దివికుమార్ పరిశీలనలో పాటిబండ్ల ఆనందరావు నాటకం 'పడమటి గాలి'
- బి. సూర్యసాగర్
“ఇది నాటకం కాదు మన ఊళ్ళో మన మనుషుల మధ్య ఉన్నాం నాటకం కొరకు కల్పించిన ఇతివృత్తం కాదు ఆ ఊర్లోవాళ్ళమే మనం మనవాళ్ళ దైనందిన ప్రవర్తనే జరుగుతున్న కథ జరిగింది కాదు ఒక విధంగా మనమూ పాత్రధారులమే కాకపోతే మనకు సంభాషణలు లేవు ఊళ్ళో జరుగుతున్నదాన్ని గమనిస్తున్నాం అంతే!”
ఒక ప్రేక్షకుని అభిప్రాయంగా దీన్ని ఉటంకించారు దివికుమార్. నాటకాన్ని గురించి ఇది పూర్తి నిజం. “పడమటి గాలి” సమకాలీన గ్రామీణ జీవన విధ్వంసానికి అద్దం పట్టింది.
ఇది ఒంగోలు ప్రాంతంలోని గ్రామంలో జరిగినది. ఇంకా చెప్పాలంటే, నిజానికిది భారతదేశం ప్రతి గ్రామంలో జరుగుతున్న కథ. నాటకంలోని ప్రతి పాత్రకు నకలు గ్రామ గ్రామాన కనిపిస్తారు. ప్రతి పాత్ర ఒక నమూనాగా రూపొందింది. గ్రామీణ జీవితాన్ని, పాత్రలను ఎంతో ప్రతిభతో నిశిత పరిశీలన చేసిన దాని ప్రతిబింబమే ఆ నమూనాల ఆవిష్కరణ.
ఎగుమతి ఆధారిత ఉత్పత్తులు ఏవో చేయడానికి ఒక మల్టీనేషనల్ కంపెనీ ఆ పల్లెలో ఓ యాభై ఎకరాల స్థలం కొనడానికి వస్తున్నదని తోకరాముడు (రంగయ్య) పల్లెకు కబురు చేయడంతో మొదలవుతుంది కథ.
ఈ తోకరాముడు పొగాకు రైతుల నుండి కొని ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి, పొగాకు గోడౌను తగలబెట్టి ఇన్సూరెన్సు రాబట్టి ఇప్పుడు పట్టణంలో వుంటున్న రాజకీయ నాయకుని అవతారం ఎత్తినోడు. ఇది తెలియడానికి ఇలాంటి అనేక విషయాలు తెలియడానికి రచ్చబండ వద్ద సంభాషణలు ఉపయోగించుకున్నాడు.........................
దివికుమార్ పరిశీలనలో పాటిబండ్ల ఆనందరావు నాటకం 'పడమటి గాలి' - బి. సూర్యసాగర్ “ఇది నాటకం కాదు మన ఊళ్ళో మన మనుషుల మధ్య ఉన్నాం నాటకం కొరకు కల్పించిన ఇతివృత్తం కాదు ఆ ఊర్లోవాళ్ళమే మనం మనవాళ్ళ దైనందిన ప్రవర్తనే జరుగుతున్న కథ జరిగింది కాదు ఒక విధంగా మనమూ పాత్రధారులమే కాకపోతే మనకు సంభాషణలు లేవు ఊళ్ళో జరుగుతున్నదాన్ని గమనిస్తున్నాం అంతే!” ఒక ప్రేక్షకుని అభిప్రాయంగా దీన్ని ఉటంకించారు దివికుమార్. నాటకాన్ని గురించి ఇది పూర్తి నిజం. “పడమటి గాలి” సమకాలీన గ్రామీణ జీవన విధ్వంసానికి అద్దం పట్టింది. ఇది ఒంగోలు ప్రాంతంలోని గ్రామంలో జరిగినది. ఇంకా చెప్పాలంటే, నిజానికిది భారతదేశం ప్రతి గ్రామంలో జరుగుతున్న కథ. నాటకంలోని ప్రతి పాత్రకు నకలు గ్రామ గ్రామాన కనిపిస్తారు. ప్రతి పాత్ర ఒక నమూనాగా రూపొందింది. గ్రామీణ జీవితాన్ని, పాత్రలను ఎంతో ప్రతిభతో నిశిత పరిశీలన చేసిన దాని ప్రతిబింబమే ఆ నమూనాల ఆవిష్కరణ. ఎగుమతి ఆధారిత ఉత్పత్తులు ఏవో చేయడానికి ఒక మల్టీనేషనల్ కంపెనీ ఆ పల్లెలో ఓ యాభై ఎకరాల స్థలం కొనడానికి వస్తున్నదని తోకరాముడు (రంగయ్య) పల్లెకు కబురు చేయడంతో మొదలవుతుంది కథ. ఈ తోకరాముడు పొగాకు రైతుల నుండి కొని ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి, పొగాకు గోడౌను తగలబెట్టి ఇన్సూరెన్సు రాబట్టి ఇప్పుడు పట్టణంలో వుంటున్న రాజకీయ నాయకుని అవతారం ఎత్తినోడు. ఇది తెలియడానికి ఇలాంటి అనేక విషయాలు తెలియడానికి రచ్చబండ వద్ద సంభాషణలు ఉపయోగించుకున్నాడు.........................© 2017,www.logili.com All Rights Reserved.