ఆదిమ మానవుడు
ఆర్యుల రాకతో భారతదేశ చరిత్ర ప్రారంభమైందనే మాటకు ఏనాడో కాలదోషం పట్టింది.
క్రీస్తు పూర్వం రెండువేల సంవత్సరాల ప్రాంతంలో ఆర్యుల భారతదేశ యాత్ర ప్రారంభమైంది. అంతకుముందు సంగతేమిటి?
వానర రూపం నుండి మానవాకారం రూపుగట్టి 50వేల సంవత్సరాలకు పైబడిందని శాస్త్రజ్ఞుల అంచనా. ఈ మధ్యకాలంలో భారతదేశంలో నరసంచారమే లేదా? నాగరికతే లేదా?
ప్రాచీన శిలాయుగ అవశేషాలు ఉత్తర హిందూదేశంలోకంటే దక్షిణ హిందూదేశంలో ఎక్కువగా లభిస్తున్నాయి. పశ్చిమ భారతంలో కంటే, తూర్పు దక్షిణ భారతాలలో ఎక్కువగా వున్నాయి.
మధుర, తిరుచిరాపల్లి, ఆర్కాటు, చెంగల్పట్ జిల్లాలలోను, చిత్తూరు, కడప, బళ్ళారి, నెల్లూరు, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలలోను ఈ అవశేషాలున్నాయి.
తీర ప్రాంత జిల్లాలలో కంటే పీఠభూమి జిల్లాలలో ఇవి హెచ్చుగా కనిపిస్తున్నాయి. గంగానది ప్రాంతంలో ఇవి అసలే కనిపించటం లేదు.
శిలాయుగంలో ప్రాచీన మానవుడు పీఠభూములలోనే సంచరించినట్లు ఇవి. దాఖలాలు. ఆదిమ మానవుడు భరత ఖండానికి సంబంధించినంత వరకు దక్షిణ హిందూ దేశంలో ఆవిర్భవించి వుంటాడని, పంజాబ్ దిశగా పయనించి వుంటాడని చరిత్రకారుల ఊహ. నదీలోయల్లో వ్యవసాయ నాగరికత వికసించినట్టే, పీఠభూములలో, శిలాయుగపు ఆదిమ మానవుడు ఆవిర్భవించి వుంటాడు.
ఆస్ట్రేలియా, ఇండోనీషియా, ఆఫ్రికాలలోనూ, పంజాబ్లోని శివాలిక్ కొండలలోనూ ప్రాచీన మానవుని అస్థికంకాళాలు దొరికాయి.
ఆదిమ మానవుడు ఆర్యుల రాకతో భారతదేశ చరిత్ర ప్రారంభమైందనే మాటకు ఏనాడో కాలదోషం పట్టింది. క్రీస్తు పూర్వం రెండువేల సంవత్సరాల ప్రాంతంలో ఆర్యుల భారతదేశ యాత్ర ప్రారంభమైంది. అంతకుముందు సంగతేమిటి? వానర రూపం నుండి మానవాకారం రూపుగట్టి 50వేల సంవత్సరాలకు పైబడిందని శాస్త్రజ్ఞుల అంచనా. ఈ మధ్యకాలంలో భారతదేశంలో నరసంచారమే లేదా? నాగరికతే లేదా? ప్రాచీన శిలాయుగ అవశేషాలు ఉత్తర హిందూదేశంలోకంటే దక్షిణ హిందూదేశంలో ఎక్కువగా లభిస్తున్నాయి. పశ్చిమ భారతంలో కంటే, తూర్పు దక్షిణ భారతాలలో ఎక్కువగా వున్నాయి. మధుర, తిరుచిరాపల్లి, ఆర్కాటు, చెంగల్పట్ జిల్లాలలోను, చిత్తూరు, కడప, బళ్ళారి, నెల్లూరు, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలలోను ఈ అవశేషాలున్నాయి. తీర ప్రాంత జిల్లాలలో కంటే పీఠభూమి జిల్లాలలో ఇవి హెచ్చుగా కనిపిస్తున్నాయి. గంగానది ప్రాంతంలో ఇవి అసలే కనిపించటం లేదు. శిలాయుగంలో ప్రాచీన మానవుడు పీఠభూములలోనే సంచరించినట్లు ఇవి. దాఖలాలు. ఆదిమ మానవుడు భరత ఖండానికి సంబంధించినంత వరకు దక్షిణ హిందూ దేశంలో ఆవిర్భవించి వుంటాడని, పంజాబ్ దిశగా పయనించి వుంటాడని చరిత్రకారుల ఊహ. నదీలోయల్లో వ్యవసాయ నాగరికత వికసించినట్టే, పీఠభూములలో, శిలాయుగపు ఆదిమ మానవుడు ఆవిర్భవించి వుంటాడు. ఆస్ట్రేలియా, ఇండోనీషియా, ఆఫ్రికాలలోనూ, పంజాబ్లోని శివాలిక్ కొండలలోనూ ప్రాచీన మానవుని అస్థికంకాళాలు దొరికాయి.© 2017,www.logili.com All Rights Reserved.