సీమ అస్తిత్వానికి అద్దంపట్టే రచన
- డా. చింతకుంట శివారెడ్డి
-- సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం.
-- కడప సెల్: 9440859872
పుస్తకం గురించి చెప్పేముందు రచయిత రవితేజ గారి గురించి రెండు మాటలు చెప్పాలి..... రవితేజ గారు నిగర్వి, తాను ఒక ఉన్నతమైన పదవిలో అధికారిగా ఉన్నప్పటికీ ఆ హుందాతనాన్ని పక్కనబెట్టి మిత్రుడితో మంచి మిత్రుడిగా, సాహితీవేత్తతో సాహితీకారునిగా, పరిశోధకులతో పరిశోధకుడుగా తనను తాను మలుచుకుపోతున్న గొప్ప సంస్కారి. వృత్తిపరంగా ఆయనకు ఖాళీ సమయం దొరకడం చాలా అరుదు. దొరికిన ఆ కొద్ది సమయంలోనే ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాన ఆయనలో ఎక్కువ, మరీ ముఖ్యంగా చారిత్రకాంశాలపై పరిశోధించడంలో మరో అడుగు ముందుంటారు రవితేజ గారు. తనకంటే మునుపటి రాయలసీమపై చరిత్ర. సంస్కృతి, సాహిత్యాలపై పరిశోధనలు చేసిన, చేస్తున్న ముందు రచయితలను గౌరవంగా తన ముందుమాటలో స్మరించుకోవడం రవితేజగారి వినయానికి నిదర్శనం. అవసరమైతే ఎంతో ఓర్పుతో ఆయా ప్రాంతాలకు తిరిగి, స్వయంగా అక్కడి ప్రదేశాలను అన్వేషించి విషయాన్ని రాబట్టగలరు. అలా ఆయన రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు (ప్రస్తుతం 8 జిల్లాలు) అటు గ్రేటర్ రాయలసీమలో అంతర్భాగమైన నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో తిరిగారు. అందరికీ తెలిసిన విషయాల కంటే భిన్నంగా కొత్తగా తెలుసుకోవాలనే తపన ఆయనలో నాకు కనబడింది. ఆయన తెలుసుకున్న విషయాలను పాఠకులకు తెలియజేసి రాయలసీమ చరిత్రపై విస్తృత పరిశోధనలు జరగాలనేదే ఆయన సంకల్పం. అలా భిన్న ఆలోచనా..............
సీమ అస్తిత్వానికి అద్దంపట్టే రచన - డా. చింతకుంట శివారెడ్డి -- సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం. -- కడప సెల్: 9440859872 పుస్తకం గురించి చెప్పేముందు రచయిత రవితేజ గారి గురించి రెండు మాటలు చెప్పాలి..... రవితేజ గారు నిగర్వి, తాను ఒక ఉన్నతమైన పదవిలో అధికారిగా ఉన్నప్పటికీ ఆ హుందాతనాన్ని పక్కనబెట్టి మిత్రుడితో మంచి మిత్రుడిగా, సాహితీవేత్తతో సాహితీకారునిగా, పరిశోధకులతో పరిశోధకుడుగా తనను తాను మలుచుకుపోతున్న గొప్ప సంస్కారి. వృత్తిపరంగా ఆయనకు ఖాళీ సమయం దొరకడం చాలా అరుదు. దొరికిన ఆ కొద్ది సమయంలోనే ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాన ఆయనలో ఎక్కువ, మరీ ముఖ్యంగా చారిత్రకాంశాలపై పరిశోధించడంలో మరో అడుగు ముందుంటారు రవితేజ గారు. తనకంటే మునుపటి రాయలసీమపై చరిత్ర. సంస్కృతి, సాహిత్యాలపై పరిశోధనలు చేసిన, చేస్తున్న ముందు రచయితలను గౌరవంగా తన ముందుమాటలో స్మరించుకోవడం రవితేజగారి వినయానికి నిదర్శనం. అవసరమైతే ఎంతో ఓర్పుతో ఆయా ప్రాంతాలకు తిరిగి, స్వయంగా అక్కడి ప్రదేశాలను అన్వేషించి విషయాన్ని రాబట్టగలరు. అలా ఆయన రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు (ప్రస్తుతం 8 జిల్లాలు) అటు గ్రేటర్ రాయలసీమలో అంతర్భాగమైన నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో తిరిగారు. అందరికీ తెలిసిన విషయాల కంటే భిన్నంగా కొత్తగా తెలుసుకోవాలనే తపన ఆయనలో నాకు కనబడింది. ఆయన తెలుసుకున్న విషయాలను పాఠకులకు తెలియజేసి రాయలసీమ చరిత్రపై విస్తృత పరిశోధనలు జరగాలనేదే ఆయన సంకల్పం. అలా భిన్న ఆలోచనా..............© 2017,www.logili.com All Rights Reserved.