన గ్రంథం తెలుగులో ఇంతవరకూ లేదు. తొలిసారి ప్రయత్నించిన రచయితను అభినందిద్దాం.                              - ప్రచురణకర్తలు

Features

  • : Videshiyatrikulu Andinchina Mana Charitra
  • : T Venkatrao
  • : Navachetana Publishing House
  • : NAVACHE003
  • : Paperback
  • : 2016
  • : 190
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Videshiyatrikulu Andinchina Mana Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam