పురాణాల ప్రకారం స్వర్గానికి అధిపతి, దేవతలకు రాజు ఇంద్రుడు. అసలు "స్వర్గం ఎక్కడ వుంది? ఎలా వుంటుంది?" అనే ప్రశ్నలకు జవాబు చెప్పటానికి నిజంగా స్వర్గం చూసి వచ్చిన వారెవరూ లేరు. కానీ పురాణాలలోని వర్ణనల ఆధారంగా మన సినిమాలలో కృత్రిమంగా స్వర్గం నిర్మించి చూపిస్తుంటారు. అంతవరకే మనం స్వర్గాన్ని చూడగలం. కానీ ఏదైనా అద్భుత ప్రదేశాన్ని వర్ణించేటప్పుడు "అబ్బా స్వర్గంలా వుంది" అంటారు ప్రతివారు. కానీ నిజం స్వర్గం యెక్కడ వుందో కూడా తెలియదు. అసలు ఈ స్వర్గం యెక్కడ వుంది? అనే అంశం మన దేశస్తులకే కాదు విదేశీయులకీ ఆసక్తి కలిగించింది. ఎందరో విదేశీయులు దాని గూర్చి పరిశోధనలు చేశారు.
- పోలిశెట్టి బ్రదర్స్