Andala Telugu Katha

By Koduru Sriramamurthy (Author)
Rs.150
Rs.150

Andala Telugu Katha
INR
MANIMN4293
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

చలం - ఆమె త్యాగం

ఆధునిక తెలుగు కథా సాహిత్యానికి వాడి, వేడి యిచ్చినవాడు చలం. ఆధునిక తెలుగు కథకు శ్రీకారం చుట్టింది గురజాడ వారా? లేక మరొకరా? అనే ప్రశ్న ఎలా వున్నప్పటికీ తెలుగు కథ వినూత్న పోకడలు పొందింది చలం కలం వెలుగులలోనే! - దాదాపు వంద కథలు, తొమ్మిది నవలలు రాసిన చలం తాను చేపట్టిన ప్రతి సాహిత్య ప్రక్రియలోనూ ఒక కొత్తదనాన్ని చూపించాడు. తెలుగు సాహిత్యంలో ఒక ఉప్పెన చలం.

తెలుగు సాహిత్యంలో వ్యక్తి వాదానికి, వ్యక్తి స్వేచ్ఛకు చలం యిచ్చినంత ప్రాధాన్యతను యిచ్చిన రచయితలు చాలా అరుదుగా కనబడతారు. నీతి పేరిట సమాజంలో ప్రచారంలో వున్న మూఢ విశ్వాసాలను, అణచివేత ధోరణులను, చలం తన రచనలలో దుయ్యబట్టాడు. నీతి పేరుతో వ్యవస్థ బిగించిన 'చట్రం'లో నిస్సహాయంగా బలియైపోతున్న స్త్రీ గురించి అతడు ఆవేదన చెందాడు.

చలం భావాలు ఎంత ఆలజడిని సృష్టించేవిగా వుంటాయో అతడి శైలి గూడా అంతటి ప్రత్యేకతను కలిగి వుంటుంది. అయితే తన రచనలలోని విషయాన్ని గ్రహించకుండా శైలిని మాత్రమే మెచ్చుకునే కొందరు వ్యక్తులను చూచి చలం జాలిపడేవాడు.

“-నా అభిప్రాయాలతో ఏకీభవించమనను గానీ, నా శైలిని విడదీసి యోచిస్తే నాకు కోపం. ఆ మాటకు అర్థం ఏమిటంటే, మీ అభిప్రాయాలు సరియైనవేగాని, వాటిని అంగీకరించే ధైర్యం చాలలేదన్నమాట” అంటూ చలం “నేనూ, నా శైలీ తగలడనూ నా అమీనా! నా అమీనా!" అని అంటాడు.

“-ఇతడు నా భర్త. ఈమె నా భార్య. ఎవరికీ దక్కనీక నాదాన్ని చేసుకోవాలి. 99 యావజ్జీవితమూ అనుభవించాలి. అదేగా పెళ్ళి" అంటూ వివాహ వ్యవస్థను దుయ్యబట్టిన చలం అందుకు కారణాలను చెబుతూ " - పెళ్ళి అనేదానితో నాకు ఎందుకు విరోధం? పెళ్ళి వ్యభిచారం క్రింద మారింది కనుక” అని, వివాహ వ్యవస్థలో స్త్రీ భరించవలసి వస్తున్న 'యిష్టంలేని సెక్స్'కు జాలిపడ్డాడు. యిట్లాంటి అభిప్రాయాలను ఛాందసులు.................

చలం - ఆమె త్యాగం ఆధునిక తెలుగు కథా సాహిత్యానికి వాడి, వేడి యిచ్చినవాడు చలం. ఆధునిక తెలుగు కథకు శ్రీకారం చుట్టింది గురజాడ వారా? లేక మరొకరా? అనే ప్రశ్న ఎలా వున్నప్పటికీ తెలుగు కథ వినూత్న పోకడలు పొందింది చలం కలం వెలుగులలోనే! - దాదాపు వంద కథలు, తొమ్మిది నవలలు రాసిన చలం తాను చేపట్టిన ప్రతి సాహిత్య ప్రక్రియలోనూ ఒక కొత్తదనాన్ని చూపించాడు. తెలుగు సాహిత్యంలో ఒక ఉప్పెన చలం. తెలుగు సాహిత్యంలో వ్యక్తి వాదానికి, వ్యక్తి స్వేచ్ఛకు చలం యిచ్చినంత ప్రాధాన్యతను యిచ్చిన రచయితలు చాలా అరుదుగా కనబడతారు. నీతి పేరిట సమాజంలో ప్రచారంలో వున్న మూఢ విశ్వాసాలను, అణచివేత ధోరణులను, చలం తన రచనలలో దుయ్యబట్టాడు. నీతి పేరుతో వ్యవస్థ బిగించిన 'చట్రం'లో నిస్సహాయంగా బలియైపోతున్న స్త్రీ గురించి అతడు ఆవేదన చెందాడు. చలం భావాలు ఎంత ఆలజడిని సృష్టించేవిగా వుంటాయో అతడి శైలి గూడా అంతటి ప్రత్యేకతను కలిగి వుంటుంది. అయితే తన రచనలలోని విషయాన్ని గ్రహించకుండా శైలిని మాత్రమే మెచ్చుకునే కొందరు వ్యక్తులను చూచి చలం జాలిపడేవాడు. “-నా అభిప్రాయాలతో ఏకీభవించమనను గానీ, నా శైలిని విడదీసి యోచిస్తే నాకు కోపం. ఆ మాటకు అర్థం ఏమిటంటే, మీ అభిప్రాయాలు సరియైనవేగాని, వాటిని అంగీకరించే ధైర్యం చాలలేదన్నమాట” అంటూ చలం “నేనూ, నా శైలీ తగలడనూ నా అమీనా! నా అమీనా!" అని అంటాడు. “-ఇతడు నా భర్త. ఈమె నా భార్య. ఎవరికీ దక్కనీక నాదాన్ని చేసుకోవాలి. 99 యావజ్జీవితమూ అనుభవించాలి. అదేగా పెళ్ళి" అంటూ వివాహ వ్యవస్థను దుయ్యబట్టిన చలం అందుకు కారణాలను చెబుతూ " - పెళ్ళి అనేదానితో నాకు ఎందుకు విరోధం? పెళ్ళి వ్యభిచారం క్రింద మారింది కనుక” అని, వివాహ వ్యవస్థలో స్త్రీ భరించవలసి వస్తున్న 'యిష్టంలేని సెక్స్'కు జాలిపడ్డాడు. యిట్లాంటి అభిప్రాయాలను ఛాందసులు.................

Features

  • : Andala Telugu Katha
  • : Koduru Sriramamurthy
  • : Sahithi prachuranalu
  • : MANIMN4293
  • : Paperback
  • : April, 2023
  • : 211
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andala Telugu Katha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam