అందాల రాజకుమారి
ఒకానొకప్పుడు స్రవంతి దేశాన్ని శ్రవణుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన భార్య ప్రమీల మహా పతివ్రత. ఆ దంపతులకు లేక లేక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు వారు మధుర అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచారు.
తల్లిదండ్రుల గారాబం మధురను పాడుచెయ్యలేదు. ఆమె కావ్యాలు చదివింది. శాస్త్రాలనర్థం చేసుకుంది. యుద్ధవిద్యలు నేర్చుకుంది. లలిత కళల నాకళింపు చేసుకుని కొన్నింట్లో ప్రావీణ్యం సంపాదించింది. నిత్యావసరమ్మెన పాకశాస్త్రం, వైద్యశాస్త్రంలో కూడా అంతో ఇంతో జ్ఞాన సముపార్జన చేసింది.
రాజకుమారి మధుర గురించి స్రవంతి దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా విశేషంగా చెప్పుకుంటారు. అందుకు కారణం ఆమె చదువు, తెలివి, వినయం, సంస్కారం వగైరాలేమీ కాదు. అద్భుతమైన ఆమె సౌందర్యం!
పదహారేళ్ల వయసుకామె బంగారు బొమ్మలా ఉండేది. అలాంటి అందం కనివిని ఎరుగమని అంతా చెప్పుకునేవారు. కవులామె అందాన్ని వర్ణిస్తూ కావ్యాలు సృష్టించారు. చిత్రకారులు, శిల్పులు ఆమె సౌందర్యానికి రూపురేఖలు దిద్దారు. ఎందరో యువకులామెను వివాహమాడాలని కలలుకనేవారు.
అందువల్ల మధురకు అందాల రాజకుమారి అన్న పేరు వచ్చింది. ఎన్నో దేశాల్లో ఎందరో రాజకుమార్తెలు ఉన్నప్పటికీ, అందాల రాజకుమారి మాత్రం మధురే అని అంతా అనేవారు. ఎంతటి అందమైనా ఆమె అందం ముందు దిగదుడుపుగా ఉండడమే అందుకు కారణం.....................
అందాల రాజకుమారి ఒకానొకప్పుడు స్రవంతి దేశాన్ని శ్రవణుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన భార్య ప్రమీల మహా పతివ్రత. ఆ దంపతులకు లేక లేక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు వారు మధుర అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచారు. తల్లిదండ్రుల గారాబం మధురను పాడుచెయ్యలేదు. ఆమె కావ్యాలు చదివింది. శాస్త్రాలనర్థం చేసుకుంది. యుద్ధవిద్యలు నేర్చుకుంది. లలిత కళల నాకళింపు చేసుకుని కొన్నింట్లో ప్రావీణ్యం సంపాదించింది. నిత్యావసరమ్మెన పాకశాస్త్రం, వైద్యశాస్త్రంలో కూడా అంతో ఇంతో జ్ఞాన సముపార్జన చేసింది. రాజకుమారి మధుర గురించి స్రవంతి దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా విశేషంగా చెప్పుకుంటారు. అందుకు కారణం ఆమె చదువు, తెలివి, వినయం, సంస్కారం వగైరాలేమీ కాదు. అద్భుతమైన ఆమె సౌందర్యం! పదహారేళ్ల వయసుకామె బంగారు బొమ్మలా ఉండేది. అలాంటి అందం కనివిని ఎరుగమని అంతా చెప్పుకునేవారు. కవులామె అందాన్ని వర్ణిస్తూ కావ్యాలు సృష్టించారు. చిత్రకారులు, శిల్పులు ఆమె సౌందర్యానికి రూపురేఖలు దిద్దారు. ఎందరో యువకులామెను వివాహమాడాలని కలలుకనేవారు. అందువల్ల మధురకు అందాల రాజకుమారి అన్న పేరు వచ్చింది. ఎన్నో దేశాల్లో ఎందరో రాజకుమార్తెలు ఉన్నప్పటికీ, అందాల రాజకుమారి మాత్రం మధురే అని అంతా అనేవారు. ఎంతటి అందమైనా ఆమె అందం ముందు దిగదుడుపుగా ఉండడమే అందుకు కారణం.....................© 2017,www.logili.com All Rights Reserved.