"సాధనమున పనులు సమకూరు ధరలోన" అను వేమన మాటకు ప్రత్యేక్ష నిదర్శనము శ్రీ శొంఠి కృష్ణమూర్తి గారి ఈ కథా రచన. కథా రచన ఒక సాధనగా తీసుకొని దానిని సాధించినవారు శ్రీ కృష్ణమూర్తి గారు. కథా రచన సాధక బాధకాలన్నీ స్వానుభవములుగావుననే నేడు "కథలు రాయడమెలా" అనే ఈ పుస్తకాన్ని మనకందజేయ గలిగారు. వివిధ భాషలలోని కథలు వాటి విషయమై విమర్శకుల అభిప్రాయలు సేకరించి, స్వానుభవమును జతపరిచి, కథా రచనకు సంబంధించిన అన్ని అంశాలను సవిస్తరముగా చర్చించి కథా రచనకు పూనుకొనదలిచిన తెలుగు ఉత్సాహవంతులగు వారందరికీ ఒక అమూల్య గ్రంథమును సమర్పించినారు."
- కాళోజీ
"కథలు రాయడం మాటలతో పని కాదు. ఇది ఒక కళ. ఈ పుస్తకంలో అనంతమైన శిల్ప సౌందర్యం ఉంది. కథను ఎలా ప్రారంభించాలి, ఎలా దీనికి క్లయిమాక్స్ సృష్టించాలి, ఎలా ముగించాలి అనే ప్రధాన అంశాలు ప్రసిద్ధ రచయితల అభిప్రాయాలతో, ఉదాహరణలతో ప్రసిద్ధ కథకులు కృష్ణమూర్తి గారు రచించిన గ్రంథం ఇది. కథకులు కాగోరి వారికి ఉపయుక్తమైనది".
- ఆంధ్రప్రభ దినపత్రిక
"సాధనమున పనులు సమకూరు ధరలోన" అను వేమన మాటకు ప్రత్యేక్ష నిదర్శనము శ్రీ శొంఠి కృష్ణమూర్తి గారి ఈ కథా రచన. కథా రచన ఒక సాధనగా తీసుకొని దానిని సాధించినవారు శ్రీ కృష్ణమూర్తి గారు. కథా రచన సాధక బాధకాలన్నీ స్వానుభవములుగావుననే నేడు "కథలు రాయడమెలా" అనే ఈ పుస్తకాన్ని మనకందజేయ గలిగారు. వివిధ భాషలలోని కథలు వాటి విషయమై విమర్శకుల అభిప్రాయలు సేకరించి, స్వానుభవమును జతపరిచి, కథా రచనకు సంబంధించిన అన్ని అంశాలను సవిస్తరముగా చర్చించి కథా రచనకు పూనుకొనదలిచిన తెలుగు ఉత్సాహవంతులగు వారందరికీ ఒక అమూల్య గ్రంథమును సమర్పించినారు." - కాళోజీ "కథలు రాయడం మాటలతో పని కాదు. ఇది ఒక కళ. ఈ పుస్తకంలో అనంతమైన శిల్ప సౌందర్యం ఉంది. కథను ఎలా ప్రారంభించాలి, ఎలా దీనికి క్లయిమాక్స్ సృష్టించాలి, ఎలా ముగించాలి అనే ప్రధాన అంశాలు ప్రసిద్ధ రచయితల అభిప్రాయాలతో, ఉదాహరణలతో ప్రసిద్ధ కథకులు కృష్ణమూర్తి గారు రచించిన గ్రంథం ఇది. కథకులు కాగోరి వారికి ఉపయుక్తమైనది". - ఆంధ్రప్రభ దినపత్రిక© 2017,www.logili.com All Rights Reserved.