మనసు మాట!
మానసిక ఒత్తిడులకు అంతగా ప్రాముఖ్యత యివ్వాల్సిన అవసరం లేదని మనసులో ఓ మూల అనిపిస్తున్నా, ఆలోచనను ఏ మాత్రం గౌరవించకుండా అప్రయోజనకరమైన అంశాలకే ప్రాధాన్యత యిస్తూ-
ఏది సరైందో తెలియని స్థితిలో దారి తప్పిన మనసుతో
సందర్భాసందర్భాలలో, గాడితప్పిన మాటతో
అన్నం తినడంపై అశ్రద్ధతో, సన్నగిల్లిన ఆరోగ్యంతో
వ్యర్థ ఆలోచనల తోరణాలలో, వృథా అయిన సమయంతో
విచక్షణలేని వినోదాలలో, అమితమైన ధనవ్యయంతో
వేధిస్తున్న ఒంటరి తనంలో, భరించలేని బాధతో
విషాదాల వలయాలలో, కానరాని సంతోషంతో
అనర్ధమైన ఆవేశాలలో, ఆశపెడుతున్న ప్రలోభంతో
విస్తరించిన చెడు విస్తరిలో, ప్రభవించిన ప్రసాదంతో
జ్ఞాపకశక్తి లేదన్న బాధతో, మీద పడుతున్న వేదాంతంతో
నిత్య జీవితంలో లక్ష్యానికి నష్టం కలిగించే అంశాలను ఆత్మసూచిస్తున్నా ఆ సూచనలు అనుసరించకుండా ప్రవర్తించడం, ప్రభావితులు కావడం, అసంకల్పితంగా ప్రలోభాలలో ప్రమోదాన్ని చూశామని లీలగా సమర్థించుకుంటూ, లోలోపల మనసు వంకరలను కొనసాగనిస్తూ చివరికి, ఏకాగ్రత దెబ్బతిన్నదే అని వేదన చెందడం, ఆ దెబ్బవల్ల కలిగే నష్టం ఓ పర్వతం అంత అయిందే అని,................
మనసు మాట! మానసిక ఒత్తిడులకు అంతగా ప్రాముఖ్యత యివ్వాల్సిన అవసరం లేదని మనసులో ఓ మూల అనిపిస్తున్నా, ఆలోచనను ఏ మాత్రం గౌరవించకుండా అప్రయోజనకరమైన అంశాలకే ప్రాధాన్యత యిస్తూ- ఏది సరైందో తెలియని స్థితిలో దారి తప్పిన మనసుతో సందర్భాసందర్భాలలో, గాడితప్పిన మాటతో అన్నం తినడంపై అశ్రద్ధతో, సన్నగిల్లిన ఆరోగ్యంతో వ్యర్థ ఆలోచనల తోరణాలలో, వృథా అయిన సమయంతో విచక్షణలేని వినోదాలలో, అమితమైన ధనవ్యయంతో వేధిస్తున్న ఒంటరి తనంలో, భరించలేని బాధతో విషాదాల వలయాలలో, కానరాని సంతోషంతో అనర్ధమైన ఆవేశాలలో, ఆశపెడుతున్న ప్రలోభంతో విస్తరించిన చెడు విస్తరిలో, ప్రభవించిన ప్రసాదంతో జ్ఞాపకశక్తి లేదన్న బాధతో, మీద పడుతున్న వేదాంతంతో నిత్య జీవితంలో లక్ష్యానికి నష్టం కలిగించే అంశాలను ఆత్మసూచిస్తున్నా ఆ సూచనలు అనుసరించకుండా ప్రవర్తించడం, ప్రభావితులు కావడం, అసంకల్పితంగా ప్రలోభాలలో ప్రమోదాన్ని చూశామని లీలగా సమర్థించుకుంటూ, లోలోపల మనసు వంకరలను కొనసాగనిస్తూ చివరికి, ఏకాగ్రత దెబ్బతిన్నదే అని వేదన చెందడం, ఆ దెబ్బవల్ల కలిగే నష్టం ఓ పర్వతం అంత అయిందే అని,................© 2017,www.logili.com All Rights Reserved.