Ammante Neelakasam

Rs.100
Rs.100

Ammante Neelakasam
INR
VISHALA964
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           'నారంశెట్టి' అనే మాటకు 'స్వచ్చమైన జలం' అని అర్థాన్నివ్వచ్చు శబ్దవేత్తలెవరైనా. శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు సాహిత్యం కూడా అటువంటిదే. ప్రవాహగతిలో సాగే కథలే ఇవన్నీ. కథలు చెప్పడంలో గొప్ప నేర్పు, తీర్పు కనబడతాయి. ఊహించని మలుపులతో ముగుస్తాయి. ఏ అంశాన్ని తీసుకున్నా సున్నితంగా చెప్పడం ఆయనకు అలవాటు. సులభశైలి, సుతిమెత్తని వాక్యాలు, సునిశిత చమత్కారం, అదుపులో ఉండే అంతర్లీనాగ్రహం. వాటన్నిటితో పాటు రచయితకు ఉండవలసిన సామాజిక బాధ్యత ప్రతి కథలోనూ ద్యోతకమవుతాయి. ఆయన కథల్లో పరిమళించే మానవత్వం ఒక సాహితీ గుబాళింపు. ఆయన ఆలోచనల నుంచి ఉబికివచ్చే అక్షరాలూ పాఠకుడితో పాటు పరుగిడతాయి. చక్కని సాహిత్యం సమాజ నిర్మాణానికి పనికి వస్తుందనే విషయం నారంశెట్టి కథలు చదివాక పఠిత మనసును పట్టి కదుపుతుంది.

              పిల్లలు బాగోలేక పోయినా తల్లిదండ్రులు వాళ్ళను గుండెల్లో పెట్టి చూసుకుంటారు. తల్లిదండ్రులు బాగా లేరని.. వాళ్ళు పల్లెటూరి వాళ్ళని, మాటతీరు సరిగా ఉండదని.. వారిని స్నేహితుల ముందు తల్లిదండ్రులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడిన అమ్మాయికి.. ఆమె తమ్ముడు, స్నేహితురాళ్ళు ఆమె కళ్ళు తెరిపిస్తారు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎలా ఉన్నా గౌరవిస్తాము. ఎక్కడో ఉన్న దేవుళ్ళ కన్నా మనల్ని ఉన్నత స్థితిలో నిలిపే వీళ్ళే ప్రత్యక్ష దైవాలు.. అందచందాలు, హోదాలు, స్నేహానికి అడ్డు రాకూడదు.. అని చెప్పే కథ.. "అమ్మంటే నీలాకాశం". ఇలా ప్రతి కథలోనూ ఒక సందేశం, ఒక నీతి అందించాలనే తపన కనిపిస్తుంది. తనకు ఎదురైనా అనేక సంఘటనల్ని కథలుగా చెప్పాలనే ప్రయత్నమే ఈ కథలు. కథకుడిగా మరిన్ని మంచికథల్ని పాఠకలోకానికి అందించాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ అభినందిస్తున్నాను.

                                             - గంటేడ గౌరునాయుడు

           'నారంశెట్టి' అనే మాటకు 'స్వచ్చమైన జలం' అని అర్థాన్నివ్వచ్చు శబ్దవేత్తలెవరైనా. శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు సాహిత్యం కూడా అటువంటిదే. ప్రవాహగతిలో సాగే కథలే ఇవన్నీ. కథలు చెప్పడంలో గొప్ప నేర్పు, తీర్పు కనబడతాయి. ఊహించని మలుపులతో ముగుస్తాయి. ఏ అంశాన్ని తీసుకున్నా సున్నితంగా చెప్పడం ఆయనకు అలవాటు. సులభశైలి, సుతిమెత్తని వాక్యాలు, సునిశిత చమత్కారం, అదుపులో ఉండే అంతర్లీనాగ్రహం. వాటన్నిటితో పాటు రచయితకు ఉండవలసిన సామాజిక బాధ్యత ప్రతి కథలోనూ ద్యోతకమవుతాయి. ఆయన కథల్లో పరిమళించే మానవత్వం ఒక సాహితీ గుబాళింపు. ఆయన ఆలోచనల నుంచి ఉబికివచ్చే అక్షరాలూ పాఠకుడితో పాటు పరుగిడతాయి. చక్కని సాహిత్యం సమాజ నిర్మాణానికి పనికి వస్తుందనే విషయం నారంశెట్టి కథలు చదివాక పఠిత మనసును పట్టి కదుపుతుంది.               పిల్లలు బాగోలేక పోయినా తల్లిదండ్రులు వాళ్ళను గుండెల్లో పెట్టి చూసుకుంటారు. తల్లిదండ్రులు బాగా లేరని.. వాళ్ళు పల్లెటూరి వాళ్ళని, మాటతీరు సరిగా ఉండదని.. వారిని స్నేహితుల ముందు తల్లిదండ్రులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడిన అమ్మాయికి.. ఆమె తమ్ముడు, స్నేహితురాళ్ళు ఆమె కళ్ళు తెరిపిస్తారు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎలా ఉన్నా గౌరవిస్తాము. ఎక్కడో ఉన్న దేవుళ్ళ కన్నా మనల్ని ఉన్నత స్థితిలో నిలిపే వీళ్ళే ప్రత్యక్ష దైవాలు.. అందచందాలు, హోదాలు, స్నేహానికి అడ్డు రాకూడదు.. అని చెప్పే కథ.. "అమ్మంటే నీలాకాశం". ఇలా ప్రతి కథలోనూ ఒక సందేశం, ఒక నీతి అందించాలనే తపన కనిపిస్తుంది. తనకు ఎదురైనా అనేక సంఘటనల్ని కథలుగా చెప్పాలనే ప్రయత్నమే ఈ కథలు. కథకుడిగా మరిన్ని మంచికథల్ని పాఠకలోకానికి అందించాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ అభినందిస్తున్నాను.                                              - గంటేడ గౌరునాయుడు

Features

  • : Ammante Neelakasam
  • : Naaramsetty Umamaheswara Rao
  • : Vishalandhra Publishers
  • : VISHALA964
  • : Paperback
  • : 2016
  • : 125
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ammante Neelakasam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam