చంపక సామ్రాజ్యం
ఒకానొకప్పుడు రసాల దేశంలో స్వర్ణగుప్తుడనే ధనవంతుడుండేవాడు. అతడి సిరిసంపదలకు పరిమితి లేదు. అతడికి కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం గల భూములూ, ఎన్నో రకాల వ్యాపారాలూ ఉన్నాయి. విలువ కట్టడానికి సాధ్యంకాని మేలు రకం వజ్రాలు, రత్నాలు, ముత్యాలు అతడివద్ద లెక్కకు మించి ఉన్నాయి.
ఇంత ధనానికి అధిపతి కావడానికి స్వర్ణగుప్తుడు కేవలం న్యాయమార్గాలే అవలంబించాడని చెప్పడం కష్టం. వ్యాపారమన్నాక అంతో ఇంతో మోసం ఉంటుంది కదా! అయినా స్వర్ణగుప్తుడు డబ్బు సంపాదించడానికి వీలైనంత వరకూ న్యాయమార్గాన్నే అనుసరించాడనడానికి ఒక సాక్ష్యముంది. అది అతడి మంచి మనసు.
స్వర్ణగుప్తుడి సహాయంతో ఎందరో పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివారు. అతడి సాయంతో ఎందరో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి క్రమంగా పెద్ద వ్యాపారస్థులయ్యారు. అతడు ధనహీనులకి తక్కువ వడ్డీమీద అప్పులిస్తూంటాడు.
ఇవన్నీకాక దరిద్రుల కోసం అతడు తరచుగా అన్నదానాలు చేస్తూంటాడు.
స్వర్ణగుప్తుడు మంచివాడనడానికి కేవలం ఈ దానాలూ, సహాయాలూ మాత్రమే కారణం కాదు. అతడిలో ప్రేమ ఉంది. హృదయంలో ప్రేమ ఉన్న ఏ మనిషీ కూడా చెడ్డవాడు కాలేడు కదా! మరి స్వర్ణగుప్తుడి ప్రేమయితే ఇంతా అంతా కాదు.....................
చంపక సామ్రాజ్యం ఒకానొకప్పుడు రసాల దేశంలో స్వర్ణగుప్తుడనే ధనవంతుడుండేవాడు. అతడి సిరిసంపదలకు పరిమితి లేదు. అతడికి కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం గల భూములూ, ఎన్నో రకాల వ్యాపారాలూ ఉన్నాయి. విలువ కట్టడానికి సాధ్యంకాని మేలు రకం వజ్రాలు, రత్నాలు, ముత్యాలు అతడివద్ద లెక్కకు మించి ఉన్నాయి. ఇంత ధనానికి అధిపతి కావడానికి స్వర్ణగుప్తుడు కేవలం న్యాయమార్గాలే అవలంబించాడని చెప్పడం కష్టం. వ్యాపారమన్నాక అంతో ఇంతో మోసం ఉంటుంది కదా! అయినా స్వర్ణగుప్తుడు డబ్బు సంపాదించడానికి వీలైనంత వరకూ న్యాయమార్గాన్నే అనుసరించాడనడానికి ఒక సాక్ష్యముంది. అది అతడి మంచి మనసు. స్వర్ణగుప్తుడి సహాయంతో ఎందరో పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివారు. అతడి సాయంతో ఎందరో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి క్రమంగా పెద్ద వ్యాపారస్థులయ్యారు. అతడు ధనహీనులకి తక్కువ వడ్డీమీద అప్పులిస్తూంటాడు. ఇవన్నీకాక దరిద్రుల కోసం అతడు తరచుగా అన్నదానాలు చేస్తూంటాడు. స్వర్ణగుప్తుడు మంచివాడనడానికి కేవలం ఈ దానాలూ, సహాయాలూ మాత్రమే కారణం కాదు. అతడిలో ప్రేమ ఉంది. హృదయంలో ప్రేమ ఉన్న ఏ మనిషీ కూడా చెడ్డవాడు కాలేడు కదా! మరి స్వర్ణగుప్తుడి ప్రేమయితే ఇంతా అంతా కాదు.....................© 2017,www.logili.com All Rights Reserved.