Mahabharata Pranavamu Anugitakara Deepika

Rs.465
Rs.465

Mahabharata Pranavamu Anugitakara Deepika
INR
MANIMN4684
In Stock
465.0
Rs.465


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శ్రీశృంగేరీ జగద్గురు చరణారవిన్దాభ్యాం నమః
శ్రీకృష్ణ, శ్రీకృష్ణద్వైపాయన, శ్రీశంకరాచార్య జగద్గురు
శ్రీ చరణారవిందములకు ప్రణామములు.

మహాభారతప్రణవము
నివేదనము

మహాభారతప్రణవములో చివరిది అనుగీతాకరదీపిక. ఇది ఆశ్వమేధిక పర్వములో ముప్పదిఆరధ్యాయములతో అలరారుచున్న గ్రంథభాగము. ఇదియు భీష్మపర్వమునందలి భగవద్గీతవలె శ్రీకృష్ణార్జున సంవాదాత్మకమే. ఒక విధముగా భగవద్గీతకు అనుగీత భగవంతుడే చేసిన వ్యాఖ్యానము. ప్రసన్న గంభీరమైన జ్ఞానభాండాగారము.

దీనికి శరశర్మ సుమారు పదునైదు సంవత్సరములకు పూర్వము 'కరదీపిక' పేరుతో సులభగ్రాహ్యమగు సంక్షిప్తవ్యాఖ్యానము వ్రాసి ప్రకటించి యున్నాడు. దానిని భూమికాప్రాయముగా ఈ గ్రంథమునకు జోడించు చున్నాడు. మందమధ్యమాధికారులకు అది మార్గదర్శనము చేయింపగల కరదీపిక కాగలదు.

శ్రీమహాభారతము నాలుగు పురుషార్థములను గూర్చి మానవమాత్రులు తెలిసికొనదగిన సర్వవిషయములను, మరొకగ్రంథముపై చూపుపెట్టనవ సరములేకుండ, తెలియజేసినది. మహాభారతము శాస్త్రేతిహాసము. అందు జ్ఞాతవ్యవిషయములను కథాసూత్రమున నిబంధించి విశాలబుద్ధియగు వేద వ్యాసులవారు అందించిరి. కాలమానపరిస్థితులను బట్టి సపాదలక్షగ్రంథ మైన మహాభారతమును అధ్యయనము చేయలేనివారికి, ప్రధాన ఆధ్యాత్మిక గ్రంథభాగములను విడివిడిగా సవ్యాఖ్యానముగా అందించు ప్రయత్నములో మహాభారతప్రణవము రూపొందుచున్నది. ఆ ప్రణాళికలో తొమ్మిదవది యీ అనుగీతాకరదీపిక.

గంభీరమైన వేదాంతరహస్యములను తెలుగువారి హృదయములకు వీలయినంత సన్నిహితముగా చేయుటకు, చేతనైన ప్రయత్నమంతయు చిత్తశుద్ధితో చేయబడినది. ఆసక్తికలవారు కొలదిపాటి ప్రయత్నముతో దీనిని అధ్యయనము చేసి జ్ఞానసోపానాధిగమము చేయవచ్చును.............

శ్రీశృంగేరీ జగద్గురు చరణారవిన్దాభ్యాం నమః శ్రీకృష్ణ, శ్రీకృష్ణద్వైపాయన, శ్రీశంకరాచార్య జగద్గురు శ్రీ చరణారవిందములకు ప్రణామములు. మహాభారతప్రణవము నివేదనము మహాభారతప్రణవములో చివరిది అనుగీతాకరదీపిక. ఇది ఆశ్వమేధిక పర్వములో ముప్పదిఆరధ్యాయములతో అలరారుచున్న గ్రంథభాగము. ఇదియు భీష్మపర్వమునందలి భగవద్గీతవలె శ్రీకృష్ణార్జున సంవాదాత్మకమే. ఒక విధముగా భగవద్గీతకు అనుగీత భగవంతుడే చేసిన వ్యాఖ్యానము. ప్రసన్న గంభీరమైన జ్ఞానభాండాగారము. దీనికి శరశర్మ సుమారు పదునైదు సంవత్సరములకు పూర్వము 'కరదీపిక' పేరుతో సులభగ్రాహ్యమగు సంక్షిప్తవ్యాఖ్యానము వ్రాసి ప్రకటించి యున్నాడు. దానిని భూమికాప్రాయముగా ఈ గ్రంథమునకు జోడించు చున్నాడు. మందమధ్యమాధికారులకు అది మార్గదర్శనము చేయింపగల కరదీపిక కాగలదు. శ్రీమహాభారతము నాలుగు పురుషార్థములను గూర్చి మానవమాత్రులు తెలిసికొనదగిన సర్వవిషయములను, మరొకగ్రంథముపై చూపుపెట్టనవ సరములేకుండ, తెలియజేసినది. మహాభారతము శాస్త్రేతిహాసము. అందు జ్ఞాతవ్యవిషయములను కథాసూత్రమున నిబంధించి విశాలబుద్ధియగు వేద వ్యాసులవారు అందించిరి. కాలమానపరిస్థితులను బట్టి సపాదలక్షగ్రంథ మైన మహాభారతమును అధ్యయనము చేయలేనివారికి, ప్రధాన ఆధ్యాత్మిక గ్రంథభాగములను విడివిడిగా సవ్యాఖ్యానముగా అందించు ప్రయత్నములో మహాభారతప్రణవము రూపొందుచున్నది. ఆ ప్రణాళికలో తొమ్మిదవది యీ అనుగీతాకరదీపిక. గంభీరమైన వేదాంతరహస్యములను తెలుగువారి హృదయములకు వీలయినంత సన్నిహితముగా చేయుటకు, చేతనైన ప్రయత్నమంతయు చిత్తశుద్ధితో చేయబడినది. ఆసక్తికలవారు కొలదిపాటి ప్రయత్నముతో దీనిని అధ్యయనము చేసి జ్ఞానసోపానాధిగమము చేయవచ్చును.............

Features

  • : Mahabharata Pranavamu Anugitakara Deepika
  • : Shalaka Raghunadha Sharma
  • : Anadavalli Grandamalal, Rajamahendravaram
  • : MANIMN4684
  • : paparback
  • : 2023
  • : 400
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mahabharata Pranavamu Anugitakara Deepika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam