పరలోక ప్రాప్తి
1975 నవంబర్ 19
అతను వేగంగా నడుస్తున్నాడు. నడుస్తున్నాడు అనడం కన్నా పరిగెడుతున్నాడనడం సమంజసం. పదేపదే పరిసరాలను పరీక్షగా పరికిస్తున్నాడు. క్షణం క్షణం వులిక్కి పడుతున్నాడు.
అతనికి షుమారు నలభై సంవత్సరాలుంటాయి. దాదాపు ఆరడుగుల ఎత్తుంటాడు. సన్నగా పెద్దగాలి వస్తే ఎగిరి పోయేటట్లు వున్నాడు. ఫ్యాంటు, షర్టు మాసిపోయి మట్టిగొట్టు కొని వున్నాయి. గడ్డం బాగా పెరిగిపోయి, తైల సంస్కారంలేని జుత్తు ముఖంమీద చిందర వందరగా పడుతోంది.
కళావిహీనమైన అతని మొఖంలో నిరూపమాన దేశభక్తి వెలుగును నింపుతోంది. తడబడుతున్న అతని కాళ్ళను అనన్యమైన దీక్ష పరిగెత్తింప చేస్తోంది.
అలా ఇప్పటికి ఎన్ని మైళ్లు పరిగెత్తాడో, ఆయాసంతో విపరీతంగా రొప్పుతున్నాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పరుగెడుతూనే వున్నాడు.
అతని ధ్యేయం ఒకటే! ఎలాగైనా పోలీస్ స్టేషన్ చేరుకోవాలి. లేదా కనీసం సిటీని చేరుకోవాలి. అతను తెలుసుకున్న రహస్యం ప్రభుత్వానికి తెలియచేయాలి.
"బఁయ్" మన్న శబ్దం వినిపించి వెనక్కు చూశాడు. ఏదో కారు వేగంగా వస్తోంది. అతని గుండెలు దడదడ లాడాయి. కాళ్ళు తడబడ్డాయి. వాళ్ళకు చిక్కిన తను ఇప్పటికి తప్పించుకొని బయటపడేసరికి మూడు మాసాలు పట్టింది. ఎట్టకేలకు రహస్యం తెలుసుకొని మరీతప్పించుకు వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ తను దొరికితే ఇక ప్రాణాలతో వుంచారు. ఇప్పుడు ముఖ్యం తన ప్రాణాలు కాదు. తను తెలుసుకున్న రహస్యం!
రోడ్ దిగి పక్కన వున్న పొలాలలోకి పరిగెత్తాడు. వెనుకనుండి వేగంగా వస్తున్న కారు ముందుకు వెళ్ళిపోయింది.
"అది దుండగులు కారే! తను ఏమాత్రం అజాగ్రత్తలో వున్నా యీ పాటికి వాడి మెషిన్ గన్స్కు బలైపోయి వుండేవాడు. "
రెండు నిమిషాలు అలాగే నిలబడి మళ్ళీ రోడుమీదకి రాబోయాడు...................
పరలోక ప్రాప్తి1975 నవంబర్ 19 అతను వేగంగా నడుస్తున్నాడు. నడుస్తున్నాడు అనడం కన్నా పరిగెడుతున్నాడనడం సమంజసం. పదేపదే పరిసరాలను పరీక్షగా పరికిస్తున్నాడు. క్షణం క్షణం వులిక్కి పడుతున్నాడు. అతనికి షుమారు నలభై సంవత్సరాలుంటాయి. దాదాపు ఆరడుగుల ఎత్తుంటాడు. సన్నగా పెద్దగాలి వస్తే ఎగిరి పోయేటట్లు వున్నాడు. ఫ్యాంటు, షర్టు మాసిపోయి మట్టిగొట్టు కొని వున్నాయి. గడ్డం బాగా పెరిగిపోయి, తైల సంస్కారంలేని జుత్తు ముఖంమీద చిందర వందరగా పడుతోంది. కళావిహీనమైన అతని మొఖంలో నిరూపమాన దేశభక్తి వెలుగును నింపుతోంది. తడబడుతున్న అతని కాళ్ళను అనన్యమైన దీక్ష పరిగెత్తింప చేస్తోంది. అలా ఇప్పటికి ఎన్ని మైళ్లు పరిగెత్తాడో, ఆయాసంతో విపరీతంగా రొప్పుతున్నాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పరుగెడుతూనే వున్నాడు. అతని ధ్యేయం ఒకటే! ఎలాగైనా పోలీస్ స్టేషన్ చేరుకోవాలి. లేదా కనీసం సిటీని చేరుకోవాలి. అతను తెలుసుకున్న రహస్యం ప్రభుత్వానికి తెలియచేయాలి. "బఁయ్" మన్న శబ్దం వినిపించి వెనక్కు చూశాడు. ఏదో కారు వేగంగా వస్తోంది. అతని గుండెలు దడదడ లాడాయి. కాళ్ళు తడబడ్డాయి. వాళ్ళకు చిక్కిన తను ఇప్పటికి తప్పించుకొని బయటపడేసరికి మూడు మాసాలు పట్టింది. ఎట్టకేలకు రహస్యం తెలుసుకొని మరీతప్పించుకు వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ తను దొరికితే ఇక ప్రాణాలతో వుంచారు. ఇప్పుడు ముఖ్యం తన ప్రాణాలు కాదు. తను తెలుసుకున్న రహస్యం! రోడ్ దిగి పక్కన వున్న పొలాలలోకి పరిగెత్తాడు. వెనుకనుండి వేగంగా వస్తున్న కారు ముందుకు వెళ్ళిపోయింది. "అది దుండగులు కారే! తను ఏమాత్రం అజాగ్రత్తలో వున్నా యీ పాటికి వాడి మెషిన్ గన్స్కు బలైపోయి వుండేవాడు. " రెండు నిమిషాలు అలాగే నిలబడి మళ్ళీ రోడుమీదకి రాబోయాడు...................© 2017,www.logili.com All Rights Reserved.