మోహినీ భస్మాసుర
అది లంకంత కొంప. లంకలాంటి కొంప. దానికి యజమాని భూపతి. ఆగడాల్లో రావణాసురుణ్ణి మించిన ఆయన శక్తి సామర్ధ్యాలలోనూ రావణుడికి తీసిపోడు. అందుకా యి సాక్ష్యం.
ఇంటిని అద్దంలా ఉంచడానికీ, ఇంట్లో అన్నీ అమర్చిపెట్టడానికీ చాలామంది పనివాళ్లున్నారు. వాళ్లందరికీ ఎప్పుడూ చేతినిండా పని. ఇంటిచుట్టూ చెట్లు, పూలమొక్కలు, కాయగూరల పాదులు వగైరాలతో నిండిన పెద్ద తోట. ఇంట్లోవాళ్లని తోటలోకి అనుసంధిస్తూ నాలుగువైపుల నుంచీ దారులు. తోటలో రెండు వాటాల అవుట్ హౌసు. ఓ పోర్షన్లో తోటమాలి. రెండోదాంట్లో మొత్తం పనివాళ్లందరికీ చేతినిండా పనుండేలా చూసే సూపర్వైజరులాంటి కోటయ్య.
తోటలో ఓ పెద్ద సైజు ఆల్సేషియన్ పహరా తిరుగుతూంటుంది. మొరగనప్పుడది సింహంలా ఉండే దాన్ని ముద్దుగా పుస్సీ క్యాట్ అంటాడు భూపతి. నిజంగా పిల్లి అనుకుంటారనేమో అది తరచుగా మొరుగుతూంటుంది. మొరిగే కుక్క కరవదని భ్రమపడి అపరిచితులెవరైనా గోడదూకి తోటలో ప్రవేశిస్తే వాళ్ళని చీల్చి చెండాడే మర్యాద దానిది. దొరల్లా గేటునుంచి రావాలనుకునే వాళ్లు కూడా కొన్ని మర్యాదలు పాటించకపోతే దాని మర్యాదనుంచి తప్పించుకోలేరు.
అచ్చం అలాంటిదే మరో ఆల్సేషియన్ ఇంట్లో తిరుగుతూంటుంది. అన్ని మర్యాదలూ పాటించి లోపలికొచ్చినా సరే - ఇంట్లో కొత్తవాళ్లు అడుగెడితే చాలు- పెద్దగా మొరిగి ఫస్ చేస్తుందని- భూపతి దాన్ని ఫస్సీ క్యాట్ అంటాడు. మర్యాదల విషయంలో ఫస్సీ పుస్సీకి తీసిపోదు.
పుస్సీ, ఫస్సీలను దృష్టిలో ఉంచుకునే- భూపతి ఆ ఇంటి గేటువద్ద పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసాడు. అడ్డమైనవాళ్లూ ఇంట్లో అడుగుపెట్టకుండా చూడ్డం మాత్రమే కాదు- గేటు దాటిన వారి క్షేమానికీ సెక్యూరిటీదే బాధ్యత.
ఇంటి సెక్యూరిటీకి ఇన్ని ఏర్పాట్లున్నా- ఇంట్లో యజమానులనతగినవారంతా ఎక్కువగా ఇంటిబయటే ఉంటారు. కాబట్టి రక్షణ ఇంటికే అనుకోవాలి. లేదా భూపతికి పాపభీతి ఎక్కువనుకోవాలి. పాపభీతి ఉన్నవారికే దైవపూజలూ, రక్షణ ఏర్పాట్లూ అని తెలుసుకుందుకు రాజకీయనాయకుల్నే కాదు, భూపతిని చూడొచ్చు......................
మోహినీ భస్మాసుర అది లంకంత కొంప. లంకలాంటి కొంప. దానికి యజమాని భూపతి. ఆగడాల్లో రావణాసురుణ్ణి మించిన ఆయన శక్తి సామర్ధ్యాలలోనూ రావణుడికి తీసిపోడు. అందుకా యి సాక్ష్యం. ఇంటిని అద్దంలా ఉంచడానికీ, ఇంట్లో అన్నీ అమర్చిపెట్టడానికీ చాలామంది పనివాళ్లున్నారు. వాళ్లందరికీ ఎప్పుడూ చేతినిండా పని. ఇంటిచుట్టూ చెట్లు, పూలమొక్కలు, కాయగూరల పాదులు వగైరాలతో నిండిన పెద్ద తోట. ఇంట్లోవాళ్లని తోటలోకి అనుసంధిస్తూ నాలుగువైపుల నుంచీ దారులు. తోటలో రెండు వాటాల అవుట్ హౌసు. ఓ పోర్షన్లో తోటమాలి. రెండోదాంట్లో మొత్తం పనివాళ్లందరికీ చేతినిండా పనుండేలా చూసే సూపర్వైజరులాంటి కోటయ్య. తోటలో ఓ పెద్ద సైజు ఆల్సేషియన్ పహరా తిరుగుతూంటుంది. మొరగనప్పుడది సింహంలా ఉండే దాన్ని ముద్దుగా పుస్సీ క్యాట్ అంటాడు భూపతి. నిజంగా పిల్లి అనుకుంటారనేమో అది తరచుగా మొరుగుతూంటుంది. మొరిగే కుక్క కరవదని భ్రమపడి అపరిచితులెవరైనా గోడదూకి తోటలో ప్రవేశిస్తే వాళ్ళని చీల్చి చెండాడే మర్యాద దానిది. దొరల్లా గేటునుంచి రావాలనుకునే వాళ్లు కూడా కొన్ని మర్యాదలు పాటించకపోతే దాని మర్యాదనుంచి తప్పించుకోలేరు. అచ్చం అలాంటిదే మరో ఆల్సేషియన్ ఇంట్లో తిరుగుతూంటుంది. అన్ని మర్యాదలూ పాటించి లోపలికొచ్చినా సరే - ఇంట్లో కొత్తవాళ్లు అడుగెడితే చాలు- పెద్దగా మొరిగి ఫస్ చేస్తుందని- భూపతి దాన్ని ఫస్సీ క్యాట్ అంటాడు. మర్యాదల విషయంలో ఫస్సీ పుస్సీకి తీసిపోదు. పుస్సీ, ఫస్సీలను దృష్టిలో ఉంచుకునే- భూపతి ఆ ఇంటి గేటువద్ద పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసాడు. అడ్డమైనవాళ్లూ ఇంట్లో అడుగుపెట్టకుండా చూడ్డం మాత్రమే కాదు- గేటు దాటిన వారి క్షేమానికీ సెక్యూరిటీదే బాధ్యత. ఇంటి సెక్యూరిటీకి ఇన్ని ఏర్పాట్లున్నా- ఇంట్లో యజమానులనతగినవారంతా ఎక్కువగా ఇంటిబయటే ఉంటారు. కాబట్టి రక్షణ ఇంటికే అనుకోవాలి. లేదా భూపతికి పాపభీతి ఎక్కువనుకోవాలి. పాపభీతి ఉన్నవారికే దైవపూజలూ, రక్షణ ఏర్పాట్లూ అని తెలుసుకుందుకు రాజకీయనాయకుల్నే కాదు, భూపతిని చూడొచ్చు......................© 2017,www.logili.com All Rights Reserved.