సంపాదకుల మాట
ఒక ఆలోచన వస్తుంది. కొన్ని ప్రయత్నాలు చేస్తాము. అవి కార్యరూపం దాల్చిన తరువాత కానీ ఆ ఆలోచన ఫలితం ఎంత గొప్పదో అర్థం కాదు. ఆన్వీక్షకి స్థాపన, ఆ తరువాత దాదాపు 200 పుస్తకాల ప్రచురణ అలాంటిదే. ఈ రోజు మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం కూడా అలాంటిదే.
నాలుగేళ్ల క్రితం ఈ సంకలనం తేవాలనే ఆలోచన వచ్చినప్పుడు ప్రపంచం ఇలా లేదు. కోవిడ్ అప్పుడప్పుడే తగ్గి ఇరవై ఒకటో శతాబ్దపు మూడో దశకంలోకి అడుగుపెడుతున్న రోజులు. చాలా కాలం బయట మనిషిని కలవకుండా జాగ్రత్తగా గడిపిన రోజులు ముగిసి, మామూలు రోజులు వస్తున్నాయని నమ్మకం మొదలౌతున్న రోజులు. ఒక సాయంత్రం కొంతమంది మిత్రులం కలిసి తెలుగు సాహిత్యంలో గత కొంతకాలంగా వస్తున్న మార్పుల గురించి మాట్లాడుకున్నాం. యువ రచయితలని వేళ్ల మీద లెక్కపెడితే వేళ్లు మిగిలిపొయే రోజునుంచి ఆ సంఖ్య వందకి దగ్గరగా చేరుతున్న సంగతి ఆనందంగా తల్చుకున్నాం. ఇలా కొత్తగా రాయడం మొదలుపెట్టిన తరం ఎలాంటి కథలు రాస్తున్నారు అని మరికొంతసేపు చర్చించాం. అలా పుట్టిన ఆలోచన నూతన శతాబ్దంలో తమ సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించిన రచయితల కథా సంకలనం తెస్తే బాగుంటుందని. 2021లో ఉన్నాం కాబట్టి 21 కథలతో, '21వ శతాబ్దపు తెలుగు కథ' అని ఈ సంకలనాన్ని తీసుకొస్తే బావుంటుందని అనుకున్నాం. 21 సంవత్సరాలలో వచ్చిన కథలని అన్వేషించడానికి వేంపల్లె షరీఫ్, అరిపిరాల సత్యప్రసాద్, చందు తులసి, మానస ఎండ్లూరి మొదలైనవారితో పని మొదలైంది. వీలైనన్ని పత్రికలు, సంకలనాలు తిరగేసి నూటాయాభై రచయితల లిస్ట్ (వీళ్లంతా 2000 తరువాత మొదలుపెట్టినవాళ్లే), వాళ్ల ఉత్తమ కథలతో ఒక జాబితా తయారైంది. ఆ తరువాత వివిధ కారణాల వల్ల పనులు మందగించి, ఆ పుస్తకం వెలుగు చూడలేదు.............
సంపాదకుల మాట ఒక ఆలోచన వస్తుంది. కొన్ని ప్రయత్నాలు చేస్తాము. అవి కార్యరూపం దాల్చిన తరువాత కానీ ఆ ఆలోచన ఫలితం ఎంత గొప్పదో అర్థం కాదు. ఆన్వీక్షకి స్థాపన, ఆ తరువాత దాదాపు 200 పుస్తకాల ప్రచురణ అలాంటిదే. ఈ రోజు మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం కూడా అలాంటిదే. నాలుగేళ్ల క్రితం ఈ సంకలనం తేవాలనే ఆలోచన వచ్చినప్పుడు ప్రపంచం ఇలా లేదు. కోవిడ్ అప్పుడప్పుడే తగ్గి ఇరవై ఒకటో శతాబ్దపు మూడో దశకంలోకి అడుగుపెడుతున్న రోజులు. చాలా కాలం బయట మనిషిని కలవకుండా జాగ్రత్తగా గడిపిన రోజులు ముగిసి, మామూలు రోజులు వస్తున్నాయని నమ్మకం మొదలౌతున్న రోజులు. ఒక సాయంత్రం కొంతమంది మిత్రులం కలిసి తెలుగు సాహిత్యంలో గత కొంతకాలంగా వస్తున్న మార్పుల గురించి మాట్లాడుకున్నాం. యువ రచయితలని వేళ్ల మీద లెక్కపెడితే వేళ్లు మిగిలిపొయే రోజునుంచి ఆ సంఖ్య వందకి దగ్గరగా చేరుతున్న సంగతి ఆనందంగా తల్చుకున్నాం. ఇలా కొత్తగా రాయడం మొదలుపెట్టిన తరం ఎలాంటి కథలు రాస్తున్నారు అని మరికొంతసేపు చర్చించాం. అలా పుట్టిన ఆలోచన నూతన శతాబ్దంలో తమ సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించిన రచయితల కథా సంకలనం తెస్తే బాగుంటుందని. 2021లో ఉన్నాం కాబట్టి 21 కథలతో, '21వ శతాబ్దపు తెలుగు కథ' అని ఈ సంకలనాన్ని తీసుకొస్తే బావుంటుందని అనుకున్నాం. 21 సంవత్సరాలలో వచ్చిన కథలని అన్వేషించడానికి వేంపల్లె షరీఫ్, అరిపిరాల సత్యప్రసాద్, చందు తులసి, మానస ఎండ్లూరి మొదలైనవారితో పని మొదలైంది. వీలైనన్ని పత్రికలు, సంకలనాలు తిరగేసి నూటాయాభై రచయితల లిస్ట్ (వీళ్లంతా 2000 తరువాత మొదలుపెట్టినవాళ్లే), వాళ్ల ఉత్తమ కథలతో ఒక జాబితా తయారైంది. ఆ తరువాత వివిధ కారణాల వల్ల పనులు మందగించి, ఆ పుస్తకం వెలుగు చూడలేదు.............© 2017,www.logili.com All Rights Reserved.