Harappa ( Mana Puranalalo Harappa Charitra)

By Sai Papineni (Author)
Rs.299
Rs.299

Harappa ( Mana Puranalalo Harappa Charitra)
INR
MANIMN7178
In Stock
299.0
Rs.299


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ముందుమాట - కాలనిర్ణయంలో గందరగోళం

నేడు చరిత్రకారుల్లో రెండు పరస్పర భిన్నమైన సంప్రదాయక దృక్పథాలు ఘనీభవించి కనిపిస్తాయి. అవి AIT (Aryan Invasion Theory), OIT (Out of India Theory) అనే కోణాలు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ప్రకారం ఆర్యుల వలసలు క్రీ.పూ. 2వ సహస్రాబ్దిలో అంటే హరప్పా నాగరికత పతనానంతరం జరిగినవని, అంతకు పూర్వం భారత ఉపఖండంలో ఇండో యూరోపియన్ భాషల వాడుకలేదని, అంతేగాక హరప్పా నాగరికత ఆర్యేతర (Non- Indo-European) భాషలు మాట్లాడే మూలవాసులదని, ఆ మూలవాసులు ద్రావిడులు అంటే ద్రవిడ భాషలు మాట్లాడేవారని చెప్తుంది.

ద్రవిడ అనేది సంస్కృతపదమైనా అది తమిళానికి పర్యాయపదమైపోయింది కనుక దానిని కొందరు భుజానికెత్తుకున్నారు.

ఇక రెండవ కోణం OIT. ఇది 'జనని సంస్కృతం బెల్ల భాషలకు' అనే మూలాల నుంచి మొదలై, నాగరికతకి, వేదాలే మూలం అనే హిందూ అస్తిత్వవాదానికి పునాది అయింది. వీరి కాలమానం వేరు. దానికి ఆది లేదు, వారి వాదనకి అంతంలేదు. అంతేగాక వీలైతే అవాస్తవాలను శాస్త్రీయంగా పరిశీలించిన ఆధారాలుగా ప్రచారం చేయడం కూడా కద్దు.

కంటికెదురుగా కనిపించే ఆధారాలను వారివారి దృక్కోణాలకు అనుగుణంగా మలుచుకోవడం, * ఇబ్బందికరమైతే విస్మరించడం రెండు సంప్రదాయాల్లో మామూలైపోయింది.

చారిత్రక సంప్రదాయం

భారతీయ పురాచరిత్ర కాలమానంపై నేడు నడుస్తున్న ఈ వివాదాలకూ విభేదాలకూ కొన్ని మౌలికమైన కారణాలున్నాయి.

చారిత్రక భాషాశాస్త్రం సూచించిన తేదీల ఆధారంగా సాంప్రదాయక చరిత్రకి ప్రతిపాదించిన తేదీలతో తొలిభారతీయ నాగరికతను ఏమాత్రమూ వివరించలేము. వాఙ్మయంలోని అద్భుత వర్ణనలు, జ్యోతిష ఖగోళ వృత్తాంతాల ఆధారంగా చేస్తున్న ప్రతిపాదనలు వైజ్ఞానికంగా చేసే విశ్లేషణలకు నిలబడవు.....................

ముందుమాట - కాలనిర్ణయంలో గందరగోళం నేడు చరిత్రకారుల్లో రెండు పరస్పర భిన్నమైన సంప్రదాయక దృక్పథాలు ఘనీభవించి కనిపిస్తాయి. అవి AIT (Aryan Invasion Theory), OIT (Out of India Theory) అనే కోణాలు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ప్రకారం ఆర్యుల వలసలు క్రీ.పూ. 2వ సహస్రాబ్దిలో అంటే హరప్పా నాగరికత పతనానంతరం జరిగినవని, అంతకు పూర్వం భారత ఉపఖండంలో ఇండో యూరోపియన్ భాషల వాడుకలేదని, అంతేగాక హరప్పా నాగరికత ఆర్యేతర (Non- Indo-European) భాషలు మాట్లాడే మూలవాసులదని, ఆ మూలవాసులు ద్రావిడులు అంటే ద్రవిడ భాషలు మాట్లాడేవారని చెప్తుంది. ద్రవిడ అనేది సంస్కృతపదమైనా అది తమిళానికి పర్యాయపదమైపోయింది కనుక దానిని కొందరు భుజానికెత్తుకున్నారు. ఇక రెండవ కోణం OIT. ఇది 'జనని సంస్కృతం బెల్ల భాషలకు' అనే మూలాల నుంచి మొదలై, నాగరికతకి, వేదాలే మూలం అనే హిందూ అస్తిత్వవాదానికి పునాది అయింది. వీరి కాలమానం వేరు. దానికి ఆది లేదు, వారి వాదనకి అంతంలేదు. అంతేగాక వీలైతే అవాస్తవాలను శాస్త్రీయంగా పరిశీలించిన ఆధారాలుగా ప్రచారం చేయడం కూడా కద్దు. కంటికెదురుగా కనిపించే ఆధారాలను వారివారి దృక్కోణాలకు అనుగుణంగా మలుచుకోవడం, * ఇబ్బందికరమైతే విస్మరించడం రెండు సంప్రదాయాల్లో మామూలైపోయింది. చారిత్రక సంప్రదాయం భారతీయ పురాచరిత్ర కాలమానంపై నేడు నడుస్తున్న ఈ వివాదాలకూ విభేదాలకూ కొన్ని మౌలికమైన కారణాలున్నాయి. చారిత్రక భాషాశాస్త్రం సూచించిన తేదీల ఆధారంగా సాంప్రదాయక చరిత్రకి ప్రతిపాదించిన తేదీలతో తొలిభారతీయ నాగరికతను ఏమాత్రమూ వివరించలేము. వాఙ్మయంలోని అద్భుత వర్ణనలు, జ్యోతిష ఖగోళ వృత్తాంతాల ఆధారంగా చేస్తున్న ప్రతిపాదనలు వైజ్ఞానికంగా చేసే విశ్లేషణలకు నిలబడవు.....................

Features

  • : Harappa ( Mana Puranalalo Harappa Charitra)
  • : Sai Papineni
  • : Aju Publications
  • : MANIMN7178
  • : paparback
  • : 2026
  • : 163
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Harappa ( Mana Puranalalo Harappa Charitra)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam