“శివరాత్రి ఇంక వారమే వుండేది! నాలుగు దినాలుగా తారాడతావుండా. ఈ రోజు ఎట్టయినా సరే ఎలుగ్గొడ్డాన్ని పట్టుకుని తీరాల. వాళ్ళ గేరికి పోయినా సరే " వాణ్ణి బట్టాల" అనుకుంటూ అడవి మొగదలగా వున్న ఆ పల్లెలోకి అడుగు పెట్టాడు. వీధిలో ఒకచోట గణగణా గంట మోగుతోంది. డక్కీ శబ్దం వినిపిస్తోంది. జనం గుమికూడి వున్నారు.
మెల్లగా అక్కడికి వెళ్ళాడు గురవయ్య. అక్కడ ముడ్డిగంటోడు అడుగేస్తున్నాడు. “రామరామ రామా రామా కోదండరామా
రామరామ రామా రామా జానకీరామా
ఆలిదమ్ములతో అడవికెళ్లిన ఆయోధ్యరామా
రక్కసి మూకల రయమున జంపిన రఘురామా రామా”
అవిరామంగా అతని ఆటాపాటా సాగిపోతోంది.
ముడికి కట్టి వున్న గుంటను ఒక చేత్తో, మెడలో వేలాడుతున్న డక్కీని మరో చేత్తో వాయిస్తూ, ఆ శబ్దానికి అనుగుణంగా కాళ్ళగజ్జెల్ని కదిలిస్తూ చిందులేస్తున్నాడు., పొట్టిగా కండలు తిరిగిన నల్లటి శరీరం ముడ్డిగంటోడిది. బాగా మురికి పట్టివున్న గోచీ, ఓ చేతిరెట్టకు కడియం, మరో చేతి మణికట్టుకు చుట్టిన నల్లటి దారం తప్ప అతని ఒంటిపైన ఏ ఆచ్ఛాదనా లేదు. ఆ పక్కనే పెట్టివున్న జోలె తప్ప తనదంటూ ఏమీ కనిపించడం లేదు. నడివీధే రంగస్థలంగా సాగిపోతోంది ముడ్డిగంట నృత్యం. దాన్ని చూస్తున్న జనాలకదొక వింతగా అనిపిస్తోంది. అతన్ని చూడగానే దార్లో ఎవ్వరో చెప్పిన మాట గురవయ్య చెవుల్లో రింగుమంది....................................
నాలుగో నాటకం “శివరాత్రి ఇంక వారమే వుండేది! నాలుగు దినాలుగా తారాడతావుండా. ఈ రోజు ఎట్టయినా సరే ఎలుగ్గొడ్డాన్ని పట్టుకుని తీరాల. వాళ్ళ గేరికి పోయినా సరే " వాణ్ణి బట్టాల" అనుకుంటూ అడవి మొగదలగా వున్న ఆ పల్లెలోకి అడుగు పెట్టాడు. వీధిలో ఒకచోట గణగణా గంట మోగుతోంది. డక్కీ శబ్దం వినిపిస్తోంది. జనం గుమికూడి వున్నారు. మెల్లగా అక్కడికి వెళ్ళాడు గురవయ్య. అక్కడ ముడ్డిగంటోడు అడుగేస్తున్నాడు. “రామరామ రామా రామా కోదండరామా రామరామ రామా రామా జానకీరామా ఆలిదమ్ములతో అడవికెళ్లిన ఆయోధ్యరామా రక్కసి మూకల రయమున జంపిన రఘురామా రామా”అవిరామంగా అతని ఆటాపాటా సాగిపోతోంది. ముడికి కట్టి వున్న గుంటను ఒక చేత్తో, మెడలో వేలాడుతున్న డక్కీని మరో చేత్తో వాయిస్తూ, ఆ శబ్దానికి అనుగుణంగా కాళ్ళగజ్జెల్ని కదిలిస్తూ చిందులేస్తున్నాడు., పొట్టిగా కండలు తిరిగిన నల్లటి శరీరం ముడ్డిగంటోడిది. బాగా మురికి పట్టివున్న గోచీ, ఓ చేతిరెట్టకు కడియం, మరో చేతి మణికట్టుకు చుట్టిన నల్లటి దారం తప్ప అతని ఒంటిపైన ఏ ఆచ్ఛాదనా లేదు. ఆ పక్కనే పెట్టివున్న జోలె తప్ప తనదంటూ ఏమీ కనిపించడం లేదు. నడివీధే రంగస్థలంగా సాగిపోతోంది ముడ్డిగంట నృత్యం. దాన్ని చూస్తున్న జనాలకదొక వింతగా అనిపిస్తోంది. అతన్ని చూడగానే దార్లో ఎవ్వరో చెప్పిన మాట గురవయ్య చెవుల్లో రింగుమంది....................................© 2017,www.logili.com All Rights Reserved.