రాజా రామదాసుగారి బంగళా ముంగిట ఉదయసూర్యుని బంగారు కిరణాలు రంగవల్లులు తీరుస్తున్నాయి. గార్డెన్లో వున్న పచ్చని ఆకులమీద కురిసిన మంచు ముత్యాల్లా మెరుస్తోంది. సూర్యుడికైనా సరే ఆ బంగళా మొత్తం చూడాలంటే తూర్చునించి పడమరకు తిరిగేటంత టైం పడుతుంది. బంగళా ఆవరణలో శ్రీరాముని కోవెలవుంది. పూజారిగారు ఎల్లవేళలా కోవెలనే కనిపెట్టుకుని వుంటూ స్వామివారికి నిత్యం ధూపదీపనైవేద్యాలు సమకూరుస్తుంటారు. శ్రీరామనవమికి స్వామివారికి సర్వాలంకరణ చేసి కల్యాణం జరపటం ఆ యింటి సంప్రదాయం.
రాజా రామదాసుగారు సౌమ్య గంభీరమూర్తి, ఆయన్ని చూస్తే కోపం దూరంగా వెళ్ళి చేతులు కట్టుకుని నుంచుంటుంది. ద్రోహం, మోసం, ఆ ఛాయల్లో తలెత్తుకు తిరగలేవు. రామదాసుగారి ప్రేమాభిమానాలు కూడా ఆయన చేసే దానాల్లాగే గుప్తంగా వుంటాయి. తొంభైతొమ్మిది పెళ్ళిళ్ళు చేయించిన పుణ్యమూర్తి. కలిపురుషుడు నలమహారాజుతో తప్పు చేయించటానికి ఎంత శ్రమపడ్డాడో రామదాసుగారితో తప్పు చేయించటానికి అంతకన్నా ఎన్నోరెట్లు శ్రమపడాలన్నమాట..................................
రాజా రామదాసుగారి బంగళా ముంగిట ఉదయసూర్యుని బంగారు కిరణాలు రంగవల్లులు తీరుస్తున్నాయి. గార్డెన్లో వున్న పచ్చని ఆకులమీద కురిసిన మంచు ముత్యాల్లా మెరుస్తోంది. సూర్యుడికైనా సరే ఆ బంగళా మొత్తం చూడాలంటే తూర్చునించి పడమరకు తిరిగేటంత టైం పడుతుంది. బంగళా ఆవరణలో శ్రీరాముని కోవెలవుంది. పూజారిగారు ఎల్లవేళలా కోవెలనే కనిపెట్టుకుని వుంటూ స్వామివారికి నిత్యం ధూపదీపనైవేద్యాలు సమకూరుస్తుంటారు. శ్రీరామనవమికి స్వామివారికి సర్వాలంకరణ చేసి కల్యాణం జరపటం ఆ యింటి సంప్రదాయం. రాజా రామదాసుగారు సౌమ్య గంభీరమూర్తి, ఆయన్ని చూస్తే కోపం దూరంగా వెళ్ళి చేతులు కట్టుకుని నుంచుంటుంది. ద్రోహం, మోసం, ఆ ఛాయల్లో తలెత్తుకు తిరగలేవు. రామదాసుగారి ప్రేమాభిమానాలు కూడా ఆయన చేసే దానాల్లాగే గుప్తంగా వుంటాయి. తొంభైతొమ్మిది పెళ్ళిళ్ళు చేయించిన పుణ్యమూర్తి. కలిపురుషుడు నలమహారాజుతో తప్పు చేయించటానికి ఎంత శ్రమపడ్డాడో రామదాసుగారితో తప్పు చేయించటానికి అంతకన్నా ఎన్నోరెట్లు శ్రమపడాలన్నమాట..................................© 2017,www.logili.com All Rights Reserved.