Karpoora Harathi Pooja Sumam

Rs.90
Rs.90

Karpoora Harathi Pooja Sumam
INR
EMESCO0840
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ఆమె చేతిలో సీసా చూచి గావుకేక పెట్టాడు నీలకాంత్. "ఏం పని చేశావు అంజనా?" ఒక్క అంగలో వెళ్లి ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు. విషాదహాసం చేసింది. "ఇంతకంటే గత్యంతరం లేకపోయింది" మెల్లగా అతడి చేతుల నుండి పాదాలమీదికి జారింది. భర్త ముఖంలోకి వాలిపోతున్న కళ్ళను విచ్చి చూస్తూ, క్రమ క్రమంగా క్షీణించిపోతున్న గొంతుతో అన్నది. "భర్త కంటే మిన్న అయినదీ, వాంచించ తగినదీ ఈ ప్రపంచంలో మరేదీ లేదని తెలుసుకున్న స్త్రీ దౌర్భాగ్యవశం చేత పరిత్యక్త అయితే, ఆమె జీవితం ఎంత దుర్భరమో స్త్రీకి నిర్వచనం తెలిసినవారికే అవగాహన.

              "సౌరభ రహితమూ, సౌందర విహీనమూ అయిన పువ్వును కూడా దేవుని శిరసున పెట్టగలిగితే ఆ పువ్వు పవిత్రతకు మరే పువ్వూ సరితూగలేదు. దాని విలువ ఎంతో అపారం. గతంలో నేనెంత పాపమైనా చేసి ఉండవచ్చు. దుష్టమతినే కావచ్చు. భాగ్యవాశంచేత నాకు జ్ఞానోదయమైంది. నిండు భక్తి ప్రపత్తులతో నా పాటి చరణాలకు నా హృదయం అర్పించుకున్నాను. ఒకనాటి నా కళంక చరిత్ర ఈ నివేదనతో పరిశుద్ధమూ, నిష్కళంకమూ అయినదనే అనుకుంటున్నాను. ఇక ఏ పాపమూ నా వెంట రాదన్న సంతృప్తితో కన్ను మూస్తున్నాను."

                                        - పూజా సుమం

             ఆమె చేతిలో సీసా చూచి గావుకేక పెట్టాడు నీలకాంత్. "ఏం పని చేశావు అంజనా?" ఒక్క అంగలో వెళ్లి ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు. విషాదహాసం చేసింది. "ఇంతకంటే గత్యంతరం లేకపోయింది" మెల్లగా అతడి చేతుల నుండి పాదాలమీదికి జారింది. భర్త ముఖంలోకి వాలిపోతున్న కళ్ళను విచ్చి చూస్తూ, క్రమ క్రమంగా క్షీణించిపోతున్న గొంతుతో అన్నది. "భర్త కంటే మిన్న అయినదీ, వాంచించ తగినదీ ఈ ప్రపంచంలో మరేదీ లేదని తెలుసుకున్న స్త్రీ దౌర్భాగ్యవశం చేత పరిత్యక్త అయితే, ఆమె జీవితం ఎంత దుర్భరమో స్త్రీకి నిర్వచనం తెలిసినవారికే అవగాహన.               "సౌరభ రహితమూ, సౌందర విహీనమూ అయిన పువ్వును కూడా దేవుని శిరసున పెట్టగలిగితే ఆ పువ్వు పవిత్రతకు మరే పువ్వూ సరితూగలేదు. దాని విలువ ఎంతో అపారం. గతంలో నేనెంత పాపమైనా చేసి ఉండవచ్చు. దుష్టమతినే కావచ్చు. భాగ్యవాశంచేత నాకు జ్ఞానోదయమైంది. నిండు భక్తి ప్రపత్తులతో నా పాటి చరణాలకు నా హృదయం అర్పించుకున్నాను. ఒకనాటి నా కళంక చరిత్ర ఈ నివేదనతో పరిశుద్ధమూ, నిష్కళంకమూ అయినదనే అనుకుంటున్నాను. ఇక ఏ పాపమూ నా వెంట రాదన్న సంతృప్తితో కన్ను మూస్తున్నాను."                                         - పూజా సుమం

Features

  • : Karpoora Harathi Pooja Sumam
  • : Polkampalli Santha Devi
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0840
  • : Paperback
  • : 2017
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Karpoora Harathi Pooja Sumam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam